ముంబై: హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి విషయంలో రోజుకొక కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆమెకు డ్రగ్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయంటూ కొన్ని వార్తలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా సుశాంత్ తండ్రి తరపున వాదిస్తున్న న్యాయవాది రియాపై మరో ఆరోపణ చేశారు. రియా, సుశాంత్‌కు తెలియకుండా అతనికి నిషేధించిన డ్రగ్స్‌ను ఇచ్చిందని ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేసినట్లు తెలిపారు. ఈ విషయం గురించి లాయర్ కేకేసింగ్ మాట్లాడుతూ, ‘సుశాంత్‌కు తెలియకుండా కొన్ని నిషేధిత డ్రగ్స్‌ను ఆయనకు ఇచ్చారు. ఇదే అతడు చనిపోవడానికి కారణమయ్యింది. మొదటి నుంచి కూడా సుశాంత్‌కు తనకు తెలియకుండానే ఏదో మందులు ఇస్తున్నారని కుటుంబ సభ్యులకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన విషయాన్ని ఎఫ్‌ఐఆర్‌లో కూడా పేర్కొన్నాం. సుశాంత్‌కు తెలియకుండానే డాక్టర్లు రాసి ఇవ్వని డ్రగ్స్‌ను సుశాంత్‌కు ఇచ్చారని అందులో ఫిర్యాదు చేశారు’ అని తెలిపారు.
ఒకవేళ అలాంటి డ్రగ్స్ ఇచ్చి సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించారా లేదా హత్య చేయడానికి ప్రయత్నించారా అన్న అనుమానాలను సుశాంత్ తండ్రి తరుపు న్యాయవాది అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అలాంటి డ్రగ్స్ వాడటం చట్టవిరుద్దమని ఆయన తెలిపారు. ఇంకా సుశాంత్ ఆత్మహత్య విషయంలో అనేక విషయాలు బయటపడ్డాయి. సుశాంత్ ఫస్ట్ ఫ్లోర్‌లో నిద్రపోయేవాడని రియా పై అంతస్తులో పార్టీలు చేసుకునేదని ఇంట్లో ఉండే పనివాళ్ల ద్వారా తెలిసింది. అలాగే రియా డ్రగ్ డీలర్స్‌తో మాట్లాడినట్లు, వాళ్లకు మెసేజ్‌లు చేసినట్లు కొన్ని ఆధారాలను ఈడీ డిపార్ట్‌మెంట్ సీబీఐకు అందించింది అనే కథనాలు బయటకు వచ్చాయి. డ్రగ్స్ లింక్ గురించి రియా తరుపు న్యాయవాది మాట్లాడుతూ రియాకు కావాలంటే రక్త పరీక్ష నిర్వహించవచ్చని, రియా తన జీవితంలో డ్రగ్స్ తీసుకోలేదని తెలిపారు.
చదవండి: సుశాంత్ కేసు: ఆ అంబులెన్స్‌లు ఎందుకు వచ్చాయి?
‘సుశాంత్‌కు తెలియకుండా నిషేధిత డ్రగ్స్ ఇచ్చారు’
Published Wed, Aug 26 2020 2:35 PM | Last Updated on Wed, Aug 26 2020 3:59 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment