గుంటూరు నుంచి హైదరాబాద్‌కు తరలింపు
రాజ్‌తరుణ్, లావణ్య వివాదంలో వెలుగులోకి
హైదరాబాద్ వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులోనూ అతడి హస్తం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: డ్రగ్ పెడ్లర్‌గా వ్యవహరిస్తున్న గుంటూరుకు చెందిన మస్తాన్ సాయిని సోమవారం తెలంగాణా ప్రత్యేక పోలీసు బృందం అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకెళ్లింది. గుంటూరులోని మస్తానయ్య దర్గా నిర్వాహకుడు రావి రామ్మోహనరావు కుమారుడే ఈ మస్తాన్ సాయి. గతంలోనూ అతడిపై డ్రగ్స్ కేసులు ఉన్నాయి. హైదరాబాద్ వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులోనూ మస్తాన్ సాయి పేరు ప్రముఖంగా వినిపించింది. సినీ హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో మస్తాన్‌సాయి పేరు వెలుగులోకి వచి్చంది. మస్తాన్ దర్గాకు దర్శనం కోసం వచి్చన సమయంలో తనతో మస్తాన్‌సాయి అసభ్యంగా ప్రవర్తించినట్లు లావణ్య ఫిర్యాదు చేసింది.
ఇతను దర్గాలో తలదాచుకుంటున్నట్లు సమాచారం అందడంతో నార్సింగ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించినట్లు సమాచారం. జూన్ 3న విజయవాడ రైల్వే స్టేషన్‌లో డ్రగ్స్ తరలిస్తుండగా సెబ్ పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో మస్తాన్‌సాయి పోలీసుల నుంచి తప్పించుకుపోయాడు. తర్వాత గుంటూరులోని మస్తాన్ దర్గాలోనే ఉంటున్నప్పటికీ గుంటూరు పోలీసులతో కుమ్మక్కు కావడంతో వారు అతడి జోలికి వెళ్లలేదని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment