పైలట్ దూకేసాడు.. విమానం కూలింది | Drug plane from Venezuela crashes off Colombia's coast | Sakshi
Sakshi News home page

పైలట్ దూకేసాడు.. విమానం కూలింది

Published Thu, May 21 2015 9:37 AM | Last Updated on Fri, May 25 2018 2:57 PM

పైలట్ దూకేసాడు.. విమానం కూలింది - Sakshi

పైలట్ దూకేసాడు.. విమానం కూలింది

వెనెజులాకు చెందిన ఓ అక్రమ మత్తుపదార్థాల రవాణా విమానం కొలంబియాలో కూలిపోయింది.

బొగోటా: వెనెజులాకు చెందిన ఓ అక్రమ మత్తుపదార్థాల రవాణా విమానం కొలంబియాలో కూలిపోయింది. దాదాపు టన్నుకు పైగా కొకైన్తో బయలుదేరిన విమానాన్ని గుర్తించిన కొలంబియా ఎయిర్ ఫోర్స్ దానిని కూల్చివేసేందుకు ప్రయత్నించేలోపే అందులో నుంచి పైలట్ దూకేశాడు. తదనంతరం ఆ విమానం మోటార్లు విఫలమై కొలంబియా తీరంలో కూలిపోయింది. దూకిన పైలట్ ప్రాణాలు కోల్పోగా అతడి మృతదేహాన్ని కొలంబియా తీరప్రాంత గస్తీ దళం స్వాధీనం చేసుకొంది.

అయితే, పైలట్ ఏ దేశానికి చెందినవాడనే విషయాన్ని గుర్తించలేదు. ఉత్తర ప్రాంతాల నుంచి మధ్య అమెరికాకు మత్తుపదార్థాలను ఎక్కువగా వెనెజులా రవాణా చేస్తోంది. ఈ నేపథ్యంలో తమ గగన తలంపై వచ్చే చిన్న విమానాలపై కొలంబియా వైమానిక సంస్థ ప్రత్యేక దృష్టిని సారించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement