
Singham 2 Actor Arrested For Smuggling Drugs: డ్రగ్స్ వినియోగిస్తూ నటుడు మెల్విన్ పోలీసులకు పట్టుబడ్డాడు. వివరాల ప్రకారం..సూర్య హీరోగా నటించిన సింగం-2 సినిమాలో నటించిన నైజీరియన్దేశస్థుడు, నటుడు చాక్‌విమ్ మాల్విన్ గుర్తున్నాడు కదా.. ఆ సినిమాలో అక్రమంగా డ్రగ్స్ సప్లై చేసే ముఠాకు సంబంధించిన వాడిగా నటించాడు మాల్విన్. సీన్ కట్ చేస్తే నిజ జీవితంలో కూడా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.
చదవండి : అరెరె.. కత్రినా కైఫ్‌కు జిరాక్స్ కాపీలా ఉందే..
నిందితుడి నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 15లక్షల వరకు ఉంటుందని సమాచారం. 15 గ్రాముల MDMAతో పాటు 250 మిల్లీలీటర్ల హ్యాష్ ఆయిల్ సహా మొభైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనంలోకి తీసుకున్నారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో మెల్విన్ డ్రగ్స్ వ్యాపారంలోకి దిగినట్టు పోలీసులు పేర్కొన్నారు.
అయితే మెల్విన్‌తో సినీ పరిశ్రమకు చెందిన ఎవరితో అయినా సంబంధాలు ఉన్నాయి?అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కాగా కన్నడ, తమిళ, హిందీ భాషల్లో మెల్విన్ పలు చిత్రాల్లో నటించాడు.
Comments
Please login to add a commentAdd a comment