మహారాష్ట్రలోని పూణెలో ఓ పబ్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పబ్‌లో కూర్చుని కొందరు డ్రగ్స్ తీసుకోవడం దానిలో కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.
అక్రమ పబ్‌లపై వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు పాటించని పబ్‌లపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పూణెలోని ఫెర్గూసన్ రోడ్డులోని ఒక పబ్‌లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో రాష్ట్రంలో కలకలం చెలరేగింది.
పబ్‌లోని వాష్‌రూమ్‌లో ఇద్దరు యువకులు డ్రగ్స్ తీసుకోవడం వీడియోలో కనిపిస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలలో రంగంలోకి దిగిన పోలీసు యంత్రాంగం ఈ కేసులో ఇప్పటివరకు 14 మందిని అరెస్టు చేసింది. వీరిలో ఆరుగురు వెయిటర్లతో మొత్తం ఎనిమిదిమంది ఉన్నారు. ఈ కేసులో నలుగురు పోలీసులను కూడా సస్పెండ్ చేశారు. ఈ కేసులో అరెస్టయిన ఎనిమిది మందిని జూన్ 29 వరకు పోలీసు కస్టడీకి పంపినట్లు పోలీసులు తెలిపారు.
పుణె పోలీసులు పబ్ యజమాని సంతోష్ విఠల్ కమ్తే, సచిన్ కమ్తేతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. పబ్‌లోని ప్రధాన గేటును మూసివేసి, మరో గేటు ద్వారా పబ్‌లో కూర్చున్నవారికి వెయిటర్లు మత్తు పదార్థాలు అందించారని పోలీసులు గుర్తించారు. విషయం బయటకు పొక్కడంతో వెంటనే చర్యలు చేపట్టిన పోలీసులు పబ్‌కు సీల్ వేసి, డ్రగ్స్ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment