
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా పోరుబాట పట్టాలని అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. ఆదివారం విజయవాడలో వామపక్షాల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. సీపీఐ, సీపీఎం, వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, లోక్‌సత్తా, జనసేన, ఆమ్ ఆద్మీ సహా 18 పార్టీలు, వివిధ ప్రజాసంఘాలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర మేధావులు, మాజీ ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున హాజరయ్యారు.
భవిష్యత్ కార్యాచరణ ప్రకారం సోమవారం (ఫిబ్రవరి 19) నుంచి ప్రతిరోజూ ఏదో ఒక జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశం. మార్చి 1న వైఎస్సార్‌సీపీ తలపెట్టిన దీక్షలకు, 5న ఢిల్లీలో ధర్నాకు మద్దతు.మార్చి 8న ‘చలో పార్లమెంట్’తో వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు సమావేశం నిర్ణయించింది.