
సాక్షి, హైదరాబాద్ : అమీర్‌పేట్‌లో డ్రగ్స్ కలకలం రేపింది. ముగ్గురు వ్యక్తుల వద్ద నుంచి ఎక్సైజ్ పోలీసులు పెద్ద ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి హైదరాబాద్ డ్రగ్స్ సరఫరా చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులకు చేరవేస్తున్న బంటీ ముఠాను బుధవారం నగరంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఎక్స్ స్టసి పిల్స్ 46 గ్రాములు, 2 గ్రాముల MDMA, 10 గ్రాముల చరస్ స్వాధీనం చేసుకున్నారు. బంటీతో పాటు నగరానికి చెందిన రోహిత్, నవీన్‌రాజ్ డ్రగ్స్ కోసం గోవాకు వెళ్లినట్లు తెలుస్తోంది. గోవాకు చెందిన కునాల్, రఫీ పరార్ ఇద్దరు ముఠా సభ్యులు బంటీ గ్యాంగ్‌కు డ్రగ్స్ సరపర చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు వాడిన టూ వీలర్, కార్‌ను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment