మహిళపై సీఐ అత్యాచారయత్నం | CI Molest on woman | Sakshi
Sakshi News home page

మహిళపై సీఐ అత్యాచారయత్నం

Published Mon, Apr 27 2015 4:03 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

మహిళపై సీఐ అత్యాచారయత్నం - Sakshi

మహిళపై సీఐ అత్యాచారయత్నం

టీనగర్: మహిళపై సీఐ అత్యాచారయత్నం జరిపినట్లు ఫిర్యాదులందాయి. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. తిరుచ్చి కేకే నగర్ ఇండియన్ బ్యాంకు కాలనీకి చెందిన పరిమళ (35). పౌష్టికాహార ఉద్యోగి అయిన ఈమె భర్తను విడిచి జీవిస్తోంది. తిరునెల్వేలి జిల్లా కరండై పోలీసుస్టేషన్‌లో సీఐ మురుగేశన్ (48). ఈ నేపథ్యంలో పరిమళ పోలీసులకు ఒక ఫిర్యాదు చేసింది. శనివారం తెల్లవారుజామున సీఐ మురుగేశన్ తన ఇంట్లోకి జొరబడి తనపై అత్యాచారయత్నం చేసిన ట్లు, అతన్ని ఇంట్లో వుంచి తాళం వేసినట్లు తిరుచ్చి పోలీసు కంట్రోల్ రూంనంబరు 100కు ఫోన్ చేసింది.  అయితే ఈలోపున మురుగేశన్ అక్కడి నుంచి తప్పించుకున్నాడని, దీంతో సీఐపై మురుగేశన్‌పై చర్యలు తీసుకోవాలని తిరుచ్చి కంటోన్మెంట్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
 
 దీనిపై మహిళా పోలీసు ఇన్‌స్పెక్టర్ షీలా విచారణ జరుపుతున్నారు. మురుగేశన్‌పై ఆరోపణలు చేసిన పరిమళను వైద్య పరీక్షల నిమిత్తం తిరుచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. మురుగేశన్ సొంతవూరు రామనాథపురం. ఇతనికి భార్య, ముగ్గురు కుమారులు వున్నారు.మురుగేశన్ తిరుచ్చి ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్‌లో పనిచేస్తుండగా లంచం తీసుకున్న కేసులో సస్పెండ్ అయ్యారు. ఆ సమయంలో పరిమళ ఆయనకు కేసు ఖర్చుల కోసం నాలుగు లక్షలు ఇచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత మళ్లీ విధుల్లో చేరిన మురుగేశన్ తిరుచ్చి అంటరానితనం నిరోధక శాఖ ఇన్‌స్పెక్టర్‌గా నియమించబడ్డారు. ఆ సమయంలో పరిమళ తాను అందజేసిన *4లక్షలు తిరిగి ఇవ్వాలని కోరింది.
 
 ఆ సమయంలో వారి మధ్య గొడవ జరిగింది. దీనిగురించి పరిమళ తిరుచ్చి నగర కమిషనర్‌కు మురుగేశన్ తనపై దాడి చేసినట్లు తెలిపింది. మురుగేశన్ తరచుగా ఆరోపణలకు గురికావడంతో అతన్ని నెల్లై జిల్లా, సురండై పోలీసు స్టేషన్‌కు మార్చారు. మురుగేశన్ తన భార్య పిల్లలతో ప్రశాంత జీవనం గడుపుతూ వచ్చారు.  మురుగేశన్ నెల్లైకు మారడంతో తనకు సమస్య తీరినట్లు పరిమళ భావించింది. ఇలావుండగా శుక్రవారం తెల్లవారు జామున మళ్లీ తిరుచ్చి చేరుకున్న మురుగేశన్ పరిమళ ఇంటి తలుపును తెల్లవారుజాము 2.30 గంటల సమయంలో తట్టాడు.
 
  దీంతో మళ్లీ వివాదం ఏర్పడింది. శనివారం రాత్రి తిరుచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన పరిమళ వద్ద మహిళా పోలీసు ఇన్‌స్పెక్టర్ షీలా విచారణ జరిపారు. ఇన్‌స్పెక్టర్ మురుగేశన్ వద్ద పోలీసులు విచారణ జరిపేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం మురుగేశన్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. మురుగేశన్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement