బెంగళూరు టాప్ మోడల్ అరెస్ట్.. | Bengaluru top model arrested for drug peddling | Sakshi
Sakshi News home page

బెంగళూరు టాప్ మోడల్ అరెస్ట్..

Published Thu, Jun 23 2016 6:45 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

బెంగళూరు టాప్ మోడల్ అరెస్ట్.. - Sakshi

బెంగళూరు టాప్ మోడల్ అరెస్ట్..

బెంగళూరుః డ్రగ్ రాకెట్ కేసులో బెంగళూరుకు చెందిన ఓ ప్రముఖ మోడల్ పట్టుబడింది. నార్కోటిక్స్ డ్రగ్స్, సైకోట్రోఫిక్ కంట్రోల్ చట్టానికి చెందిన వివిధ సెక్షన్లకింద ఆమెపై కేసులు పెట్టినట్లు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఎన్ సీ బీ అధికారులు వెల్లడించారు.

కర్ణాటకలోని చిక్కమంగళూరుకు చెందిన ప్రముఖ మోడల్.. 26 ఏళ్ళ దర్శిత్మిత గౌడ ను ఎన్ సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మత్తు పదార్థాలను మంగుళూరు, బెంగళూరు, గోవాల్లోని విద్యార్థులతోపాటు ఇతరులకు సరఫరా చేస్తున్న ముఠాలో పనిచేస్తోందన్న అనుమానంతో ఆమెపై ఎన్ సీబీ అధికారులు నిఘా పెట్టారు. ఆమె నివసిస్తున్నఅపార్ట్ మెంట్ లో సోదాలు నిర్వహించి 110 గ్రాముల కొకైన్, 19 గ్రాముల హషీస్, మరికొన్ని మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సోదాలు నిర్వహించిన సమయంలో దర్శిత్మిత ఇంట్లో లేదని... సమయానికి ఇంట్లోనే ఉన్న బాయ్ ఫ్రెండ్ నిశాంత్ ను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. దర్శిత్మిత నిర్వహిస్తున్న అక్రమ డ్రగ్ సరఫరాకు నిశాంత్ సహకరిస్తున్నట్లు విచారణలో తెలుసుకున్న పోలీసులు.. అనంతరం ఆమెకు  సమన్లు జారీ చేసి, ఆమెనుకూడ కస్టడీలోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement