చిక్కుల్లో పడ్డ హీరో, హీరోయిన్ | Shilpa Shetty, Govinda Directed to Surrender Before Court For Defaming Bihar | Sakshi
Sakshi News home page

చిక్కుల్లో పడ్డ హీరో, హీరోయిన్

Published Sun, Oct 16 2016 1:22 PM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM

చిక్కుల్లో పడ్డ హీరో, హీరోయిన్

చిక్కుల్లో పడ్డ హీరో, హీరోయిన్

రాంచీ: బాలీవుడ్ నటులు గోవిందా, శిల్పాశెట్టి చిక్కుల్లో పడ్డారు. 20 ఏళ్ల క్రితం నమోదైన పరువు నష్టం కేసుకు సంబంధించి కోర్టులో హాజరుకావాల్సందిగా జార్ఖండ్లోని పాకూర్ కోర్టు ఆదేశించింది. ఈ నెల 18న ఇద్దరూ కోర్టుకు రావాలని ఆదేశాలు జారీ చేసింది.

1996లో విడుదలైన ఛోటే సర్కార్ సినిమాలో గోవిందా, శిల్పా నటించారు. బిహార్, ఉత్తరప్రదేశ్ను కించపరిచేవిధంగా ఈ సినిమాలో ఓ పాటను చిత్రీకరించారని ఆరోపిస్తూ స్థానిక న్యాయవాది ఒకరు కేసు వేశారు. గోవిందా, శిల్పాతో పాటు గాయకులు, దర్శకులపైనా కేసు పెట్టారు. అప్పుడు జార్ఖండ్.. బిహార్లో భాగంగా ఉండేది. ఆ తర్వాత జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన సంగతి తెలిసిందే. కోర్టు గతంలో పలుమార్లు ఆదేశించినా ఎవరూ విచారణకు హాజరుకాలేదు. దీంతో నటీనటులను కోర్టుకు తీసుకురావాల్సిందిగా ముంబై పోలీసులను ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement