మత్తు మందుల స్వాధీనం
ఎంవీపీకాలనీ (విశాఖ) : విశాఖలో అక్రమంగా మత్తు మందు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్ పరిధిలోని 104 ఏరియా ప్రాంతం బాబుజీనగర్‌లో అక్రమంగా మత్తు మందులు(ఫోర్టివిన్ ఇంజిక్షన్లు) విక్రయాలు సాగుతున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెంటనే దాడులు చేశారు. ఈ దాడుల్లో మత్తు మందులు విక్రయిస్తున్న గణపతి అశ్వంత రెడ్డి, జి.వెంకట నాగేంద్రని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 102 ఫోర్టివిన్ ఇంజిక్షన్లు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఎయిర్ పోర్ట్ జోన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఏసీపీ చిట్టిబాటు నేతృత్వంలో సీఐ మల్లికార్జున రావు, ఎస్‌ఐ హరిబాబు సిబ్బందితో కలిసి దాడుల్లో పాల్గొన్నారు.