హరియాణాకు ఆధిక్యం
జంషెడ్పూర్: హైదరాబాద్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సరికి హరియాణా 4 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. నితిన్ సైని (61), శుభమ్ రోహిల్లా (60) రాణించారు. ఇప్పటికే ఆ జట్టు 45 పరుగుల తొలి ఇన్నింగ్స ఆధిక్యం సాధించింది.
కష్టాల్లో ఆంధ్ర...
కళ్యాణి: ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మరో మ్యాచ్‌లో ఆంధ్ర 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. డీబీ ప్రశాంత్ (62) అర్ధసెంచరీ సాధించాడు. ఆంధ్ర తొలి ఇన్నింగ్సలో మరో 243 పరుగులు వెనుకబడి ఉంది. తొలి ఇన్నింగ్సలో ఛత్తీస్‌గఢ్ 394 పరుగులకు ఆలౌటైంది. అభిమన్యు చౌహాన్ (123) సెంచరీ పూర్తి చేసుకున్నాడు.