అందుకే అవతార్ ఆఫర్‌ తిరస్కరించా!! | Govinda Says He Turned Down Role in Avatar | Sakshi
Sakshi News home page

‘జేమ్స్‌ కామెరూన్‌కు ఆ టైటిల్‌ నేనే ఇచ్చా’

Published Tue, Jul 30 2019 3:20 PM | Last Updated on Tue, Jul 30 2019 3:23 PM

Govinda Says He Turned Down Role in Avatar - Sakshi

ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన హాలీవుడ్ విజువల్ వండర్‌ అవతార్ సినిమాకు టైటిల్‌ను తానే సూచించానంటున్నాడు బాలీవుడ్‌ నటుడు గోవిందా‌. తనకు ఆ సినిమాలో ఆఫర్‌ వచ్చినప్పటికీ తిరస్కరించానని పేర్కొన్నాడు. పండోరా గ్రహంలోని వింత జీవులు మానవులతో చేసిన పోరాటాలు నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమా కలెక‌్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇంతటి భారీ చిత్రంలో నటించాలని దర్శకుడు కోరినప్పటికీ ఆ సినిమాకు సైన్‌ చేయలేదన్నాడు గోవిందా . మంగళవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ...‘ జేమ్స్‌ కామెరూన్‌కు అవతార్‌ టైటిల్‌ను నేనే సూచించా. కానీ అందులో ఆఫర్‌ను తిరస్కరించా. ఈ సినిమా కచ్చితంగా హిట్టవుతుందని జేమ్స్‌ కామెరూన్‌కు ముందే చెప్పా. అయితే విజువల్‌ వండర్‌ తెరకెక్కాలంటే సుమారు ఏడేళ్లు పడుతుందని అనగానే తనకు కోపం వచ్చింది. ఎవరూ చూడని ప్రపంచాన్ని చూపిస్తానని చెప్పి ఏలియన్స్‌తో సినిమా తీశాడు. సినిమా కోసం 410 రోజులు షూటింగ్‌ చేయాల్సి ఉంటుంది అన్నాడు. అయితే ఒంటి నిండా రంగులు పూసుకుని అన్ని రోజులు నేను ఉండలేను కాబట్టి నన్ను క్షమించాలని కోరాను’ అని వ్యాఖ్యానించాడు.

కాగా అవతార్‌ బ్యాక్‌ ఇన్‌ 2012 అనే పేరుతో గోవిందా, సన్నీ డియోల్‌ ప్రధాన పాత్రల్లో బాలీవుడ్‌లో ఓ సినిమా తెరకెక్కింది. అయితే ఆ సినిమా కనీస ప్రచారానికి కూడా నోచుకోలేదు. ఈ సినిమాతో తిరిగి ఫామ్‌లోకి వద్దామనుకున్న గోవిందాకు చేదు అనుభవమే మిగిలింది. ఈ క్రమంలో గోవిందా మాత్రం అవతార్‌ టైటిల్‌ను తానే సూచించానని చెప్పడంపై ప్రస్తుతం జోకులు పేలుతున్నాయి. ఇక జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన అవతార్ 2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అవతార్‌ తొలి సీక్వెల్‌ అవతార్‌ 2  2021 డిసెంబర్ 17న ఈ సినిమా రిలీజ్‌ అవుతుందంటూ  అవతార్‌ టీం ఇటీవలే ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ముందుగా ఈ సినిమా సీక్వెల్‌ 2020 డిసెంబర్‌లోనే రిలీజ్‌ అవుతుందని భావించినా నిర్మాణం ఆలస్యం కావటంతో ఏడాది పాడు వాయిదా పడింది. 3,4,5 భాగాలను కూడా రెండేళ్ల విరామంతో వరుసగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్‌.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement