జంషెడ్‌పూర్: హరియాణా బౌలర్ల ధాటికి తమ రెండో ఇన్నింగ్‌సలోనూ హైదరాబాద్ జట్టు తడబడుతోంది. రంజీ ట్రోఫీలో భాగంగా శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 46.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోరుు 102 పరుగులు చేసింది. అనిరుధ్ (36 బంతుల్లో 33; 6 ఫోర్లు) ఒక్కడే ఆకట్టుకున్నాడు. అంతకుముందు హరియాణా జట్టు తమ తొలి ఇన్నింగ్‌సలో 130.4 ఓవర్లలో 331 పరుగులకు ఆలౌటై 140 పరుగుల ఆధిక్యం సాధించింది. ప్రస్తుతం హైదరాబాద్ 38 పరుగులు వెనుకబడి ఉండగా చేతిలో ఐదు వికెట్లున్నారుు.
ఫాలో ఆన్ ఆడుతున్న ఆంధ్ర
కళ్యాణి: ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో పేలవ ప్రదర్శనతోఆంధ్ర జట్టు ఫాలో ఆన్ ఆడుతోంది. శనివారం తమ తొలి ఇన్నింగ్‌సలో ఆంధ్ర 73.2 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌటరుుంది. తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులు వెనకబడి ఫాలో ఆన్ ఆడుతూ... రోజు ముగిసే సమయానికి 65 ఓవర్లలో 4 వికెట్లకు 122 పరుగులు చేసింది. భరత్ (177 బంతుల్లో 57; 10 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు.