
దుబాయ్‌లో జరిగిన ఫిలింఫేర్ మిడిల్ ఈస్ట్ అచీవర్స్ నైట్ వేడుకలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ నటుడు ఫహద్ ముస్తఫా బాలీవుడ్ నటుడు గోవిందా కాళ్లు తాకి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు. మీరే నా ఇన్‌స్పిరేషన్ అంటూ ఎమోషనలయ్యాడు. దీంతో గోవిందా వెంటనే అతడిని మనసారా హత్తుకుని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. పక్కనే ఉన్న హీరో రణ్‌వీర్ సింగ్‌తో సైతం ఫహద్ మాట కలిపాడు.
ఈ అవార్డుల ఫంక్షన్‌లో ఫహద్ ముస్తఫా మాట్లాడుతూ.. 'గోవిందా సర్ వల్లే నేను యాక్టింగ్ చేయడం మొదలుపెట్టాను. ఆయనకు నేను పెద్ద అభిమానిని. ఎప్పటికీ ఆ అభిమానం అలాగే ఉంటుంది. మా దేశంలో మీలాగా యాక్టింగ్ చేయాలనుకునేవాళ్లు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీ ఎదుట వేదికపై నిలబడటం అదృష్టంగా భావిస్తున్నాను. కానీ ఇప్పటికీ ఇదంతా నమ్మలేకపోతున్నాను. రానున్న రోజుల్లో ఇండియా, పాకిస్తాన్ కలిసి పని చేయాలని ఆశిస్తున్నాను' అని చెప్పుకొచ్చాడు.
చదవండి: మహేశ్‌బాబు తప్పు చేశాడా?
Comments
Please login to add a commentAdd a comment