న్యూఢిల్లీ: కేంద్రం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఆందోళనలు చేపట్టి 5 నెలల కావస్తున్నప్పటకి పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. దేశ రాజధానిలోని నిరసన ప్రదేశాలలో రైతులకు చలికాలంలో అవసరమయ్యే సదుపాయలు, ఇంటర్నెట్, విద్యుత్ కోతలతో పాటు ఇతరత్రా సదుపాయలపై కేంద్రం ఆంక్షలు విధించడంతో రైతులు తమ నిరసనను మరింత తీవ్రతరం చేసేందుకు సిద్ధమయ్యారు. వంద రోజులే కాదు.. 500 రోజులైన వెనక్కి తగ్గేది లేదంటూ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో తమ నిరసనను ఉధృతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హర్యానా సమీపంలో తిక్రీ సరిహద్దులో 25 శాశ్వత నివాసాలను రైతులు నిర్మించుకున్నారు. దీనికి కిసాన్ సోషల్ ఆర్మీ నాయకత్వం వహిస్తోంది.
Kisan Social Army has constructed a permanent shelter at Tikri border as protest against farm laws continues
— ANI (@ANI) March 13, 2021
"These houses are strong, permanent just like the will of the farmers. 25 houses built, 1000-2000 similar houses to be built in coming days,"Anil Malik, Kisan Social Army pic.twitter.com/4ZudQTIAqj
అంతేగాక ఈ ఇళ్ల నిర్మాణానికి కూడా కిసాన్ సోషల్ ఆర్మీ.. రైతులకు మద్దతుగా నిలుస్తోంది. ఇటుకలతో నిర్మిస్తున్న ఈ ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి దాదాపు రూ. 20 వేల నుంచి రూ. 25 వేల వరకు ఖర్చు అవుతుందట. అయితే ఇళ్ల నిర్మాణానికి అవసరమయ్యే వస్తు సామగ్రిని మాత్రమే రైతులు కొనుగొలు చేస్తున్నారని, కూలీల ఖర్చు మాత్రం వారికి ఉచితమని కిసాన్ ఆర్మీకి చెందిన అనిల్ మాలిక్ మీడయాతో పేర్కొన్నారు. అందువల్ల మున్ముందు కూడా 1000 నుంచి 2000 ఇళ్లను నిర్మించే యోచనలో రైతులు ఉన్నారని ఆయన అన్నారు.
చదవండి:
వందోరోజుకు రైతు ఆందోళనలు
500 రోజులైనా వెనక్కి తగ్గేది లేదు
Comments
Please login to add a commentAdd a comment