నగరంలో మరోసారి డ్రగ్స్ ముఠా హల్‌చల్ చేసింది. డ్రగ్స్ విక్రయిస్తున్న అంతర్‌రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీపీ అంజనీ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. కమతిపురాకు చెందిన ఇష్క్ మొయినుద్దిన్ అనే కీలకవ్యక్తితో పాటు మరో నలుగురిని అరెస్ట్‌చేసినట్లు తెలిపారు. సినిమా అవకాశాల కోసం ముంబై వెళ్లిన మొయినుద్దిన్ డ్రగ్ పేడ్లర్‌గా మారి అమ్మకాలు చేస్తున్నాడని పేర్కొన్నారు.