
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధం ఉన్న మరో అనుమానితుడు బాసిత్ పరిహార్‌ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సిబి) ప్రశ్నిస్తున్నట్టు అధికారులు చెప్పారు. ఇప్పటికే అరెస్టు అయిన జైద్ విలాత్రా ని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా, ఆయన్ను సెప్టెంబర్ 9 వరకు ఎన్‌సీబీ కస్టడీకి అప్పగించారు. జైద్ విచారణ సందర్భంగా బాసిత్ పరిహార్ పేరు బయటపడింది. రాజ్‌పుత్ కేసులో రియాచక్రవర్తిపై నమోదైన మాదకద్రవ్యాల కేసుకి, బాసిత్‌కి సంబంధం ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. రియాచక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ మొబైల్ చాట్స్‌లో బాసిత్ ప్రస్థావన ఉన్నట్లు వారు చెప్పారు. షోవిక్‌ని, రాజ్‌పుత్ మేనేజర్ సామ్యూల్ మిరందాని మాదకద్రవ్యాల కేసు విచారణకు పిలవనున్నట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్ర, గోవా, ఢిల్లీలోని మరికొంత మంది మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠాపై నిఘా పెట్టినట్లు అధికారులు తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment