సాక్షి, హైదరాబాద్: కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేసిన ఓ ఉన్నత విద్యావంతుడు సులువుగా డబ్బు సంపాదించేందుకు అడ్డదారి తొక్కాడు. సొంత ల్యాబ్ ఒకటి ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ తయారీ మొదలుపెట్టాడు. ఈ బాగోతాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) బయటపెట్టింది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యక్తి కెమిస్ట్రీలో పీహెచ్‌డీ పూర్తి చేసి కొద్దికాలం ఓ ఫార్మా కంపెనీలో పనిచేశాడు. ఆ తర్వాత డబ్బు మీద ఆశతో డ్రగ్స్ తయారీ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం రూ.63.12 లక్షల విలువైన 3.156 కిలోల మెఫిడ్రిన్‌ను మరో వ్యక్తికి విక్రయిస్తుండగా డీఆర్‌ఐ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. తర్వాత సదరు వ్యక్తి ల్యాబ్‌పై దాడులు చేసి రూ.12.40 లక్షల నగదు, 112 గ్రాముల మెఫిడ్రిన్ శాంపిల్స్, 219.5 కిలోల ముడి మెఫిడ్రిన్ సరుకును స్వాధీనం చేసుకున్నారు.
ముంబై మాఫియా దోస్తీతో..
పట్టుబడిన వ్యక్తి ల్యాబ్‌లో డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు చేపట్టగా..ఆ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో అవసరమైన పరికరాలు, సరంజామాను ఇంట్లోనే చూసి డీఆర్‌ఐ అధికారులు కంగుతిన్నారు. డబ్బు మీద అత్యాశతో ముంబై మాఫియాతో చేతులు కలిపిన అక్రమ మార్గం ఎంచుకున్నట్లుగా గుర్తించారు. ఇప్పటిదాకా ఇతడు 100 కిలోల మెఫిడ్రిన్‌ను విక్రయించినట్లుగా అధికారులు గుర్తించారు. దీని విలువ దాదాపు రూ.2 కోట్లకుపైగానే ఉంటుం దని సమాచారం. మరో వ్యక్తిని కూడా అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment