బిగుసుకుంటున్న ‘మత్తు’ ఉచ్చు | drugs case is very serious | Sakshi
Sakshi News home page

బిగుసుకుంటున్న ‘మత్తు’ ఉచ్చు

Published Sun, Sep 25 2016 12:02 AM | Last Updated on Tue, Oct 2 2018 3:04 PM

drugs case is very serious

మహబూబ్‌నగర్‌ క్రై ం : జిల్లా కేంద్రంలో కలకలం రేపుతున్న ‘డ్రగ్స్‌’ వ్యవహారం రోజురోజుకూ వేడెక్కుతోంది. యువతకు మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న తిరుమల ఫార్మా ఏజెన్సీని శనివారం జిల్లా ఔషధ నియంత్రణ అధికారులు పూర్తిగా జల్లెడ పట్టారు. ఇక్కడి నుంచి బయటికి వెళ్లిన ప్రతి డ్రగ్‌ వివరాలను, బిల్లులను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే ఈ తనిఖీలను ఆపించడానికి అధికారులకు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు కాల్స్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏజెన్సీలో జిల్లా ఔషధ నియంత్రణ అధికారులు దినేశ్‌కుమార్, బాలకృష్ణ రోజంతా తనిఖీలు చేశారు. అనంతరం విలేకరులతో వారు మాట్లాడుతూ ప్రసన్న మెడికల్‌ దుకాణంలో జరిగిన వ్యవహారానికి కొనసాగింపుగా తిరుమల ఏజెన్సీపై దాడులు నిర్వహించామన్నారు. 
 
దీంట్లో గత ఏడాది నుంచి అమ్మిన డ్రగ్స్, కొనుగోలు చేసిన వివరాలు సమగ్రంగా సేకరిస్తున్నామన్నారు. ఈ ఏజెన్సీ ద్వారా జిల్లాలోని ఏ మెడికల్‌ షాపునకు డ్రగ్స్‌ సరఫరా అయినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరుమల ఏజెన్సీ నుంచి హైదరాబాద్‌కు సైతం మందులు సరఫరా అయినట్లు తమ తనిఖీలలో బయటపడిందన్నారు. నిందితులు ఆరుగురిపై 1940 ఔషధ నియంత్రణ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశామని, లక్ష్మీప్రసన్న మెడికల్‌ యజమాని వెంకట్రమణపైనా కేసు నమోదు చేశామన్నారు. దర్యాప్తు చేసిన తర్వాత వీరందరిపై కోర్టులో చార్జిషీటు దాఖలు చే స్తామన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement