
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల వేళ వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు. నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ సరఫరాపై నిఘా పెట్టిన పోలీసులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. జోసెఫ్ అలమేధ, శంకర్ అనే ఇద్దరు అంతరాష్ట్ర డ్రగ్స్ మాఫియా సభ్యులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 10లక్షల విలువైన 89 గ్రాముల కొకైన్, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
దీనిపై హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. ఈ డ్రగ్స్ మాఫియా నైజీరియన్స్‌ను నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి ఫిల్మ్‌నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్టు తెలిపారు. గోవా కేంద్రంగా ఈ దందా సాగిస్తున్నట్టు పేర్కొన్నారు. వీరు ఒక గ్రాము కొకైన్‌ను మూడువేల రూపాయలకు కొనుగోలు చేసి దానిని 6 నుంచి 7వేల రూపాయలకు విక్రయిస్తున్నట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment