new leadership
-
Kamala Harris: నవతరం నాయకురాలిని
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కంటే తాను భిన్నమైన నేతనని, ‘నవతరం నాయకత్వాన్ని’అందిస్తానని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు. మార్పుకు ప్రతినిధిగా అమెరికన్ల ముందు తనను తాను ఆవిష్కరించుకుంటున్న డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ నవంబరు 5న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో తలపడుతున్న విషయం తెలిసిందే. ఫిలడెలి్ఫయాలో శుక్రవారం హారిస్ ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ట్రంప్ విద్వేష, విభజన రాజకీయాలతో అమెరికన్లు విసిగిపోయారన్నారు. తనకు తుపాకీ ఉందని, ఎవరి తుపాకీ హక్కులను తాను హరించాలనుకోవడం లేదని తెలిపారు. ఆసల్ట్ స్టైల్ ఆయుధాలపైనే నిషేధం తప్పనిసరని తాను భావిస్తునన్నారు. బైడెన్‌కు మీరెలా భిన్నమో చెప్పాలని యాంకర్ బ్రియాన్ టాఫ్ అడగ్గా.. ‘నైనేతే జో బైడెన్‌ను కాను. నవతరం నాయకత్వాన్ని అందిస్తా’అని కమలా హారిస్ స్పందించారు. గతంలో ఆ నడిచిపోతుందిలే అని తేలికగా తీసుకున్న అంశాలను ఇకపై ఎవరూ నిర్లక్ష్యం చేయలేరన్నారు. పిల్లల సంరక్షణ కోసం తల్లిదండ్రులకు ఇచ్చే చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్‌ను 6 వేల డాలర్లకు పెంచుతానన్నారు. ఒకరినొకరు వేలెత్తి చూపుకునేలా ప్రొత్సహిస్తున్న నాయకుడిలా (ట్రంప్‌లా) కాకుండా అమెరికన్లను ఏకతాటిపై నడిపే నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తనకు తెలుసన్నారు. -
బీజేపీ కొత్త ఎన్నికల ఇన్చార్జులు
న్యూఢిల్లీ: హరియాణా, ఢిల్లీ, మహారాష్ట్రల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు ఎన్నికల ఇన్చార్జులను బీజేపీ నియమించింది. ఢిల్లీ ఎన్నికల ఇన్చార్జిగా కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్, హరియాణాకు కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్, మహారాష్ట్రకు పార్టీ జనరల్ సెక్రటరీ భూపేంద్ర యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, జార్ఖండ్ ఎన్నికల ఇన్చార్జిగా పార్టీ ఉపాధ్యక్షుడు ఓపీ మాథుర్‌ను నియమించినట్లు ప్రకటనలో పేర్కొంది. హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో ఈ ఏడాది చివరలో, ఢిల్లీలో 2020లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీ మినహా మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగా, వాటిని నిలబెట్టుకోవడమే కాకుండా, ఢిల్లీలో పార్టీ జెండా ఎగురవేయాలనే సంకల్పంతో పార్టీ అధినాయకత్వం ఉంది. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలను పార్టీ ఆయా రాష్ట్రాలకు ఇన్చార్జులుగా నియమించింది. -
లెఫ్ట్ ఫ్రంట్‌కు కొత్త నాయకత్వం అవసరం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో ఉప ఎన్నికల్లో సీపీఎం పరాజయం పట్ల లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ విచారం వ్యక్తం చేశారు. కొత్తవారికి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే తప్ప పార్టీకి భవిష్యత్ లేదని అభిప్రాయపడ్డారు. పశ్చిమబెంగాల్లో రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ, తృణమాల్ కాంగ్రెస్ చెరో చోట విజయం సాధించాయి. బస్రిహత్లో బీజేపీ విజయం సాధించడం పట్ల సోమనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సీపీఎంకు ప్రమాద సూచికని అన్నారు.