పశ్చిమబెంగాల్లో ఉప ఎన్నికల్లో సీపీఎం పరాజయం పట్ల లోక్సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ విచారం వ్యక్తం చేశారు.
కోల్కతా: పశ్చిమబెంగాల్లో ఉప ఎన్నికల్లో సీపీఎం పరాజయం పట్ల లోక్సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ విచారం వ్యక్తం చేశారు. కొత్తవారికి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే తప్ప పార్టీకి భవిష్యత్ లేదని అభిప్రాయపడ్డారు.
పశ్చిమబెంగాల్లో రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ, తృణమాల్ కాంగ్రెస్ చెరో చోట విజయం సాధించాయి. బస్రిహత్లో బీజేపీ విజయం సాధించడం పట్ల సోమనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సీపీఎంకు ప్రమాద సూచికని అన్నారు.