house building works
-
రైతుల ఆందోళన : సరిహద్దుల్లో శాశ్వత గృహాలు
న్యూఢిల్లీ: కేంద్రం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఆందోళనలు చేపట్టి 5 నెలల కావస్తున్నప్పటకి పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. దేశ రాజధానిలోని నిరసన ప్రదేశాలలో రైతులకు చలికాలంలో అవసరమయ్యే సదుపాయలు, ఇంటర్నెట్, విద్యుత్ కోతలతో పాటు ఇతరత్రా సదుపాయలపై కేంద్రం ఆంక్షలు విధించడంతో రైతులు తమ నిరసనను మరింత తీవ్రతరం చేసేందుకు సిద్ధమయ్యారు. వంద రోజులే కాదు.. 500 రోజులైన వెనక్కి తగ్గేది లేదంటూ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో తమ నిరసనను ఉధృతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హర్యానా సమీపంలో తిక్రీ సరిహద్దులో 25 శాశ్వత నివాసాలను రైతులు నిర్మించుకున్నారు. దీనికి కిసాన్ సోషల్ ఆర్మీ నాయకత్వం వహిస్తోంది. Kisan Social Army has constructed a permanent shelter at Tikri border as protest against farm laws continues "These houses are strong, permanent just like the will of the farmers. 25 houses built, 1000-2000 similar houses to be built in coming days,"Anil Malik, Kisan Social Army pic.twitter.com/4ZudQTIAqj — ANI (@ANI) March 13, 2021 అంతేగాక ఈ ఇళ్ల నిర్మాణానికి కూడా కిసాన్ సోషల్ ఆర్మీ.. రైతులకు మద్దతుగా నిలుస్తోంది. ఇటుకలతో నిర్మిస్తున్న ఈ ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి దాదాపు రూ. 20 వేల నుంచి రూ. 25 వేల వరకు ఖర్చు అవుతుందట. అయితే ఇళ్ల నిర్మాణానికి అవసరమయ్యే వస్తు సామగ్రిని మాత్రమే రైతులు కొనుగొలు చేస్తున్నారని, కూలీల ఖర్చు మాత్రం వారికి ఉచితమని కిసాన్ ఆర్మీకి చెందిన అనిల్ మాలిక్ మీడయాతో పేర్కొన్నారు. అందువల్ల మున్ముందు కూడా 1000 నుంచి 2000 ఇళ్లను నిర్మించే యోచనలో రైతులు ఉన్నారని ఆయన అన్నారు. చదవండి: వందోరోజుకు రైతు ఆందోళనలు 500 రోజులైనా వెనక్కి తగ్గేది లేదు -
నిధులొచ్చినా వదిలేశారు..!
విజయనగరం రూరల్, న్యూస్‌లైన్: జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు కొత్త భవనాల నిర్మాణానికి సంబంధించి నిధులు మంజూరైనా ఫలితం లేకపోయింది. సకాలంలో భవన నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో నిధులన్నీ వెనక్కి మళ్లిపోయాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు శిథిల భవనాలకు మరమ్మతులతో సరిపెడుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్, ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాలు, ఎక్సైజ్స్టేషన్లు కొన్ని అద్దె భవనాల్లో కొనసాగుతుండగా, మరికొన్ని శిథిల భవనాల్లోనే కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. విజయనగరం రూరల్, పట్టణ ఎక్సైజ్ స్టేషన్ కార్యాలయాలు శిథిలావస్థకు చేరిన భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వీటితోపాటు టాస్స్‌ఫోర్స్ సూపరింటెండెంట్ కార్యాలయం భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితిలో ఉంది. దీంతో సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నారు. గతంలో కురిసిన వర్షాలకు స్టేషన్ పైకప్పు నానిపోయి కూలిపోయింది. ఆ సమయంలో కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. స్టేషన్ ముందు భాగం పెంకులు ఎప్పటికప్పుడు ఊడిపోయి సిబ్బందిపై పడుతున్నాయి. టాస్క్‌ఫోర్స్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాన్ని పాకలో కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త భవనాలు నిర్మించేందుకు 2012లో 1.6 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. పనులను 2013లో ప్రారంభించాల్సి ఉన్నా పట్టించుకోలేదు. దీంతో నిధులు వెనక్కి మళ్లిపోయాయి. కోట్ల రూపాయల నిధులు మంజూరైనా నిర్మాణాలు చేపట్టకుండా ఇప్పుడు కార్యాలయాలకు మరమ్మతులు చేయడమేంటని పలువురు విమర్శిస్తున్నారు.