హరియాణాకు ఆధిక్యం | Lead to hariyana | Sakshi
Sakshi News home page

హరియాణాకు ఆధిక్యం

Published Sat, Oct 15 2016 12:25 AM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM

Lead to hariyana

జంషెడ్‌పూర్: హైదరాబాద్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సరికి హరియాణా 4 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. నితిన్ సైని (61), శుభమ్ రోహిల్లా (60) రాణించారు. ఇప్పటికే ఆ జట్టు 45 పరుగుల తొలి ఇన్నింగ్‌‌స ఆధిక్యం సాధించింది.

 
కష్టాల్లో ఆంధ్ర...

కళ్యాణి: ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మరో మ్యాచ్‌లో ఆంధ్ర 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. డీబీ ప్రశాంత్ (62) అర్ధసెంచరీ సాధించాడు. ఆంధ్ర తొలి ఇన్నింగ్‌‌సలో మరో 243 పరుగులు వెనుకబడి ఉంది. తొలి ఇన్నింగ్‌‌సలో ఛత్తీస్‌గఢ్ 394 పరుగులకు ఆలౌటైంది. అభిమన్యు చౌహాన్ (123) సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement