బీజేపీ కొత్త ఎన్నికల ఇన్‌చార్జులు | BJP starts election preparedness in four states | Sakshi
Sakshi News home page

బీజేపీ కొత్త ఎన్నికల ఇన్‌చార్జులు

Published Sat, Aug 10 2019 3:56 AM | Last Updated on Sat, Aug 10 2019 3:56 AM

BJP starts election preparedness in four states - Sakshi

న్యూఢిల్లీ: హరియాణా, ఢిల్లీ, మహారాష్ట్రల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌చార్జులను బీజేపీ నియమించింది. ఢిల్లీ ఎన్నికల ఇన్‌చార్జిగా కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవడేకర్, హరియాణాకు కేంద్రమంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్, మహారాష్ట్రకు పార్టీ జనరల్‌ సెక్రటరీ భూపేంద్ర యాదవ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, జార్ఖండ్‌ ఎన్నికల ఇన్‌చార్జిగా పార్టీ ఉపాధ్యక్షుడు ఓపీ మాథుర్‌ను నియమించినట్లు ప్రకటనలో పేర్కొంది. హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో ఈ ఏడాది చివరలో, ఢిల్లీలో 2020లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీ మినహా మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగా, వాటిని నిలబెట్టుకోవడమే కాకుండా, ఢిల్లీలో పార్టీ జెండా ఎగురవేయాలనే సంకల్పంతో పార్టీ అధినాయకత్వం ఉంది. ఈ నేపథ్యంలో సీనియర్‌ నేతలను పార్టీ ఆయా రాష్ట్రాలకు ఇన్‌చార్జులుగా నియమించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement