Left front
-
Bengal Results: మరీ దారుణం.. ఒక్కచోటా గెలవని కమ్యూనిస్టులు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ను 1977 నుంచి 2011 దాకా.. 34 ఏళ్లపాటు అప్రతిహతంగా పాలించిన లెఫ్ట్ ఫ్రంట్ నేడు దయనీయ స్థితికి దిగజారింది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని పోటీ చేసినా ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేక చతికిలపడింది. ప్రజా ఉద్యమాలు, భూ సంస్కరణలతో ఒకప్పుడు బెంగాలీల మనసు గెలుచుకొని సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న కమ్యూనిస్టులకు.. ఈ దుస్థితి ఎందుకు దాపురించిందన్న ప్రశ్నకు రకరకాల కారణాలు చెబుతుంటారు. అందులో ప్రధానమైంది.. 2008లో భారత్–అమెరికా అణు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ యూపీఏ ప్రభుత్వానికి లెఫ్ట్ పార్టీలు మద్దతును ఉపసంహరించుకున్నాయి. దీంతో బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులను పక్కనపెట్టి, తృణమూల్‌తో జట్టుకట్టింది. అప్పటి నుంచే బెంగాల్లో కమ్యూనిస్టు పార్టీల పతనం మొదలయ్యింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలపై తృణమూల్ ఆధిక్యత సాధించడం ప్రారంభించింది. బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్‌లోని ప్రధాన పార్టీలు సీపీఎం, సీపీఐ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్(ఏఐఎఫ్బీ), రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ(ఆర్ఎస్పీ). 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఈ నాలుగు పార్టీలు కలిసి బెంగాల్లో 50.7 శాతం ఓట్లు సాధించగా, 2009 ఎన్నికల్లో 43.3 శాతం ఓట్లు దక్కించుకోగలిగాయి. 2007లో జరిగిన నందిగ్రామ్ భూసేకరణ వ్యతిరేక పోరాటంలో తృణమూల్ అధినేత మమతా బెనర్జీ కీలకంగా వ్యవహరించారు. 2008లో పంచాయతీ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలను మట్టికరిపించారు. నందిగ్రామ్ ఉద్యమం తర్వాత రాష్ట్రంలో చాలా వర్గాలు కమ్యూనిస్టులకు దూరమయ్యాయి. 2011లో సీపీఐ 2, సీపీఎం 40 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగాయి. మొదటిసారిగా తృణమూల్ అధికారంలోకి వచ్చింది. 2016 శానసనభ ఎన్నికల్లో సీపీఐ ఒక్కటి, సీపీఎం 26 స్థానాలకే పరిమితమయ్యాయి. ఓట్ల శాతం భారీగా తగ్గింది. ఇప్పుడు ఖాతా కూడా తెరవలేదు. ఇక 2014 లోక్‌సభ ఎన్నికల్లో లెఫ్ట్ కూటమి కేవలం 2 సీట్లు గెలుచుకొని, 29.71 శాతం ఓట్లు సాధించగా, 2019లో ఒక్క స్థానం కూడా సొంతం చేసుకోలేకపోయింది. ఓట్ల శాతం 6.34 శాతానికి పడిపోయింది. చదవండి: West Bengal Election Result 2021: దీదీ హ్యాట్రిక్! -
బీజేపీ, టీఎంసీలను ఓడించాలి
కోల్‌కతా: లెఫ్ట్‌ఫ్రంట్, కాంగ్రెస్, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్) సంయుక్తంగా ఆదివారం కోల్‌కతాలో నిర్వహించిన భారీ ర్యాలీతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. మతతత్వ ప్రభుత్వాలను ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రజలకు జనహిత సర్కారును అందిస్తామని హామీ ఇచ్చాయి. రాష్ట్రంలో పరిశ్రమల వృద్ధికి, ఉపాధి కల్పనకు కృషి చేస్తామన్నాయి. ఈ ఎన్నికలు టీఎంసీ, బీజేపీల మధ్య పోటీ మాత్రమే కాదని, మూడో పక్షంగా తమ కూటమి కూడా బరిలో ఉందని కాంగ్రెస్ నేత ఆధిర్ చౌధురి పేర్కొన్నారు. బీజేపీ, టీఎంసీలను ఓడించి తీరుతామన్నారు. మరోవైపు, ఈ కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాల్లో ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఎన్నికల తరువాత టీఎంసీ జీరో అవుతుందని ఐఎస్ఎఫ్ చీఫ్ అబ్బాస్ సిద్దిఖీ వ్యాఖ్యానించారు. కూటమిలో సీట్ల పంపకాలను ఉద్దేశిస్తూ.. ఐఎస్ఎఫ్ న్యాయబద్ధ వాటా సాధిస్తుందని కాంగ్రెస్, వామపక్షాలను పరోక్షంగా హెచ్చరించారు. ‘బీజేపీ, టీఎంసీలు ఒకే నాణేనికి రెండు ముఖాలు. మతపరంగా ప్రజలను విడదీయడమే వాటి లక్ష్యం. ప్రజలకు అభివృద్ధిదాయక పాలన మా కూటమే అందివ్వగలదు’ అని రాష్ట్ర సీపీఎం కార్యదర్శి సూర్యకాంత మిశ్రా పేర్కొన్నారు. హంగ్ అసెంబ్లీ వస్తే టీఎంసీ బీజేపీతో చేతులు కలిపి ఎన్డీఏలో చేరేందుకు కూడా వెనుకాడరని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఎన్డీఏలో గతంలోనూ టీఎంసీ భాగస్వామిగా ఉందన్న విషయాన్ని ఏచూరి గుర్తు చేశారు. బీజేపీ, టీఎంసీల మధ్య ప్రస్తుతం జరిగేది ఉత్తుత్తి యుద్ధమేనన్నారు. -
లెఫ్ట్‌తో పొత్తుకు అధినేత్రి ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ : వరుస పరాజయాలతో డీలా పడ్డ కాంగ్రెస్ పొత్తులకు సై అంటోంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలను దీటుగా ఎదుర్కొనేందుకు ఆ పార్టీ త్వరలో జరగనున్న మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగే ఉప ఎన్నికల్లో లెఫ్ట్‌ఫ్రంట్‌తో పొత్తుకు సన్నద్ధమైంది. బెంగాల్లో వామపక్ష ఫ్రంట్‌తో జత కట్టేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదం తెలిపారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కూటమిగా అవతరించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడం, ఆ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం వీయడంతో కాంగ్రెస్, వామపక్షాలు పునరాలోచనలో పడిన నేపథ్యంలో బెంగాల్లో కాంగ్రెస్-వామపక్ష కూటమి కొలిక్కివచ్చింది. ఇక ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్‌లోని 42 లోక్‌సభ స్ధానాలకు గాను కాంగ్రెస్ కేవలం రెండు స్ధానాలతోనే సరిపెట్టుకోగా, లెఫ్ట్‌ఫ్రంట్ ఖాతా తెరవలేదు. పశ్చిమ బెంగాల్ పార్టీ చీఫ్ సోమెన్ మిత్రాతో కాంగ్రెస్ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ సమావేశమైన క్రమంలో బెంగాల్లో రానున్న మూడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేయడం సహా పలు సంస్ధాగత అంశాలపై చర్చించినట్టు సమాచారం. నార్త్ దినాజ్‌పూర్ జిల్లాలోని కలియాగంజ్, పశ్చిమ మిడ్నపూర్ జిల్లా ఖరగ్‌పూర్, నదియా జిల్లాలోని కరీంపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. -
కేరళలో దూసుకుపోతున్న ‘ఎల్డీఎఫ్’
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం నాడు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన వెంటనే సీపీఎం నాయకత్వంలోని కేరళ పాలక పక్షం లెఫ్ట్ అండ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) ‘మీ అంతర్గత కలహాలు ముగిశాయా, ఇదిగో మా టీం రెడీ!’ అన్న నినాదంతో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టేసింది. అంతకు ఒక్క రోజు ముందు అంటే, శనివారం నాడే కేరళలోని 20 లోక్‌సభ స్థానాలకు ఎల్డీఎఫ్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, బీజేపీ నాయకత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్లు ఇప్పటికీ మల్లగుల్లాలు పడుతున్నాయి. గత ఎన్నికల్లో సాధించిన సీట్లకన్నా ఈ సారి ఎక్కువ సీట్లను సాధిస్తామన్న ధీమాతో ఎల్డీఎఫ్ కనిపిస్తోంది. 2014 నాటి ఎన్నికల్లో ఎల్డీఎఫ్కు ఎనిమిది సీట్లు రాగా, యూడీఎఫ్‌కు మిగతా సీట్లు లభించాయి. ఎన్డీయేకు మాత్రం ఒక్క సీటు కూడా రాలేదు. ఈసారి సీపీఎం 16 సీట్లకు పోటీ చేస్తుండగా, సీపీఐ నాలుగు సీట్లకు పోటీ చేస్తోంది. మిత్రపక్షాలైన జనతాదళ్ (సెక్యులర్), లోక్తాంత్రిక్ జనతాదళ్ ఒక్క సీటుకు కూడా పోటీ చేయడం లేదు. కేరళలోని అన్ని లోక్‌సభ సీట్లకు ఏప్రిల్ 23వ తేదీన ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎప్పటిలాగే 2014లోనూ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్యనే రసవత్తర పోటీ నడిచింది. బీజీపీ ఫ్రంట్ ఒక్క సీటును కూడా గెలుచుకోలేదు. అయితే ఒక్క తిరువనంతపురంలో ఆ పార్టీ అభ్యర్థి విజయానికి చేరువలోకి వచ్చి ఓడిపోయారు. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శశి థరూర్ చేతుల్లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ 15,470 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ సీటును తిరిగి కైవసం చేసుకునే బాధ్యతను మాజీ రాష్ట్ర మంత్రి, సీపీఐ అభ్యర్థి సీ. దివాకరన్‌కు అప్పగించారు. ఇక బీజేపీ ఫ్రంట్ ఒకే ఒక ఎజెండా ‘శబరిమల’ అంశంపై ప్రచారం కొనసాగిస్తోంది. శబరిమల ఆలయంలోని అన్న వయస్కుల ఆడవాళ్లను అనుమతించాలంటూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేసేందుకు ప్రయత్నించగా దానికి వ్యతిరేకంగా శివసేన, ఇతర హిందూత్వ సంస్థలు ఆందోళన చేస్తూ వచ్చాయి. ఆ ఆందోళన తనకు ఎన్నికల్లో ఉపకరిస్తుందని బీజేపీ ఆశిస్తోంది. ఈసారి రాష్ట్రానికి సంబంధించి ఏది పెద్ద ఎన్నికల సమస్య అవుతుందని ఆసియా నెట్ టీవీ ఛానల్ ఇటీవల ఓ సర్వే నిర్వహించగా వారిలో 64 శాతం మంది పెరుగుతున్న చమురు ధరలు, ఆ తర్వాత పెద్ద నోట్ల రద్దు ప్రధాన సమస్యలుగా పేర్కొన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల ప్రతిపాదనకు కమ్యూనిస్టు పార్టీలు తీవ్రంగా మద్దతు ఇస్తున్నప్పటికీ కేవలం రెండు సీట్లనే ఈసారి మహిళలకు కేటాయించారు. వారిలో కన్నూర్ సిట్టింగ్ ఎంపీ పీకే శ్రీమతి కూడా ఉన్నారు. తాము కేవలం నాలుగు సీట్లకే పోటీ చేస్తున్నందున తాము మహిళలకు స్థానం కల్పించలేక పోయామని సీపీఐ ప్రధాన కార్యదర్శి ఎస్. సుధాకర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. -
రాష్ట్రంలో రాజకీయ సంచలనం సృష్టిస్తాం
సంగారెడ్డి క్రైం: రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రాజకీయ సంచలనం సృష్టిస్తామని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం అన్నారు. బీఎల్ఎఫ్ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని సంగారెడ్డిలో మంగళవారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాతా అభివృద్ధిలో వెనుకబడే ఉన్నామన్నారు. ప్రభుత్వాలు మారినా రైతు ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదన్నారు. తెలంగాణ ఏర్పడితే మూతపడిన పరిశ్రమలను తిరిగి తెరిపిస్తామని ప్రగల్బాలు పలికిన కేసీఆర్ ఏ ఒక్క పరిశ్రమను తెరిపించ లేకపోయారన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం లేదన్నారు. ప్రతి క్వింటాలుకు రూ.8 వేల నష్టం వాటిళ్లుతోందని, అయినా ఎకరాకు రూ.4 వేలు ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులను ఒక్కటే అడుగుతున్నామని, సామాజిక వర్గానికి సీట్లు ఇస్తాం, మీరు ఇస్తారా అని సవాల్ విసిరారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ చైర్మన్ నల్లా సూర్యప్రకాశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 40 వేల ఓట్లు ఉన్న వెలమ సామాజిక వర్గం అధికారం చెలాయిస్తోందని, 80 శాతానికిపైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రాజ్యాధికారానికి అర్హులు కారా? అని నిలదీశారు. కార్యక్రమంలో నాయకులు చుక్క రాములు, బీఎల్ఎఫ్ కన్వీనర్ మజీదుల్లాఖాన్, బీఎల్ఎఫ్ రైతు చైర్మన్ వనజ పాల్గొన్నారు. -
అఖిలపక్షం పోరుబాట
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా పోరుబాట పట్టాలని అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. ఆదివారం విజయవాడలో వామపక్షాల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. సీపీఐ, సీపీఎం, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, లోక్‌సత్తా, జనసేన, ఆమ్ ఆద్మీ సహా 18 పార్టీలు, వివిధ ప్రజాసంఘాలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర మేధావులు, మాజీ ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున హాజరయ్యారు. భవిష్యత్ కార్యాచరణ ప్రకారం సోమవారం (ఫిబ్రవరి 19) నుంచి ప్రతిరోజూ ఏదో ఒక జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశం. మార్చి 1న వైఎస్సార్సీపీ తలపెట్టిన దీక్షలకు, 5న ఢిల్లీలో ధర్నాకు మద్దతు.మార్చి 8న ‘చలో పార్లమెంట్’తో వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు సమావేశం నిర్ణయించింది. -
‘నేతాజీ పత్రాలన్నింటినీ బయటపెట్టాలి’
కోల్‌కతా: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం, ఆయన అదృశ్యం వెనుక గల రహస్యాలకు సంబంధించిన పత్రాలను కేంద్రం వెంటనే బయటపెట్టాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బయటపెట్టిన పత్రాల్లో కొత్త విషయాలేవీ లేవని, వీటి కంటే స్వతంత్ర సంస్థలు చేసిన పరిశోధనల్లో ఎక్కువ సమాచారం ఉందని లెఫ్ట్ ఫ్రంట్ చైర్మన్ బిమన్ బోస్ ఆదివారం పేర్కొన్నారు. నేతాజీ జన్మదినమైన జనవరి 23న దేశ్‌ప్రేమ్ దివస్‌గా జరుపుతామని తెలిపారు. -
వామపక్ష కూటమి ‘క్లీన్ పాలిటిక్స్’
గ్రేటర్ ఎన్నికల్లో కలసి పోటీ.. 12న సీఎంపీ ప్రకటన సాక్షి, హైదరాబాద్: క్లీన్ పాలిటిక్స్(నీతివంతమైన రాజకీయాలు) అనే నినాదంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల బరిలో దిగాలని వామపక్ష కూటమి నిర్ణయించింది. సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తా, ఎంసీపీఐ(యూ), వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా, ఎంబీసీ జేఏసీ, బీసీ సబ్‌ప్లాన్ కమిటీలు, సామాజిక సంస్థలు, వ్యక్తులు కలసి కూటమిగా ఏర్పడి కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని (సీఎంపీ) ప్రకటించనున్నాయి. సీఎంపీలో భాగంగా నీళ్లు, కాలుష్యం, అభివృద్ధి అంశాలతోపాటు నగర సమస్యలకు పరిష్కారాలను సూచించనున్నాయి. ప్రస్తుత రాజకీయాలు అవినీతిమయమై పోయాయని, నీతి, నిజాయితీలను ప్రోత్సహించాలనే నినాదంతో ఎన్నికల్లో ప్రచారం చేయాలని ఈ కూటమి నిర్ణయించింది. ఈ నెల 12న ఇందిరాపార్కు వద్ద నిర్వహించే బహిరంగసదస్సులో కూటమి నాయకులు కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని ప్రకటించనున్నారు. అదేరోజు సీట్ల సర్దుబాటును కూడా ఈ కూటమి ప్రకటించనుంది. సీపీఎం 30-40, సీపీఐ 30-35, లోక్‌సత్తా 30-40, ఎంసీపీఐ కొన్నిచోట్ల, ఎంబీసీ జేఏసీ, బీసీసంస్థల బలాన్ని బట్టి ఆయా స్థానాల్లో పోటీ చేయాలని ప్రాథమికంగా అంచనాకు వచ్చాయి. ఈ ఎన్నికల్లో పొత్తుల కోసం టీపీసీసీ నేతలు సంకేతాలు పంపినా సీపీఐ, సీపీఎం నేతలు తిరస్కరించారని తెలిసింది. బూర్జువా పార్టీలతో పొత్తు లేదు: వామపక్ష నేతలు గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ వంటి బూర్జువా పార్టీలతో అవగాహన కాని, సీట్ల సర్దుబాటు కాని ఉండదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు అజీజ్‌పాషా స్పష్టం చేశారు. వారు ‘సాక్షి’తో విడివిడిగా మాట్లాడుతూ గెలుపోటములతో సంబంధం లేకుండా రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చేందుకు ఈ ఎన్నికల ద్వారా ప్రయత్నిస్తామని చెప్పారు. -
వామపక్షాల ర్యాలీ హింసాత్మకం
కోల్‌కతా: రైతుల సమస్యలపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ వామపక్షాలు గురువారం కోల్‌కతాలో నిర్వహించిన ర్యాలీ హింసాత్మక రూపం దాల్చింది. రైతులంతా నిరసనకారులుగా మారగా పోలీసులు వారిని అడ్డుకునే చర్యలకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొని పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. వామపక్ష నేతలు, కార్యకర్తలు, రైతుల్లో చాలామంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సీపీఎం సెక్రటరీ సూర్జ్యా కాంత మిశ్రాను, లెఫ్ట్ ఫ్రంట్ చైర్మన్ , ప్రముఖ మావోయిస్టునేత బిమన్ బోస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యపట్ల వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తమను ఒక ఆందోళనకారులుగా భావించి పోలీసులు ఇటుకలతో కొట్టారని ఆరోపించారు. దాదాపు 100 మంది ఇందులో గాయాలపాలయ్యారు. ఇదిలా ఉండగా, ఈ ర్యాలీ పట్ల ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. అసలు ఈ వామపక్షాల ర్యాలీకి ఒక డిమాండ్, లక్ష్యం ఏమి లేదని అన్నారు. ర్యాలీకి వచ్చేవారు ఇటుకలు, బాంబులతో వస్తారా.. అలాంటి చర్యలు ఈరోజు వామపక్షాలు చేశాయి అని ఆరోపించారు. -
వామపక్షాల ‘మున్సిపల్’ దీక్ష భగ్నం
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పది వామపక్షాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద చేపట్టిన నిరాహార దీక్షలను బుధవారం సాయంత్రం పోలీసులు భగ్నం చేశారు. దీక్షలో కూర్చున్న నేతలందరినీ బలవంతంగా తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా.. కార్మికులు అడ్డుకోవడంతో తోపులాట జరిగి, ఉద్రిక్తత నెలకొంది. చివరికి నేతలను పోలీసులు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఆగ్రహించిన వామపక్షాలు ప్రభుత్వ తీరుకు నిరసనగా శుక్రవారం (ఈ నెల 17న) రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. అన్ని ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు ఈ బంద్‌కు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాయి. గురువారం (16న) నిరసన ప్రదర్శనలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మ దహనం వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోరాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల సమ్మె కొనసాగుతోంది. మున్సిపల్ కార్మికుల సమ్మెపై ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ వామపక్షాల నాయకులు తమ్మినేని వీరభద్రం (సీపీఎం), చాడ వెంకట్‌రెడ్డి (సీపీఐ), సాధినేని వెంకటేశ్వర్రావు (న్యూడెమోక్రసీ, చంద్రన్న వర్గం), వేములపల్లి వెంకట్రామయ్య (న్యూడెమోక్రసీ, రాయల వర్గం), సురేందర్‌రెడ్డి (ఫార్వర్డ్‌బ్లాక్), జానకిరాములు (ఆర్ఎస్పీ), మురహరి (ఎస్‌యూసీఐ), భూతల వీరన్న (సీపీఐ ఎంఎల్) తదితరులు ఇందిరాపార్కు వద్ద నిరాహార దీక్షలో కూర్చుకున్నారు. ఈ దీక్షలకు అనుమతి తీసుకోకపోవడం, దీక్షలకు సంఘీభావంగా రాష్ట్రంలోని 63 మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి గురువారం కార్మికులు వేలాదిగా తరలిరావాలని మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బుధవారం సాయంత్రం పెద్ద సంఖ్యలో పోలీసులు దీక్షా శిబిరం వద్దకు చేరుకుని వామపక్షాల నేతలను అక్కడి నుంచి తరలించడానికి ప్రయత్నించారు. కార్మికులు, నాయకులు వారిని తీవ్రం గా ప్రతిఘటించడంతో ఇరువర్గాల మధ్య తొపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కార్మికులు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అయితే భారీ సంఖ్యలో వచ్చిన పోలీసులు.. కార్మికులను పక్కకు తొలగించి నేతలను అరెస్ట్ చేసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. బలహీనవర్గాలను పట్టించుకోరా..? అంతకు ముందు సీపీఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాఘవులు దీక్షలను ప్రారంభించి, మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ మున్సిపల్ కార్మికులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. అగ్రకులాలు ఎక్కువగా ఉండి ఎక్కువ జీతాలు సంపాదించుకుంటున్న వారికి జీతాలు పెంచుతూ.. సమాజం ఈసడించుకునే పనిలో, బలహీనవర్గాలు అధికంగా ఉన్న మున్సిపల్ కార్మికుల వేతన సమస్యను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజా జీవనం సజావుగా సాగడానికి శ్రమించే కార్మికులను నిర్లక్ష్యం చేయడం తగదని పేర్కొన్నారు. సైన్యాన్ని, పోలీసులను దించి, ఎస్మా చట్టాన్ని ప్రయోగించి సమ్మెను అణిచివేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు. మున్సిపల్ కార్మికులేమైనా దేశద్రోహులా, దురాక్రమణదారులా అని నిలదీశారు. కార్మికులతో తలపడితే అధికారాన్ని వదులుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ దీక్షలకు కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, టీడీపీ నాయకుడు పెద్దిరెడ్డి, ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ తదితరులు సంఘీభావం ప్రకటించారు. కాగా.. సీఎం కేసీఆర్ సమస్యలను పరిష్కరించే బదులు మరింత జటిలం చేస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. బంద్‌కు అన్ని సంఘాలు, వ్యాపార సంస్థలు, ఉద్యోగ సంఘాలు సహకరించాలని సీపీఎం నేత బి.వెంకట్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. అణచివేత, నిర్భంధంతో సమ్మెను ఆపజాలరని సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ-చంద్రన్న) నేత కె.గోవర్ధన్ పేర్కొన్నారు. ఎవరి దారిలో వారే! * 90% మంది విధుల్లోకి: కమిషనర్ * కొనసాగుతోందన్న కార్మిక సంఘాలు సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికుల సమ్మెపై ఇంకా ఎటూ తేలడం లేదు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని, ఇంకా మొండికేస్తే ఆమరణ దీక్షలకు దిగుతామని మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ స్పష్టం చేస్తుండగా.. దాదాపు 90 శాతం మంది కార్మికులు విధుల్లో చేరారని గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. దాదాపు సమ్మె ముగిసిపోయినట్లేనని, కార్మికులంతా విధులకు వస్తున్నారని చెప్పారు. విధులకు గైర్హాజరు కావడమే కాక విధుల్లో ఉన్న సిబ్బందిని అడ్డుకున్న 28 మంది డ్రైవర్లపై చర్యలు తీసుకోవ డంతోపాటు ఐదుగురు ఎస్ఎఫ్ఏ(శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్)లను తొలగించామన్నారు. హైదరాబాద్‌లో బుధవారం 3వేల టన్నులకుపైగా చెత్తను తరలించామని, మొత్తం చెత్తను గురువారం సాయంత్రంలోగా తరలిస్తామని పేర్కొన్నారు. మరోవైపు పోలీసులను వినియోగించి సమ్మెలో ఉన్న వారిని అరెస్టు చేశారని, మహిళా కార్మికులని కూడా చూడకుండా పోలీస్స్టేషన్లలో ఉంచారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. బుధవారం దాదాపు 500 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నాయి. -
లెఫ్ట్ ఫ్రంట్‌కు నో!
సాక్షి. హైదరాబాద్: రాష్ట్రంలో మితవాద, అతివాద, ఇతర కమ్యూనిస్టు పార్టీలన్నింటినీ కలుపుకొని లెఫ్ట్‌ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలన్న యోచనను పలు వామపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, ఎన్నికల్లో పోటీ చేయడంపై సైద్ధాంతికంగా విభేదాలు, అభిప్రాయభేదాలు ఉన్నందున ఇది సాధ్యం కాదని స్పష్టం చేశాయి. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో తొమ్మిది వామపక్షాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విస్తృత ప్రాతిపదికన అన్ని కమ్యూనిస్టు పార్టీలను ఒక వేదికపైకి తీసుకువద్దామని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రతిపాదించగా.. మిగతా వామపక్షాలు వ్యతిరేకించినట్లు సమాచారం. ప్రజా సమస్యలు, ముఖ్యమైన అంశాలపై కలిసి ఉద్యమాలు చేయడం మినహా.. ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాదని ఆయా పార్టీల నాయకులు పేర్కొన్నట్లు తెలిసింది. అయితే కాంగ్రెస్, బీజేపీ వంటి బూర్జువా పార్టీల అనుబంధ రైతు విభాగాలు, ఎన్జీవో రైతు సంఘాలు లేకుండా తెలంగాణ రైతు సంఘాల జేఏసీని ఏర్పాటు చేసుకోవాలన్న అభిప్రాయం ఈ భేటీలో వ్యక్తమైంది. దీనిపై ఈనెల 24న సమావేశమై తుదినిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. కాగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను 5 వేల ర్యాంకు వరకే పరిమితం చేయాలనే ఆలోచనతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులందరికీ పూర్తి ఫీజు ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వామపక్షాల నేతలు నిర్ణయించారు. ఇక అన్ని వామపక్షాలకు ఆమోదయోగ్యుడైన అభ్యర్థిని వరంగల్ ఎంపీ స్థానానికి పోటీకి నిలపాలని భేటీలో భావన వ్యక్తమైంది. మరోవైపు ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం నేపథ్యంలో అవినీతి అంశంపై శనివారం పది వామపక్షాల సదస్సును నిర్వహించాలని నిర్ణయించారు. ఈ భేటీలో చాడ వెంకటరెడ్డి (సీపీఐ), తమ్మినేని వీరభద్రం(సీపీఎం), జానకిరాములు (ఆర్ఎస్పీ), మురహరి (ఎస్‌యూసీఐ), ఝాన్సీ (న్యూడెమోక్రసీ-రాయల), గుర్రం విజయ్‌కుమార్ (సీపీఐ-ఎంఎల్) తదితరులు పాల్గొన్నారు. -
లెఫ్ట్ ఫ్రంట్‌కు కొత్త నాయకత్వం అవసరం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో ఉప ఎన్నికల్లో సీపీఎం పరాజయం పట్ల లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ విచారం వ్యక్తం చేశారు. కొత్తవారికి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే తప్ప పార్టీకి భవిష్యత్ లేదని అభిప్రాయపడ్డారు. పశ్చిమబెంగాల్లో రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ, తృణమాల్ కాంగ్రెస్ చెరో చోట విజయం సాధించాయి. బస్రిహత్లో బీజేపీ విజయం సాధించడం పట్ల సోమనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సీపీఎంకు ప్రమాద సూచికని అన్నారు. -
న్యాయ వ్యవస్థకే మచ్చ
చుండూరు తీర్పుపై లెఫ్ట్, ప్రజా సంఘాల ఆగ్రహం ఉభయ రాష్ట్రాలలో ధర్నాలు, ర్యాలీలు ప్రభుత్వం సుప్రీంకు వెళ్లాలి: రాఘవులు న్యాయంకోసం జైలుకైనా వెళ్తా: నారాయణ ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద విచారించాలి: బొజ్జా తారకం హైదరాబాద్: చుండూరు కేసులో హైకోర్టు తీర్పును నిరసిస్తూ వామపక్షాలు, వివిధ ప్రజా సంఘాలు సోమవారం ఆగ్రహాన్ని వ్యక్తంచేశాయి. ఉభయ రాష్ట్రాల లోని జిల్లా, మండల కేంద్రాలలో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించాయి. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా యి. ఆయా జిల్లాల కలెక్టర్లకు ఈ మేరకు వినతి పత్రాలు అందజేశాయి. ఉమ్మడి రాష్ట్ర రాజధాని లోని రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా కార్యాలయాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుం టూరు, విశాఖ, అనంతపురం, కర్నూలుజిల్లా కేంద్ర కార్యాలయాల వద్ద వామపక్షాలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాయి. చుండూరు దళితుల న్యాయపోరాట కమిటీ నాయకత్వంలో ఉభయ ప్రాంతాల్లో భారీ ర్యాలీలు జరిగాయి. చుండూరు కేసుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు న్యాయవ్యవస్థకే మాయని మచ్చని నినదించాయి. ఈ కేసులో అందరూ నిర్దోషులే అయితే ఎనిమిది మంది దళితుల్ని చంపింది ఎవరని ప్రశ్నించాయి. హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాను ఉద్దేశించి సీపీఎం పాలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, సీపీఐ కేంద్ర కమిటీ సభ్యుడు అజీజ్ పాషా, రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద జరిగిన సభలో సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, పీజే చంద్రశేఖర్, సీపీఎం రాష్ట్ర నేతలు విల్సన్, వెంకట్ తదితరులు ప్రసంగించారు. విజయవాడలో జరిగిన ర్యాలీకి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, తిరుపతిలో కె.నారాయణ, గుంటూరులో ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్, రాజమండ్రిలో మీసాల సత్యనారాయణ, విశాఖలో వి.సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. నిందితులందర్నీ వదిలేయడం దుర్మార్గం చుండూరు ఘటనపై రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుని సుప్రీంకోర్టులో ప్రత్యేక బెంచ్ ద్వారా కేసు విచారణ జరిగేలా చూడాలని రాఘవులు డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టులో సామాజిక న్యాయం, విలువలు కలిగిన జడ్జిలను నియమించకపోతే అన్యాయం జరిగే అవకాశం ఉందని వారీ సందర్భంగా అభిప్రాయపడ్డారు. చుండూరు కేసుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు ప్రత్యక్ష సాక్షుల వాదనలు విని తీర్పునిస్తే హైకోర్టు నిందితుందర్నీ వదిలివేయడం దుర్మార్గమన్నారు. ఈ తీర్పు సామాజిక న్యాయసూత్రాలకు విరుద్ధమని విమర్శిం చారు. చుండూరు దళితుల న్యాయ పోరాట కమిటీ చైర్మన్ బొజ్జా తారకం మాట్లాడుతూ... 1991 ఆగస్టు ఆరున గుంటూరు జిల్లా చుండూరులో ఎనిమిది మంది దళితులను అగ్రవర్ణాల వారు ఊచకొత కోశారని గుర్తు చేశారు. దీనిపై హైకోర్టు తీర్పు ఏమాత్రం హేతుబద్ధం కాదన్నారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలను పరిగణలోకి తీసుకోకుంటే ఎలా? అని ప్రశ్నించారు. నిందితులను ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద విచారించాలని డిమాండ్ చేశారు. ఒక న్యాయస్థానం అంగీకరించిన సాక్ష్యాలను నమ్మలేమని ఉన్నత న్యాయస్థానాలే తీర్పు ఇస్తే ఇక బడుగు, బలహీనవర్గాలకు దిక్కెవరని చాడా వెంకటరెడ్డి, కె.రామకృష్ణ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ తీర్పు న్యాయవ్యవస్థకే మాయని మచ్చని కె.నారాయణ అభిప్రాయపడ్డారు. చుండూరు దళితుల కోసం చేపట్టే న్యాయపోరాటంలో జైలు కెళ్లేందుకైనా సిద్ధమని చెప్పారు. హైదరాబాద్‌లో జరిగిన ఆందోళనలలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, పీఓడబ్ల్యు సంధ్య, కులవివక్ష పోరాట సమితి ప్రతినిధి సాగర్, మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల రాంప్రసాద్, కార్యదర్శి మురళీకృష్ణ, ఎమ్మార్పీఎస్ నాయకులు బోయిని ఎల్లేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మ పార్టీకి కామ్రేడ్ల షాక్
చెన్నై: వచ్చే ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు సాధించడం ద్వారా ప్రధాన మంత్రి కావాలని కలలు కంటున్న తమిళనాడు ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలితకు వామపక్షాలు షాక్ ఇచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకోరాదని వామపక్షాలు నిర్ణయించాయి. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్టు స్పష్టం చేశాయి. తమిళనాడులో అమ్మ సారథ్యంలోని అధికార ఏఐఏడీఎంకే పట్ల సానుకూలంగా ఉన్నట్టు కొన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు పేర్కొన్నాయి. అయితే, వామపక్షాలు దూరమవడం జయలలితకు ఇబ్బందికర పరిస్థితే. వామపక్షాలు మద్దతు లేకుండా కాంగ్రెస్, బీజేపీయేతర పక్షాల తరపున జాతీయ రాజకీయాల్లో నెగ్గుకురావడం కష్టం. పైగా నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ దూసుకెళ్తోంది. తమిళనాడులో సినీ హీరో విజయకాంత్ పార్టీ, రాందాస్ పార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధపడుతున్నాయి. తాజా రాజకీయ సమీకరణాల వల్ల అమ్మ పార్టీకి ఆశించిన స్థాయిలో ఎంపీ సీట్లు దక్కకపోవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.