Parimala
-
మహిళపై సీఐ అత్యాచారయత్నం
టీనగర్: మహిళపై సీఐ అత్యాచారయత్నం జరిపినట్లు ఫిర్యాదులందాయి. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. తిరుచ్చి కేకే నగర్ ఇండియన్ బ్యాంకు కాలనీకి చెందిన పరిమళ (35). పౌష్టికాహార ఉద్యోగి అయిన ఈమె భర్తను విడిచి జీవిస్తోంది. తిరునెల్వేలి జిల్లా కరండై పోలీసుస్టేషన్లో సీఐ మురుగేశన్ (48). ఈ నేపథ్యంలో పరిమళ పోలీసులకు ఒక ఫిర్యాదు చేసింది. శనివారం తెల్లవారుజామున సీఐ మురుగేశన్ తన ఇంట్లోకి జొరబడి తనపై అత్యాచారయత్నం చేసిన ట్లు, అతన్ని ఇంట్లో వుంచి తాళం వేసినట్లు తిరుచ్చి పోలీసు కంట్రోల్ రూంనంబరు 100కు ఫోన్ చేసింది. అయితే ఈలోపున మురుగేశన్ అక్కడి నుంచి తప్పించుకున్నాడని, దీంతో సీఐపై మురుగేశన్‌పై చర్యలు తీసుకోవాలని తిరుచ్చి కంటోన్మెంట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై మహిళా పోలీసు ఇన్స్పెక్టర్ షీలా విచారణ జరుపుతున్నారు. మురుగేశన్‌పై ఆరోపణలు చేసిన పరిమళను వైద్య పరీక్షల నిమిత్తం తిరుచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. మురుగేశన్ సొంతవూరు రామనాథపురం. ఇతనికి భార్య, ముగ్గురు కుమారులు వున్నారు.మురుగేశన్ తిరుచ్చి ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్లో పనిచేస్తుండగా లంచం తీసుకున్న కేసులో సస్పెండ్ అయ్యారు. ఆ సమయంలో పరిమళ ఆయనకు కేసు ఖర్చుల కోసం నాలుగు లక్షలు ఇచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత మళ్లీ విధుల్లో చేరిన మురుగేశన్ తిరుచ్చి అంటరానితనం నిరోధక శాఖ ఇన్స్పెక్టర్గా నియమించబడ్డారు. ఆ సమయంలో పరిమళ తాను అందజేసిన *4లక్షలు తిరిగి ఇవ్వాలని కోరింది. ఆ సమయంలో వారి మధ్య గొడవ జరిగింది. దీనిగురించి పరిమళ తిరుచ్చి నగర కమిషనర్‌కు మురుగేశన్ తనపై దాడి చేసినట్లు తెలిపింది. మురుగేశన్ తరచుగా ఆరోపణలకు గురికావడంతో అతన్ని నెల్లై జిల్లా, సురండై పోలీసు స్టేషన్‌కు మార్చారు. మురుగేశన్ తన భార్య పిల్లలతో ప్రశాంత జీవనం గడుపుతూ వచ్చారు. మురుగేశన్ నెల్లైకు మారడంతో తనకు సమస్య తీరినట్లు పరిమళ భావించింది. ఇలావుండగా శుక్రవారం తెల్లవారు జామున మళ్లీ తిరుచ్చి చేరుకున్న మురుగేశన్ పరిమళ ఇంటి తలుపును తెల్లవారుజాము 2.30 గంటల సమయంలో తట్టాడు. దీంతో మళ్లీ వివాదం ఏర్పడింది. శనివారం రాత్రి తిరుచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన పరిమళ వద్ద మహిళా పోలీసు ఇన్స్పెక్టర్ షీలా విచారణ జరిపారు. ఇన్స్పెక్టర్ మురుగేశన్ వద్ద పోలీసులు విచారణ జరిపేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం మురుగేశన్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. మురుగేశన్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు. -
కలహాలు తుడిపి...కాపురాలు కలిపి
కామారెడ్డి, న్యూస్‌లైన్: 2004లో కామారెడ్డి డీఎస్పీగా పనిచేసిన పరిమళ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. డీఎస్పీ కార్యాలయ ఆవరణలో దీనికి ప్రత్యేక గదిని కేటాయించారు. భార్య, భర్త మధ్య తలెత్తే విభేదాలతోపాటు, సంతానం ద్వారా నిర్లక్ష్యానికి గురవుతున్న తల్లిదండ్రుల సమస్యలకూ ఈ కేంద్రం పరిష్కారం చూపుతోంది. గడిచిన పదేళ్ల కాలం లో ఇందుకు సంబంధించిన నాలుగు వందలకు పైగా కేసులను పరిష్కరించారు. విడిపోవాలనుకున్న ఎన్నో జంటలు కౌన్సెలింగ్ ద్వారా కలహాలు వదిలి అన్యోన్యంగా ఉంటున్నాయి. ఇది తమకెంతో సంతృప్తినిస్తుందని కేంద్రం నిర్వాహకులు బీఎంఎస్వీ భద్రయ్య అంటున్నారు. స్వచ్ఛందంగా డీఎస్పీ సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కౌన్సెలింగ్ కేంద్రంలో విశ్రాంత ఉపవిద్యాధికారి బీఎంఎస్వీ భద్రయ్య, విశ్రాంత తహశీల్దార్ పి.విశ్వనాథం, విశ్రాం త ఉద్యోగులు కుసుమ నర్సయ్య, నిట్టు విఠల్‌రావు, కుసుమ బాల్‌చంద్రం సభ్యులు. ప్రతి శనివారం వీరు కౌన్సెలింగ్ సెంటర్‌కు చేరుకుని ఇరువర్గాలతో మాట్లాడతారు. వారి సమస్యలను వింటారు. ఒకటి, రెండు పర్యాయాలు నచ్చజెప్పి, కలహాలను తొలగించి కాపురాలను చక్కదిద్దుతున్నారు. ఎలాంటి రుసుము తీసుకోకుండా వీరంతా కౌన్సెలింగ్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. 2013లో 65 కేసులు రాగా 54 కేసులు పరిష్కారమయ్యాయని, 11 కేసులు పెండింగులో ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆరు కేసులు రాగా, మూడు కేసులు పరిష్కారమయ్యాయని, మరో మూడు ప్రాసెస్‌లో ఉన్నాయన్నారు. వివాదాలకు కారణాలు భర్త ఆదర్శంగా ఉండాలని కోరుకునే భార్య మనసును అర్థం చేసుకోలేకపోవడం. అతిగా మద్యం సేవించడం, పేకాటకు అలవాటుపడి డబ్బులు పోగొట్టి అప్పులపాలవడం. ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు. అత్తామామలను కోడలు గౌరవించకుండా, వారిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినపుడు భర్త చికాకుపడడం. కొన్ని సందర్భాలలో భార్య ప్రవర్తన సరిగా లేదని భర్త ఫిర్యాదు. కని పెంచిన తల్లిదండ్రుల పోషణభారాన్ని సంతానం విస్మరించడం. వీటన్నిటికీ ‘కౌన్సెలింగ్’ ద్వారా పరిష్కారం లభిస్తోంది. దంపతులను విడివిడిగా, ఒకరి ముందు ఒకరిని, కుటుంబ సభ్యుల ముందు పిలిచి రకరకాలుగా కౌన్సెలింగ్ నిర్వహించడం ద్వారా వారి మధ్యన కలహాలు రూపుమాపే ప్రయత్నం చే స్తున్నారు. అత్తారింట సమస్యలతో కామారెడ్డి ప్రాంతానికి చెందిన ఓ ఎస్ఐ కూతురికి అత్తారింట సమస్యలు ఎదురుకావడంతో పోలీసులను ఆశ్రయించింది. దంపతులను కౌన్సెలింగ్ కేంద్రానికి పిలిపించి సమస్యలు తెలుసుకున్నారు. ఇద్దరూ కామారెడ్డిలో కలిసి ఉండాలని, ఇక్కడే ఏదైనా జాబ్ చేసుకోవాలని సూచించారు. రెండు, మూడు పర్యాయాలు మాట్లాడిన తరువాత ఇద్దరి మధ్య రాజీ కుదిరింది. దీంతో వారిద్దరూ ఇప్పుడు కామారెడ్డిలోనే కాపురం పెట్టి అన్యోన్యంగా ఉంటున్నారు. పెద్దలకు న్యాయం జరిగింది కామారెడ్డి పట్టణానికి చెందిన వృద్ధ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. ఇద్దరికి పెళ్లిళ్లు చేశారు. తరువాత ఓ ఇల్లు నిర్మించుకుని ఉంటున్నారు. ఒక అల్లుడు వారిని బాగానే చూసుకునేవారు. మరో అల్లుడు పట్టించుకునేవాడు కాదు. పైగా ఆస్తి పంచి ఇవ్వమని వేధించాడు. తమ మరణానంతరం ఆస్తి ఇద్దరు కూతుళ్లకే దక్కుతుందని చెప్పినా వినిపించుకోలేదు. దీంతో ఆ వృద్ధ దంపతులు కౌన్సెలింగ్ కేంద్రాన్ని ఆశ్రయించారు. నిర్వాహకులు కూతుళ్లు, అల్లుళ్లను పిలిపించి మాట్లాడారు.పెద్దవారిని బాగా చూసు కుంటే వారే ఆస్తి ఇస్తారని నచ్చజెప్పడంతో వారు కలిసిపోయారు. -
భవనంపైకి ఎక్కి... కిరోసిన్ పోసుకుని
దుబ్బాక, న్యూస్‌లైన్: అందరూ చూస్తుండగానే ఉన్నట్టుండి భవనంపైకి ఎక్కిన ఓ మహిళ.. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన దుబ్బాక పట్టణంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం...దుబ్బాకకు చెందిన బోడి కృపాకర్‌కు ఐదేళ్ళ క్రి తం రాజమండ్రికి చెందిన పరిమళ(27) తో వివాహం జరిగింది. పాస్టర్‌గా పనిచేసే కృపాకర్ వివాహం జరిగినప్పటి నుంచి భార్యతో కలిసి ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటలో నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం వీరికి ఇద్దరు కూతుళ్లు లేఖన, బేరునిక సంతానం. కృపాకర్ ఇటీవల దుబ్బాకలో ఉంటున్న తన పాత ఇంటిని కూల్చేసి కొత్తగా ఇంటి నిర్మాణం ప్రారంభించాడు. దీం తో కృపాకర్ కొద్దిరోజుల క్రితం కుటుం బంతో సహా దుబ్బాకకు వచ్చి ఏఎన్ఎంగా పనిచేస్తున్న తన సోదరి ఇంట్లో ఉంటున్నాడు. ఇటీవలే కూతుళ్లను కూ డా దుబ్బాకలోని ఓ ప్రైవేటు పాఠశాల లో చేర్చించాడు. కాగా, మంగళవారం కృపాకర్ తన భార్య పిల్లలతో కలిసి దు బ్బాకలోనే ఓ అద్దె ఇంట్లో నివాసం ఉం టున్న తన మరోసోదరి చిట్టి ఇంటికి వచ్చారు. సాయంత్రం సమయంలో కృపాకర్ తాను నిర్మించుకుంటున్న భవ న నిర్మాణ పనుల వద్దకు వెళ్లాడు. ఆ కొద్దిసేపటికే కృపాకర్ భార్య పరిమళ ఇంట్లో ఉన్న అల్లుడు పండు(కృపాకర్ సోదరి కుమారుడు)కు ఓ లేఖ ఇచ్చి దాన్ని మామయ్యకు ఇచ్చి రమ్మని ఆ చిన్నారిని పంపింది. అనంతరం ఆమె ఇంట్లో ఉన్న కిరోసిన్ డబ్బాను తీసుకుని భవనం పైకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పుపెట్టుకుంది. మంటల కు తాళలేక బిగ్గరగా కేకలు వేసింది. భవనంపై పెద్దఎత్తున మంటలు చెలరేగ డం పరిమళ గట్టిగా కేకలు వేయడంతో వెంటనే అక్కడకు చేరుకున్న స్థానికులు, పరిమళ భర్త కృపాకర్ ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే పూర్తిగా కాలిపోయిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పంచనామా నిర్వహించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు దుబ్బాక సీఐ రామకృష్ణరెడ్డి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పశ్చాతాపంలోనే ఆత్మహత్య మృతురాలు పరిమళ ఆత్మహత్యకు చేసుకునే ముందు తన భర్త కృపాకర్‌కు రాసిన రెండు పేజీల లేఖలో తీవ్ర పశ్చాతాపం తెలిపినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో ఆమె లేఖ రాయటానికి గల కారణాలు, ఆత్మహత్య చేసుకునే పరిస్థితులపై వారు దర్యాప్తు చేస్తున్నారు. వీరు అదిలాబాద్ జిల్లా నుంచి ఇటీవలే దుబ్బాకకు రావటంపై కూడా పలు అనుమనాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బారులు తీరిన జనం... దుబ్బాకలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పక్కనే ఉన్న ఓ భవనంపై పరిమళ ఆత్మహత్య చేసుకోవటం చూసిన స్థానికులంతా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. భవనంపైన పెద్ద ఎత్తున మంటలు రావటంతో చుట్టుపక్కల వారందరూ అక్కడికి చేరుకుని భవనంపైకి ఎక్కి ఆమెను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోవడంతో వారంతా తీవ్ర కలత చెందారు. తల్లిని కోల్పోయిన పరిమళ ఇద్దరు కూతుళ్లను చూసి వారంతా కంటతడిపెట్టారు.