ఆ మహిళకు అదేం బుద్ధి.. | Old Woman Drug Dealer Arrested In Delhi | Sakshi
Sakshi News home page

ఆ మహిళకు అదేం బుద్ధి..

Aug 29 2019 10:43 AM | Updated on Aug 29 2019 10:56 AM

Old Woman Drug Dealer Arrested In Delhi - Sakshi

దేశ రాజధానిలో డ్రగ్‌ దందా సాగిస్తున్న 88 ఏళ్ల మహిళను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు

సాక్షి, న్యూఢిల్లీ : దశాబ్ధాల తరబడి డ్రగ్‌ దందా సాగిస్తున్న 88 ఏళ్ల వృద్ధురాలిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 1990 ప్రాంతంలో డ్రగ్స్‌ వ్యాపారం నడుపుతున్న భర్త మరణించడంతో చీకటి దందాను తన చేతుల్లోకి తీసుకున్న రాజ్‌రాణి అనే మహిళ 1996 నుంచి మూడు సార్లు ఢిల్లీ పోలీసులకు చిక్కినా తన ధోరణి మార్చుకోలేదు. రాజ్‌రాణి కదలికలపై పక్కా సమాచారంతో ఢిల్లీ పోలీసులు ఇందర్‌పురి ప్రాంతంలో మాటువేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. రాజ్‌రాణి వద్ద నుంచి హెరాయిన్‌ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్‌, యూపీలోని డ్రగ్‌ డీలర్లతో ఆమెకు సంబంధాలున్నాయని పోలీసులు వెల్లడించారు. జైలు జీవితానికీ అలవాటుపడిన రాజ్‌రాణి చట్టంలోని లొసుగులతో ప్రతిసారీ బెయిల్‌ తెచ్చుకుంటారని చెబుతున్నారు. మరోవైపు తాను డ్రగ్‌ దందా చేపట్టడం వెనుక పెద్దకథే ఉందని ఆమె పోలీసులకు తెలిపినట్టు సమాచారం. చిన్న వయసులోనే తనకు డ్రగ్‌ డీలర్‌తో వివాహమై ఏడుగురు పిల్లలు పుట్టారని వారిలో ఆరుగురు డ్రగ్స్‌ బారినపడి, మరికొందరు ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారని చెప్పుకొచ్చారు. రాజ్‌రాణిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement