all party
-
జూన్ 1న ఇండియా కూటమి మీటింగ్!.. కీలక విషయాలపై చర్చ
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ పూర్తి అయింది. ఏడో విడత పోలింగ్ జూన్1న జరగనుంది. ఏడో విడత పోలింగ్ కోసం ప్రధాన పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. అయితే విపక్షాల ఇండియా కూటమి ఆల్ పార్టీ మీటింగ్ జూన్ 1(శనివారం)న జరగనున్నట్లు తెలుస్తోంది. అదే రోజు ఏడో విడత పోలింగ్ కూడా ఉంది. కూటిమిలోని అన్ని భాగస్వామ్య పార్టీలకు ఫలితాలకు నాలుగు రోజుల ముందు దేశ రాజధాని ఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానం పంపినట్లు సమాచారం. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తిరిగి తీహార్ జైలుకు వేళ్లే ఒక రోజు ముందు ఇండియా కూటమి మీటింగ్ జరగనుంది. సీఎం కేజ్రీవాల్ జైలుకు వెళ్లడాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా అదే రోజు సమావేశం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ సమావేశంలో విపక్ష కూటమి తీసుకోవల్సిన చర్యలు, లోక్ సభ ఎన్నికల్లో ఆయా పార్టీలు కనబర్చిన పనితీరుపై చర్చ జరగనున్నట్లు సమాచారం. ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులైన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, సామాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, ఇతర కీలక నేతలకు ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది.ఇక.. ఎన్డీయే కూటమిని ప్రతిపక్షాల ఇండియా కూటమి స్వీప్ చేస్తుందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.‘‘ఆరు విడుతల పోలింగ్ పూర్తి అయింది. 486 స్థానాలకు పోలింగ్ ముగిసింది. పదవి నుంచి దిగిపోయే ప్రధాని రిటైర్మెంట్ ప్రణాళికలు రచించుకుంటున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విధి పూర్తిగా మూసివేయబడింది. దక్షిణంలో పూర్తిగా, ఉత్తర, పశ్చిమ, తూర్పు భారతంలో సంగానికి బీజేపీ పడిపోయింది’’ అని జైరాం రమేష్ అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దే దించడానికి లక్ష్యంగా 28 విపక్ష పార్టీలతో కలిసి ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్‌క్లూషన్ అలియన్స్ (INDIA) పేరుతో కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. -
14న ఢిల్లీకి ఏపీ అఖిలపక్షం
సాక్షి, అమరావతి: రాయలసీమ, నెల్లూరు జిల్లాల తుపాను, వరద బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈనెల 14, 15 తేదీల్లో ఢిల్లీకి అఖిల పక్ష బృందం వెళ్లాలని ఆదివారం విజయవాడలో జరిగిన విపక్షాల రౌండ్‌టేబుల్ సమావేశం నిర్ణయించింది. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో అపార నష్టం జరిగినా కేంద్ర ప్రభుత్వం తగిన స్థాయిలో స్పందించలేదని సమావేశం అభిప్రాయపడింది. సమావేశానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అధ్యక్షత వహించారు. ప్రముఖ రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. తుపాను వరదలతో ఏర్పడిన నష్టాన్ని పూడ్చడానికి కేంద్రం తక్షణమే సాయం అందించాలని ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు రావుల వెంకయ్య కోరారు. -
మీ నిర్ణయం మార్చుకోండి
గత నెలలో నేను మీకు (ప్రధాని) రాసిన లేఖలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి ఉన్న మార్గాలన్నింటినీ వివరించాను. ఆర్థిక మంత్రి ప్రకటనతో ప్లాంట్ ఉద్యోగులు, రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మా ఆకాంక్షలు, సెంటిమెంట్.. ప్లాంట్‌ను ప్రైవేటీకరించకుండా ఉన్న మార్గాల గురించి మీకు మరోసారి వివరించడానికి అఖిలపక్షం, కార్మిక సంఘాల నేతలను వెంట తీసుకుని వస్తాను. త్వరగా అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరుతూ మరోమారు మీకు లేఖ రాస్తున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ రివైవల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ, సహకారాలను అందిస్తుందని నేను హామీ ఇస్తున్నాను. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: దశాబ్దాల పోరాటాలు, ఆత్మ బలి దానాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ఆత్మాభిమానం, మనోభావాలతో ముడి పడిందని.. అలాంటి ప్లాంటును ప్రైవేటీకరించొద్దని ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పూర్తిగా పెట్టుబడుల ఉప సంహరణ నిర్ణయంపై పునరాలోచన చేయాలని విన్నవించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ప్రధానికి మరో లేఖ రాశారు. ప్రభుత్వ రంగంలోనే ప్లాంటును కొనసా గించాలని, ప్లాంటు పునరుద్ధరణకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని స్పష్టం చేశారు. విశాఖ స్టీలు ప్లాంటును నూరు శాతం ప్రైవేటీకరణ చేస్తామంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సోమవారం లోక్‌సభలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారని, ఇది రాష్ట్ర ప్రజలతో పాటు ప్లాంటు ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా అపాయింట్మెంట్ ఇస్తే ప్లాంటు లాభాల్లోకి వచ్చేందుకు ప్రత్యామ్నా యాలను స్వయంగా కలిసి వివరిస్తానన్నారు. అఖిల పక్షంతో పాటు కార్మిక సంఘాల నేతలను వెంట పెట్టుకుని వస్తానని పేర్కొన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించాలని, స్టీల్ ప్లాంటు లాభాల్లోకి వచ్చేందుకు పలు ప్రత్యామ్నాయాలను సూచిస్తూ ప్రధానికి సీఎం జగన్ గతంలోనే లేఖ రాసిన విషయం తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖలోని అంశాలు ఇలా ఉన్నాయి. మరోసారి మీ దృష్టికి స్టీల్ ప్లాంట్ ప్రాధాన్యత ► సర్, నేను గత నెల (ఫిబ్రవరి 6వ తేదీ)లో మీకు రాసిన లేఖలో విశాఖ స్టీల్ ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ – ఆర్ఐఎన్ఎల్ విశాఖ) ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి ఉన్న మార్గాలన్నింటినీ వివరిస్తూ, ప్లాంట్‌లో వ్యూహాత్మక 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరాను. అవే విషయాలను కేంద్ర ఉక్కు శాఖ మంత్రికి కూడా తెలియజేశాను. ► ఇదే సమయంలో ఆర్ఐఎన్ఎల్లో 100 శాతం వ్యూహాత్మక పెట్టుబడుల ఉప సంహరణకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. అది రాష్ట్ర ప్రజలను, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ► విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాధాన్యం, దాంతో రాష్ట్ర ప్రజలకు ముడిపడి ఉన్న సెంటిమెంట్ నేపథ్యంలో, సంస్థ పునరుద్ధరణకు ఉన్న మార్గాలను మరోసారి మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. ► ఆర్ఐఎన్ఎల్ అధీనంలో ఒక ప్రత్యేక సంస్థగా నిల్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ (వీఎస్పీ) కేంద్ర ఉక్కు శాఖ కింద పని చేస్తూ, నవరత్నాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. దాదాపు 20 వేల మందికి ప్రత్యక్షంగా, మరెందరికో పరోక్షంగా విశాఖ నగరంలో ఉపాధి కల్పిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలలో అతి పెద్దదిగా నిలిచింది. ► దేశంలో సముద్ర తీర ప్రాంతంలో ఏర్పాటైన తొలి స్టీల్ ప్లాంట్ ఇది. అత్యంత నాణ్యమైన ఉక్కును తయారు చేస్తూ, నిర్మాణ, మౌలిక వసతులు, ఉత్పత్తి రంగాలతో పాటు, ఆటోమొబైల్ రంగం అవసరాలు కూడా తీరుస్తోంది. ► ఇది దీర్ఘకాల పోరాటం తర్వాత సాధించుకున్న సంస్థ. దాదాపు దశాబ్ధ కాలం పాటు ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ అన్న నినాదంతో కొనసాగించిన ఉద్యమంలో దాదాపు 32 మంది అసువులు బాసారు. ఆ నేపథ్యంలోనే విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై నాటి ప్రధాని 1970 ఏప్రిల్ 17న ప్రకటన చేశారు. ► 2002 నుంచి 2015 వరకు విశాఖ ఉక్కు కర్మాగారం అత్యుత్తమ పని తీరు ప్రదర్శించి లాభాల బాటలో నడిచిందన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. 2002లో దీన్ని ఖాయిలా పరిశ్రమగా బీఐఎఫ్ఆర్ (బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీ కన్స్ట్రక్షన్)కు నివేదించారు. ► విశాఖ నగరంలోనే స్టీల్ ప్లాంట్‌కు దాదాపు 19,700 ఎకరాల భూమి ఉంది. దాని ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు లక్ష కోట్లకు పైగానే ఉంటుంది. సంస్థ ఉత్పత్తి సామర్థ్యం 7.3 మిలియన్ టన్నులు కాగా, ఇటీవలే ఆర్ఐఎన్ఎల్ సంస్థను ఆ«ధునీకరించడంతో పాటు, ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి విస్తరణ చర్యలు చేపట్టింది. ఆ దిశలో వనరుల సేకరణ కోసం ప్రయత్నాలు కూడా మొదలు పెట్టింది. అయితే విశ్వ వ్యాప్తంగా ఈ రంగంలో ఉత్పన్నమైన మాంద్యంతో విశాఖ ఉక్కు కర్మాగారం కూడా 2014–15 నుంచి క్రమంగా నష్టాల బాట పట్టింది. సొంతంగా గనులు లేనందున ఉత్పత్తి వ్యయం దారుణంగా పెరిగింది. ఫలితంగా లాభాలు పూర్తిగా పడిపోయాయి. ► విశాఖ ఉక్కు కర్మాగారం నుంచి పెట్టుబడులు ఉపసంహరించడం కంటే, ఆ సంస్థకు కాస్త అండగా నిల్చి, చేయూతనిస్తే తప్పనిసరిగా లాభాల బాటలో నడుస్తుందన్న గట్టి నమ్మకంతో చెబుతున్నాను. సంస్థకు అవసరమైన గనులను కేటాయిస్తే ఉత్పత్తి వ్యయం గణనీయంగా తగ్గుతుంది. అదే విధంగా ఎక్కువ వడ్డీ రుణాలను తక్కువ వడ్డీ రుణాలుగా మార్చడం, రుణాలను వాటాల రూపంలోకి మార్చాలనే ఈ కింది అంశాలను పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. 1. రెండేళ్లు గడువు ఇస్తే పరిస్థితిలో మార్పు ఆర్థిక అంశాలకు సంబంధించిన అన్ని రంగాలతో పాటు, స్టీల్ రంగం కూడా ఆర్థిక మాంద్యం నుంచి క్రమంగా కోలుకుంటున్న విషయం తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్తి ఉత్పాదక సామర్థ్యం 7.3 లక్షల మెట్రిక్ టన్నులు. ఆర్ఐఎన్ఎల్ గత ఏడాది డిసెంబర్ నుంచి 6.3 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో గరిష్ట స్థాయిలో పని చేస్తూ ప్రతి నెలా దాదాపు రూ.200 కోట్ల లాభాలు ఆర్జిస్తోంది. ఇదే తరహాలో మరో రెండేళ్లు పని చేస్తే, సంస్థ ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. 2. ఉత్పత్తి వ్యయం తగ్గడం కోసం సొంత గనులు కేటాయించాలి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ)కు చెందిన బైలదిల్లాలోని గనుల నుంచి మార్కెట్ ధరకు ఇనుప ఖనిజం కొనుగోలు చేస్తోంది. ఒక్కో మెట్రిక్ టన్ను ఇనుప ఖనిజాన్ని దాదాపు రూ.5,260కు సంస్థ కొనుగోలు చేస్తోంది. కాగా దేశంలోని అన్ని ఉక్కు కర్మాగారాలకు సొంతంగా ఇనుప ఖనిజ గనులు ఉన్నాయి. వాటి ద్వారా ఆయా సంస్థల అవసరాలు 60 శాతం మేర తీరుతుండగా, మిగిలిన ఇనుప ఖనిజాన్ని అవి ఎన్ఎండీసీకి చెందిన గనుల నుంచి కొనుగోలు చేస్తున్నాయి. చివరకు కేంద్ర ప్రభుత్వ రంగంలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)కు కూడా 200 ఏళ్లకు సరిపడా ఇనుప ఖనిజం గనులు సొంతంగా ఉన్నాయి. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్‌కు అవసరమైన ఇనుప ఖనిజాన్ని పూర్తిగా ఎన్ఎండీసీ గనుల నుంచి కొనుగోలు చేయడం ద్వారా విశాఖ ఆర్‌ఐఎన్‌ఎల్‌పై రూ.3,472 కోట్లకు పైగా భారం పడుతోంది. అందువల్ల ఈ రంగంలో ఉన్న మిగిలిన సంస్థలతో విశాఖ స్టీల్ ప్లాంట్ పోటీ పడే విధంగా సొంత గనులు కేటాయించాలి. ఇది ఉత్పత్తి వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఒడిశాలో ఒక ఇనుప ఖనిజం గని ఉంది. అది సంస్థ రివైవల్ కోసం ఎంతో దోహదకారిగా నిలుస్తుంది. 3. రుణాలను ఈక్విటీలుగా మార్చాలి సంస్థ స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలను ఈక్విటీలుగా మార్చడం వల్ల సంస్థపై రుణాలు తిరిగి చెల్లించే ఒత్తిడి తగ్గించడంతో పాటు, రుణాలపై వడ్డీల భారం కూడా తగ్గుతుంది. సంస్థ రుణ భారం రూ.22 వేల కోట్లు కాగా, దానికి అత్యధికంగా 14 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. ఆ రుణాలను బ్యాంకులు ఈక్విటీలుగా మారిస్తే, వడ్డీ భారం పూర్తిగా పోవడంతో పాటు, విశాఖ స్టీల్ ప్లాంట్ (ఆర్ఐఎన్ఎల్, విశాఖ) కూడా స్టాక్ ఎక్సేంజ్‌లో లిస్ట్ అవుతుంది. ఆ ప్రక్రియతో స్టాక్ మార్కెట్ ద్వారా ప్రజల నుంచి నిధుల సేకరణకు అవకాశం కూడా ఏర్పడుతుంది. ఈ చర్యలు సంస్థపై రుణ భారం తగ్గిస్తాయి. తద్వారా సంస్థ పనితీరు మరింత మెరుగు కావడంతో ఆర్థికంగా వెసులుబాటు కూడా కలుగుతుంది. 4. మిగులు భూమిలో ప్లాటింగ్ విశాఖ స్టీల్ పునరుద్ధరణకు మరో మార్గం కూడా ఉంది. ఆర్ఐఎన్ఎల్ వద్ద వినియోగించుకోని 7,000 ఎకరాల భూమి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ భూమిని ఆర్ఐఎన్ఎల్ చేత ప్లాటింగ్ చేయించి.. ప్లాట్లుగా మార్చి అమ్మితే ప్లాంట్‌ను ఆర్థికంగా బలోపేతం చేయవచ్చు. తద్వారా సంస్థ విలువ పెరుగుతుంది. ఇందుకు అవసరమైన భూ వినియోగ మార్పిడికి అవసరమైన అన్ని అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇవన్నీ మీకు స్వయంగా వివరిస్తాం.. విశాఖ స్టీల్ ప్లాంట్ రివైవల్‌తో పాటు సంస్థను తిరిగి లాభాల బాటలోకి మళ్లించడానికి ఏమేం చేయవచ్చన్న అన్ని విషయాలను స్వయంగా వివరించడం కోసం వీలైనంత త్వరగా అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరుతున్నాను. అఖిలపక్ష బృందంతో పాటు, కార్మిక సంఘాల నాయకులను కూడా వెంట తీసుకువస్తాను. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి రాష్ట్ర ప్రజల ఆకాంక్షను, సంస్థతో మాకు ముడిపడి ఉన్న సెంటిమెంట్‌ను స్వయంగా వివరిస్తాము. అందువల్ల వీలైనంత త్వరగా అపాయింట్మెంట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ రివైవల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ, సహకారాలను అందిస్తుందని నేను హామీ ఇస్తున్నాను. లక్ష్య సాధన కోసం మీ సమర్థవంతమైన నాయకత్వంలో, మీతో కలిసి అడుగులు వేస్తామని తెలియజేస్తున్నాను. సమాజానికి, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు ఎంతో విలువైన, ముఖ్యమైన విశాఖ స్టీల్ ప్లాంట్ కొనసాగాలని, ఈ ప్రక్రియలో వీలైనంత త్వరగా అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరుతున్నాను. -
మీ నాయకత్వంపై నమ్మకముంది
ఈ పరీక్షా సమయంలో, క్లిష్ట పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగానే కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ (ప్రధాని) వెనుక ఉంటాను. మా రాష్ట్రంలోని 6 కోట్ల మంది ప్రజలు కూడా మనస్ఫూర్తిగా మీకు మద్దతు తెలుపుతున్నారు. మీ సమర్థ నాయకత్వంపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ పరీక్షా సమయాలను ఎదుర్కొని అన్ని సమస్యలనూ అధిగమించి భారత్ మరింత శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందని గట్టిగా విశ్వసిస్తున్నాను. ఈ సంక్షోభ సమయంలో ఏ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నా మేము దానికి కట్టుబడి ఉంటాం. సాక్షి, అమరావతి: గాల్వాన్ లోయ వద్ద జూన్ 15న జరిగిన ఘటనలో మన దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడానికి అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులకు, వారి త్యాగాలకు మా రాష్ట్రం తరఫున సెల్యూట్ చేస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. చైనాతో ఘర్షణల నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ శుక్రవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో సీఎం మాట్లాడారు. 20 మంది వీర సైనికుల మరణం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నానని, ఆ వీర సైనికులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని తెలిపారు. ‘మీ (పధాన మంత్రి మోదీ) సమర్థ నాయకత్వంపై మాకు పూర్తి నమ్మకం ఉంది. గాల్వాన్ సంక్షోభంలో ఈ దేశాన్ని మీరు సరైన మార్గంలో విజయవంతంగా నడిపిస్తారని నమ్ముతున్నాం’ అని సీఎం జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రసంగంలోని కీలక అంశాలు ఇలా ఉన్నాయి. దేశ ప్రతిష్ట పెరిగింది ► ఇవ్వాళ్టి అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న నాయకులంతా భుజం భుజం కలిపి.. మరణించిన సైనికుల కుటుంబాలకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత అణ్వస్త్ర యుగంలో ప్రపంచం మారుతోంది. కేవలం సైన్యంతో మాత్రమే యుద్ధం చేయలేం. దౌత్యం, వ్యాపార, ఆర్థిక ఆంక్షలు, అంతర్జాతీయ ఒత్తిడి ద్వారా వివిధ రకాలుగా యుద్ధం చేయొచ్చు. ► ఈ ఘర్షణల్లో వారు ఆయుధాలను వాడలేదు. అలాగే అటువైపున కూడా సైనిక నష్టం జరిగిందనే వాస్తవాన్ని గుర్తించుకోవాలి. 2014 నుంచి అంతర్జాతీయంగా మన దేశ గౌరవం, ప్రతిష్ట ఇనుమడించిందనే విషయాన్ని ఈ అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న నాయకులు అంతా అంగీకరిస్తారనే అనుకుంటున్నా. ► భారత్‌ను ఆర్థికంగా, దౌత్యపరంగా శక్తివంతమైన దేశంగా తీర్చి దిద్దడానికి మోదీ కృషి చేశారు. విశ్వ వ్యాప్తంగా మన దేశ ప్రతిష్టలు పెరిగాయి. ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్, వివిధ పార్టీల నేతలు బలమైన దేశంగా భారత్ ► ప్రధాని వివిధ దేశాల్లో విస్తృత పర్యటనల ద్వారా, వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా అంతర్జాతీయంగా సంబంధాలు మరింత బలపడ్డాయి. ప్రధాని మోదీ భారత్‌ను ముందు వరుసలో నడిపించారు. ప్రపంచ వ్యాప్తంగా బలమైన దేశంగా నిలిచిన భారత్ ఇతర దేశాలకు దారి చూపించింది. ► ప్రధాని విజయవంతమైన విదేశీ విధానాల ద్వారా 3 రకాల ఇంటర్నేషనల్ కంట్రోల్ రిజైమ్స్‌లో భారత్ చోటు సాధించింది. దీని వల్ల అంతర్జాతీయంగా ప్రాముఖ్యత సాధించాం. క్షిపణులు – జీవ రసాయన ఆయుధాలు – ఆయుధాలు, వెసెనర్ అగ్రిమెంట్, ఆస్ట్రేలియా గ్రూపుల్లో భారత్ చోటు సాధించింది. ► 192 సభ్య దేశాలున్న ఐక్యరాజ్య సమితిలో భారత్ 184 మంది సభ్యుల మద్దతుతో ఐక్యరాజ్యసమితి, భద్రతామండలిలో సభ్యదేశంగా ఎంపికైంది. గ్లోబల్ స్టేట్స్‌మన్‌గా ప్రధానమంత్రి చూపిన అసాధారణ నైపుణ్యం వల్లనే ఈ చిరస్మరణీయమైన విజయాలు సాధ్యమయ్యాయి. సమస్యకు పరిష్కారం కనుక్కుంటారని విశ్వసిస్తున్నాం ► ఈ అసాధారణ విజయాలు పలువురికి కంటగింపుగా మారాయి. పరోక్ష శక్తుల ద్వారా దేశాన్ని అస్థిర పరచాలని ప్రయత్నించారు. ఇన్ని శక్తులు మనకు వ్యతిరేకంగా పని చేస్తున్నప్పటికీ ప్రధాని సమర్థమైన నాయకత్వంలో విజయం సాధించి ముందుకెళ్తున్నాం. ► పలు సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ప్రధాని చాలా చురుగ్గా, వేగంగా స్పందించారు. పుల్వామా దాడి, డోక్లాం సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలు, మసూద్ అజర్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటింప చేయడంతోపాటు, అంతర్జాతీయ న్యాయస్థానంలో కులభూషణ్ జాదవ్ కేసులో 15–1 ఓట్ల తేడాతో వచ్చిన తీర్పు.. మీ నాయకత్వ పటిమకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ► మీ సమర్థ నాయకత్వంలో దేశ భవిష్యత్తు భద్రంగా ఉంటుందని మేం గట్టిగా నమ్ముతున్నాం. గాల్వాన్ లోయలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఎప్పటికప్పుడు నేను నిశితంగా గమనిస్తున్నాను. అక్కడ జరిగిన ఘటనలు, ఇరు దేశాల మధ్య సంబంధాలకు సంబంధించి, మా కంటే కేంద్రంలో ఉన్న వారికే బాగా తెలుసు కాబట్టి, ఈ విషయంలో మరింత లోతుగా వెళ్లదలచుకోలేదు. ► ఈ పరిస్థితుల్లో ప్రధాని తన దార్శనికత, దౌత్య సంబంధాలను వినియోగించుకోవడం ద్వారా ఈ సమస్యలకు ఒక పరిష్కారం కనుక్కుంటారనే విశ్వాసంతో ఉన్నాం. ► ఈ పరీక్షా సమయాలను ఎదుర్కొని అన్ని సమస్యలనూ అధిగమించి భారత్ మరింత శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందని గట్టిగా విశ్వసిస్తున్నాను. ఈ సంక్షోభం సమయంలో ఏ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటాం. ఘటనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ► రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తొలుత ఘటన వివరాలను వివరించారు. విదేశాంగ శాఖ మంత్రి డా ఎస్.జయశంకర్ భారత్, చైనా సరిహద్దు వివరాల గురించి రాజకీయ పార్టీల నేతలకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తెలియజేశారు. కేంద్ర మంత్రి జయశంకర్ సరిహద్దు సమస్య పరిష్కారం కోసం దశాబ్దాలుగా జరుగుతున్న చర్చల గురించి, ఇదివరకు కుదిరిన ఒప్పందాల్లోని కీలక అంశాల గురించి వివరించారు. ► 1950–60 మధ్య తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో జరిగిన ఘటనలు, సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు, రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం వివరాలు, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జరుగుతున్న పరిణామాల గురించి జయశంకర్ వివరించారు. ► వీడియో కాన్ఫరెన్స్‌లో 20 పార్టీల ప్రతినిధులు మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభించడానికి ముందు గాల్వాన్ లోయ వద్ద చైనాతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన వీర సైనికులకు ప్రధాని, వివిధ పార్టీల నేతలు నివాళులు అర్పించారు. -
అఖిలపక్షం పోరుబాట
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా పోరుబాట పట్టాలని అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. ఆదివారం విజయవాడలో వామపక్షాల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. సీపీఐ, సీపీఎం, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, లోక్‌సత్తా, జనసేన, ఆమ్ ఆద్మీ సహా 18 పార్టీలు, వివిధ ప్రజాసంఘాలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర మేధావులు, మాజీ ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున హాజరయ్యారు. భవిష్యత్ కార్యాచరణ ప్రకారం సోమవారం (ఫిబ్రవరి 19) నుంచి ప్రతిరోజూ ఏదో ఒక జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశం. మార్చి 1న వైఎస్సార్సీపీ తలపెట్టిన దీక్షలకు, 5న ఢిల్లీలో ధర్నాకు మద్దతు.మార్చి 8న ‘చలో పార్లమెంట్’తో వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు సమావేశం నిర్ణయించింది. -
అఖిలపక్షంతో సమావేశానికి సిద్ధం
యాదగిరిగుట్ట: మోటకొండూర్ మండల ఏర్పాటును వివిధ గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్న తరుణంలో అఖిలపక్షంతో భేటికి సిద్ధమని టీఆర్ఎస్ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం చొల్లేరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోటకొండూర్‌ను మండల కేంద్రంగా ఏర్పాటయ్యేందుకు కేటాయించిన గ్రామాలు సంసిద్ధత వ్యక్తం చేయని విషయంపై ప్రతిపక్షాలు ఊరికో మాట ప్రచారం చేస్తున్నాయని వాపోయారు. ప్రజాభిష్టం మేరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్ణయించిన మండల కేంద్రానికి ఆమోదం కోసం తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. మోటకొండూర్‌కు సమీప, దూర గ్రామాలను గుర్తించి ప్రభుత్వానికి అఖిలపక్షం ద్వారా విప్ సునీత ఆధ్వర్యంలో అభిప్రాయాసేకరణను అందిద్దామని ఆయన కోరారు. యాదాద్రి జిల్లాపై... యాదాద్రి జిల్లా ఏర్పాటును టీడీపీ జాతీయ పోలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు పోరాట ఫలితమేనని ఆయన ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. జనగామ ప్రాంత వాసులు కూడా జిల్లా కోసం ఉద్యమాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేని విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. చిన్నకందుకూర్ ప్రజలపై పోలీసులు లాఠీ చేయడం భాదకరమని మహేందర్‌రెడ్డి అన్నారు. -
విశాఖ రైల్వేజోన్ కోసం హోరెత్తిన నిరసనలు
విశాఖపట్నం: విశాఖపట్నం రైల్వే జోన్ కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. విశాఖకు రైల్వేజోన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పెందుర్తి వద్ద రైల్వే ట్రాక్ పై నేతలు బెఠాయించారు. ఆందోళ కార్యక్రమాల్లో పాల్గొన్న అఖిలపక్షనేతలను పోలీసులు అక్కడి నుంచి లాక్కెళ్లారు. వైఎస్ఆర్సీపీ నేతలు గుడివాడ అమర్నాథ్, అదీప్ రాజులతో పాటూ పలువురు వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. -
అధ్యాత్మికతలో రాజకీయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన
మధురానగర్ : అధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో రాజకీయ జోక్యం తగదని సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. కోగంటి అక్రమ అరెస్టును ఖండించారు. గాంధీనగర్ ధర్నా చౌక్‌లో ఆదివారం అఖిల పక్షం ఆ«««దl్వర్యాన అధ్యాత్మిక, సేవాకార్యక్రమాలలో రాజకీయ జోక్యాన్ని నిరసిస్తూ నిరసన కార్యక్రమం ప్రారంభమైంది. సత్యనారాయణపురంలోని బ్రాహ్మణ కల్యాణ మండపం విషయంలో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని అబాసుపాలయ్యారని గుర్తు చేశారు. డూండీ సేవా సమితి గౌరవాధ్యక్షుడిగా కోగంటి సత్యం చేసిన సేవలు నగర వాసులందరికీ చిరపరిచితమేనన్నారు. కార్యక్రమంలో ఆమ్ఆద్మీపార్టీ నాయకులు ఫణికుమార్, మాజీ డిప్యూటీ మేయర్ గిరిపురపు గ్రిటన్, ఆమ్ ఆద్మీ పార్టీ మఖ్య సలహాదారు హర్‌మహీందర్‌సింగ్ సహాని, బీజేపీ యువమోర్చా నగర అధ్యక్షుడు చిన్నపురెడ్డి రవీంద్రారెడ్డి, కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిది మీసాల రాజేశ్వరరావు, రాష్ట్ర గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు తమ్మపర్తి నాగేశ్వరరావు, ఎమ్మార్పీఎస్ కృష్ణాజిల్లా అధ్యక్షుడు కోటా డానియేల్, ఎమ్మార్పీఎస్ నగర అధ్యక్షుడు లింగాల న రసింహులు, సీపీఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు కె రామారావు, ఏపీసీఎల్సీ రాష్ట్ర ఉఫాద్యక్షుడు ఎస్ఎస్సీ బోస్ పాల్గొన్నారు. -
నగర పంచాయతీ ఎదుట అఖిలపక్షం ధర్నా
తీర్మానానికి చైర్మన్ కట్టుబడాలన్న నాయకులు హుస్నాబాద్ మండలాన్ని కరీంనగర్ జిల్లాలో కొనసాగించాలని నగర పంచాయతీ పాలకవర్గం చేసిన తీర్మానానికి చైర్మన్ సుద్దాల చంద్రయ్య కట్టుబడి ఉండాలని డిమాండ్ చేస్తూ బుధవారం నగర పంచాయతీ కార్యాలయం ఎదుట అఖిలపక్ష నాయకులు ధర్నా నిర్వహించారు. హుస్నాబాద్‌ను కరీంనగర్‌లోనే కొనసాగించాలని నగర పంచాయతీలో తీర్మానం చేసిన చైర్మన్.. టీఆర్ఎస్ పార్టీ సమావేశాల్లో మాత్రం సిద్దిపేటలో కలపాలని మాట్లాడడం సరికాదన్నారు. మండలంలోని మెజార్టీ గ్రామాలు కరీంనగర్‌లోనే కొనసాగించాలని తీర్మానాలు చేసి అధికారులకు పంపించాయన్నారు. చైర్మన్ బయటకు రావాలని నినాదాలు చేశారు. నగరపంచాయతీ కార్యాలయంలోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. చైర్మన్ చంద్రయ్య బయటకు వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. ప్రజలకు ఏది ఆమోదయోగ్యంగా ఉంటే అదే చేస్తామన్నారు. ఒకసారి తీర్మానించాక పునరాలోచించబోమని స్పష్టం చేశారు. దీంతో నాయకులు ఆందోళన విరమించారు. ధర్నాలో సింగిల్‌విండో డైరెక్టర్ అయిలేని మల్లికార్జున్‌రెడ్డి, సీపీఐ మండల కార్యదర్శి కొయ్యడ సృజన్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు అయిలేని శంకర్‌రెడ్డి, బొల్లి శ్రీనివాస్, మైదంశెట్టి వీరన్న, పచ్చిమట్ల రవీందర్, అక్కు శ్రీనివాస్, పచ్చిమట్ల సంపత్, బీజేపీ నాయకులు విజయపాల్‌రెడ్డి, ఆడెపు లక్ష్మినారాయణ, వేముల దేవేందర్‌రెడ్డి, విద్యాసాగర్, అనిల్, వరయోగుల అనంతస్వామి, టీడీపీ నాయకులు వరయోగుల శ్రీనివాస్, ముప్పిడి రాజిరెడ్డి, సీపీఐ నాయకులు మాడిశెట్టి శ్రీధర్, జగన్నాధం తదితరులున్నారు. -
పోలీసు బలగాలను వెనక్కి తీసుకోండి
సాక్షి, సిటీబ్యూరో: మల్లన్న సాగర్ ప్రాంతంలో మోహరించిన పోలీసు బలగాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని భూ నిర్వాసితుల పోరాట సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. మల్లన్నసాగర్ ప్రాంతంలో 144 సెక్షన్‌ను తొలగించాలని కోరారు. జీవో 123 ప్రకారం భూమి కొనుగోళ్లు ఆపివేయాలని సమావేశం డిమాండ్ చేసింది. ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేస్తోందని, బెదిరింపులకు పాల్పడుతోందని వక్తలు అభిప్రాయపడ్డారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ రైతుల రక్తం కళ్లజూసిన పాలకులు ఎంతోకాలం అధికారంలో ఉండరని చరిత్ర రుజువు చేసిందన్నారు. ఎమర్జెన్సీ విధించి, పౌర హక్కులను కాలరాయాలనుకున్న ఇందిరాగాంధీ సైతం ఓటమి పాలవక తప్పలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకుడు కోదండరెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛందంగా అసెంబ్లీలో దీనిపై చర్చిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసిస్తారని అభిప్రాయపడ్డారు. టీడీపీ నాయకుడు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టుల పేరుతో తెలంగాణలో వేలాది మంది రైతులు భిక్షగాళ్లుగా మారాల్సి వచ్చిందన్నారు. వేముల ఘాట్ ఇప్పుడు పాకిస్థాన్ సరిహద్దులను తలపిస్తోందని తెలంగాణ రైతు కూలీ సంఘ నాయకులు వెంకట్ అన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్లు, పోలీసు నిర్బంధానికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 1న తలపెట్టిన ఆందోళనను విజయవంతం చేయాలని సీపీఎం నాయకులు రాములు కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర అధ్యక్షురాలు పశ్య పద్మ, సజయ, రమా మెల్కొటే, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ కుమార్, దళిత బహుజన్ ఫ్రంట్ నేత శంకర్, పిట్టల రవీందర్, గాదె ఇన్నయ్య, ఉషాసీతాలక్ష్మి, విమల, పీఓడబ్లు్య సంధ్య, తెలంగాణ రైతు సంఘ ప్రతినిధి సాగర్, రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధి విస్సా కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఉల్లి, టమాట రైతుల గోడు పట్టదా?
అఖిలపక్ష రైతు సంఘాల సమావేశంలో ఎమ్మెల్యే గౌరుచరిత కల్లూరు (రూరల్): గిట్టుబాటు ధర లేక ఉల్లి, టమాట రైతులు నష్టపోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని పాణ్యం శాసన సభ్యురాలు గౌరు చరితారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓ వైపు తీవ్ర వర్షాభావం..మరోవైపు గిట్టుబాట ధర లేక రైతన్నలు కన్నీరు పెడుతున్నారన్నారు. ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు రెయిన్ గన్లు, ఆయిల్ ఇంజిన్లు ఇస్తున్నామని గొప్పలు చెబుతూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. మార్కెట్లో ఉల్లి, టమాట రైతులను వ్యాపారులు మోసం చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇప్పటి వరకు వారికి చేసిందేమీ లేదన్నారు. వైఎస్ఆర్సీపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గత ఏడాది కరువు మండలాలను ప్రకటించి ఇప్పటి వరకు రైతులకు నష్టపరిహారం అందించలేదన్నారు. రైతులు పండించిన ఉల్లి, టమటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పిట్టం ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ ఉల్లి పంటను వ్యాపారులు మార్కెట్లో తక్కువ ధరకు కొనుగోలు చేసి బయట ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారని అన్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. జగన్నాథం మాట్లాడుతూ ఉల్లి క్వింటానికి రూ.2వేలు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ జనసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి. శేషఫణి మాట్లాడుతూ ముఖ్యమంత్రికి కష్ణా పుష్కరాలపై ఉన్న శ్రద్ధ రాయలసీమ రైతుల కష్టాలపై లేదన్నారు. హంద్రీ పరివాహక పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఎం. రామకష్ణారెడ్డి మాట్లాడుతూ ‡ ప్రభుత్వం కార్పొరేట్‌కు అండగా ఉంటూ... రైతులను సంక్షోభంలో నెట్టేస్తుందన్నారు. మార్కెట్‌యార్డు సందర్శన అఖిల పక్ష రైతు సంఘాల నేతలతో కలసి ఎమ్మెల్యే గౌరుచరిత మార్కెట్‌ను సందర్శించి ఉల్లి రైతులు పడుతున్న కష్ట,నష్టాలను పరిశీలించారు. రైతులతో చర్చించి ఉల్లి సాగులో పెట్టిన పెట్టుబడులు, దిగుబడులు ఏ స్థాయిలో వచ్చాయి, మార్కెట్లో లభిస్తున్న ధరలను తెలుసుకున్నారు. రైతులు తమ కష్టాలను ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్నారు. క్వింటాలుకు రూ.100 నుంచి రూ.150 మాత్రమే లభిస్తుందని వాపోయారు. దీంతోఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలని ఎమ్మెల్యే, అఖిల పక్ష రైతుల సంఘాల నాయకులు ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేశారు.∙అనంతరం మార్కెట్‌యార్డు చైర్మన్ శమంతకమణి, సెక్రటరీ సత్యనారాయణమూర్తిని పిలిపించి ఉల్లికి రూ. 2 వేలు మద్దతు ధర కల్పించి, కోనుగోళ్లను నిరంతరాయంగా కొనసాగించాలని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీ సెల్ జిల్లా కన్వీనర్ ఎస్. ఫిరోజ్, సమాచార హక్కు చట్టం నాయకులు ఎన్.కె. జయన్న తదితరులు పాల్గొన్నారు. -
నిరసనలు ఉధృతం చేస్తాం
ప్రభుత్వానికి అఖిలపక్షం హెచ్చరిక కోహెడ: కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ – కోహెడ మండలాలను కొనసాగించాలని సోమవారం మండలంలోని కూరెల్లలో అఖిల పక్షం నాయకులు కళ్ల, చెవులు, నోరు మూసుకొని ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా అఖిల పక్షం నాయకులు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలను పక్కన పెట్టి సిద్దిపేటలో రెండు మండలాలను కలిపేందుకు ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల అభిప్రాయలు గౌరవించి కరీంనగర్‌లోనే కోహెడ, హుస్నాబాద్ మండలాలను ఉంచాలని డిమాండ్ చేశారు. 21 గ్రామాలలో 16 గ్రామాలు కరీంనగర్ జిల్లాలో ఉంటామని తీర్మానాలు చేశారని గుర్తు చేశారు. 16 గ్రామాలలో రోజుకు ఒక్క పద్దతిలో ప్రభుత్వానికి నిరసన తెలుపుతామన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ సభ్యుడు బండారి బాలరాజు, మాజీ సర్పంచ్ తాళ్లపల్లి ఎల్లయ్యగౌడ్, వలుస సుభాష్, అఖిల పక్షం నాయకులు ఖమ్మం వెంకటేశం, గవ్వ వంశీధర్‌రెడ్డి, చెపూరి తిరుపతి, గాజుల వెంకటేశ్వర్లు, బందెల బాలకిషన్, పిల్లి నర్సయ్య, రాజశేఖర్‌చారి, జాగిరి కుమార్, బండి రవి, కిషన్, వెంకన్న పాల్గొన్నారు. -
కోహెడ మండలాన్ని కరీంనగర్ జిల్లాలో ఉంచాలి
కోహెడ: కరీంనగర్ జిల్లాలో కోహెడ మండలాన్ని కొనసాగించాలని కోరుతూ ఆదివారం వెంకటేశ్వరపల్లిలో అఖిల పక్షం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్బంగా అఖిల పక్షం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాల పునర్విభజనతో ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందన్నారు. గాంధీ విగ్రహం వద్ద చెవిలో ప“లతో ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ప్రజల ఆకాంక్షతో ప్రభుత్వం అంతిమ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అఖిల పక్షం నాయకులు ఖమ్మం వెంకటేశం, గవ్వ వంశీధర్‌రెడ్డి, వసాల సంపత్, బందెల బాలకిషన్, కమలాకర్‌రావు, వలుస సుభాష్, పిడిÔð ట్టి రాజు, గాజుల వెంకటేశ్వర్లు, చేపూరి తిరుపతి, పండుగ మల్లయ్య పాల్గొన్నారు. -
కలిసికట్టుగా ఒత్తిడి తెద్దాం
ఆలూరు రూరల్ : ప్రత్యేకహోదా సాధన కోసం అన్ని పార్టీల నాయకులు కలిసికట్టుగా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పాచక్రపాణిరెడ్డి అన్నారు. మండల పరిధిలోని మణెకుర్తిలో మహాత్మాగాంధీ విగ్రహావిష్కరణకు హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజన చట్టంలో పొందుపరిచిన వాటి అమలు కోసం తమపార్టీ ఎంపీలు కషి చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకహోదాను ఇవ్వాలన్న విషయంపై అన్ని పార్టీల నేతలు కలిసిగట్టుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఒత్తిడి తేవాలన్నారు. ఒకరిపైఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రత్యేకహోదా ఉద్యమాన్ని నీరుగారిస్తే రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. కష్ణా పుష్కరాలకు ఇదివరకే కొంతమంది ముఖ్య అధికారులు, నేతలకు ప్రభుత్వం తరఫున ఆహ్వాన లేఖలు అందజేశామన్నారు. మరి కొందరికి కూడా త్వరలో ఆహ్వాన లేఖలు పంపుతామన్నారు. విలేకరు సమావేశంలో ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జి వీరభద్రగౌడ్, మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ, మాజీ ఇన్చార్జి వైకుంఠం మల్లికార్జునచౌదరి పాల్గొన్నారు. -
సీమకు అన్యాయం చేస్తే ప్రత్యేక ఉద్యమం
– కలెక్టరేట్ ముట్టడిలో అఖిలపక్ష నేతలు కర్నూలు : శ్రీశైలం జలాల విషయంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఇదే కొనసాగితే భవిష్యత్తులో ప్రత్యేక ఉద్యమం వస్తుందని అఖిలపక్ష నేతలు హెచ్చరించారు. శ్రీశైలం నీరు సాగర్‌కు విడదుల చేయడానికి నిరసనగా రాయలసీమ సాగు నీటి సాధన సమితి ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, బీజేపీలు మద్దతు ఇచ్చాయి. ఈ సందర్భంగా రాయలసీమ సాగు నీటి సాధన సమితి కన్వీనర్ బొజ్జా దశరథ రామిరెడ్డి∙మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి జలాశయం శ్రీశైలలమని, నీటి పంపకాల విషయంలో తెలంగాణ ఒత్తిళ్లకు తలొగ్గి సీమ గురించి ఏ మాత్రం పట్టించుకోవడం విచారకరమన్నారు. సీమకు ప్రత్యేక హోదా కంటే సాగు నీరే ముఖ్యమన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి అనాలోచిత నిర్ణయాలతో ప్రాంతాల మద్య విభేదాలు వచ్చి ప్రత్యేక ఉద్యమాలకు దారితీస్తాయన్నారు. తీరు మార్చుకోకపోతే సీమలో సీఎం చంద్రబాబు కార్యక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. రాయల సీమకు చెందిన తెలుగు దేశం పార్టీ నేతలు అన్యాయంపై నోరు మెదపకపోవడం శోచనీయమన్నారు. కలెక్టరేట్ ముట్టడిలో వైఎస్ఆర్సీపీ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, బీజేపీ నాయకుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, విద్యార్థి సంఘాల నాయకులు, రైతు సంఘాలు నాయకులు పాల్గొన్నారు. -
రాజీనామా చేయాల్సిందే.. వాళ్లు చేయరు!
న్యూఢిల్లీ: అధికార, విపక్షాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం రసాభాసగానే ముగిసింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రతిష్టంభన నేపథ్యంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీలో పార్లమెంటు సెంట్రల్ హాల్లో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఇరుపక్షాలు ఎవరి ధోరణిని వారు కొనసాగించడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. మంత్రులు రాజీనామా చేయాలని విపక్షం, చేస ప్రసక్తే లేదని కేంద్రం ఎవరి పట్టు మీద వాళ్లున్నారు. దీంతో ఎలాంటి దిశా నిర్దేశం లేకుండానే సమావేశం ముగిసింది. కేంద్రమంత్రులు, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామాలపై విపక్షాలు పట్టుబట్టాయి. సుష్మ, రాజే, చౌహాన్ రాజీనామా చేయాల్సిందేనని, అప్పటి వరకు చర్చలు జరిగేది లేదని విపక్షం గట్టిగా వాదించింది. విపక్షాలు డిమాండ్లను తోచ్చిపుచ్చిన కేంద్రం.. వాళ్లెవరూ రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ సమావేశానికి హాజరు కాలేదు. దీంతో వివాదం ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు మరింత సన్నగిల్లాయి. అయితే ప్రధాని సభలో సమాధానం చెబుతారని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి విపక్షాలు ససేమిరా అన్నాయి. వ్యాపం, లలిత్ గేట్ వివాదాలతో గత వారం రోజులుగా పార్లమెంటు అట్టుడుకుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధరా రాజె రాజీనామా చేయాల్సిందే అంటూ పట్టుబడుతున్నాయి. నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శనతో హోరెత్తిస్తున్నాయి. దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ వివరణ ఇవ్వాలని కోరుతున్నాయి. మరోవైపు లలిత్ మోదీ వీసా విషయంలో బ్రిటిష్ గవర్నమెంటుకు తానెప్పుడూ సిఫారసు చేయలేదని సుష్మాస్వరాజ్ ఈ రోజు రాజ్యసభలో ప్రకటించారు. దీంతో మరింత గందరగోళం చెలరేగింది. సుష్మా ప్రకటనను రికార్డుల నుంచి తొలగించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా సభలో మంత్రి ప్రకటన చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. దీంతో అటు రాజ్యసభ, ఇటు లోక్‌సభ మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. అఖిలపక్షం ముగిసిన తర్వాత పార్లమెంటు ఉభయ సభలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇరు సభల్లోనూ విపక్ష సభ్యుల నిరసనల హోరు కొనసాగుతోంది. -
కలెక్టర్ తీరుకు నిరసనగా ధర్నా
-
కలెక్టర్ తీరుకు నిరసనగా అఖిలపక్షం ధర్నా
వైఎస్ఆర్ జిల్లా: వైఎస్ఆర్ జిల్లా అభివృద్ధిని కలెక్టర్ కేవీ రమణ అడ్డుకుంటున్నారని, ఆయన తీరుకు నిరసనగా కలెక్టరేట్ ఎదుట అఖిలపక్షం ధర్నా నిర్వహించింది. ప్రజల ఆకాంక్షలకి వ్యతిరేకంగా కలెక్టర్ పని చేస్తున్నారని ధర్నాలో పాల్గొన్న నేతలు అన్నారు. ఈ ధర్నాలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, రఘురామ్ రెడ్డి, రవీంద్రనాధ్ రెడ్డి, అంజత్ భాష, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, మానవహక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీలు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యం పరిహాసం!
♦ వరుస వివాదాలు ఎదురవుతున్నా కలెక్టర్ తీరులో కన్పించని మార్పు ♦ అఖిలపక్షం గళమెత్తినా స్పందించని అధికార పక్షం ♦ టీడీపీ నేతలకు శృంగభంగం కావడంతో ఉలిక్కిపడిన వైనం ♦ రేపు కలెక్టరేట్ ముట్టడికి సిద్ధమైన అఖిలపక్షం సాక్షి ప్రతినిధి, కడప : ప్రజాస్వామ్యంలో నియంతృత్వానికి తావు లేదు. ఎంతటి ఉన్నత స్థాయి అధికారైనా ప్రజాభిప్రాయాన్ని గౌరవించాల్సి ఉంది. కొంతకాలంగా జిల్లాలో యంత్రాంగం చర్యలు తద్భిన్నంగా ఉంటున్నాయి. కలెక్టర్ కెవి రమణ జిల్లా ప్రజల గౌరవానికి భంగం కలిగేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. వైఖరి మార్చుకోవాలని ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు సూచించినప్పటికీ తరచూ వివాదస్పద ఘటనలు చోటుచేసుకుంటేనే ఉన్నాయి.తాజాగా అధికార తెలుగుదేశం పార్టీ నేతలు సైతం కలెక్టర్ తీరును వ్యతిరేకిస్తూ పత్రికలకెక్కారు. ఈనేపథ్యంలో జిల్లాలోని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలెక్టరేట్ ముట్టడికి సిద్ధమయ్యాయి. జిల్లా క లెక్టర్‌గా కెవి రమణ జూలైలో పదవీ బాధ్యతలు చేపట్టారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అనతి కాలంలోనే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారు. రాజంపేట మండలం బోయినపల్లెలో టీచర్ ఆర్థర్ బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని గ్రామస్తులు దాడి చేశారు. ఈఘటనలో గ్రామస్తులు తీవ్ర కోపోద్రిక్తులు కావడంతో స్థానిక పోలీసులు బాధ్యులైన ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. తదనంతరం హైస్కూల్‌ను సందర్శించిన కలెక్టర్ కెవీ రమణ.. ఉపాధ్యాయులు గిచ్చడం, గిల్లడం చదువు చెప్పడంలో భాగమేనని పేర్కొని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యవహారంలో కలెక్టర్ వైఖరిని తప్పుబట్టుతూ.. ఇలాంటి కలెక్టర్‌ను మునుపెన్నడూ చూడలేదని విద్యార్థి సంఘాలు, మానవ హక్కుల వేదిక ఆరోపించింది. తొందరపాటుగా వ్యాఖ్యానించారు కాబోలు అనుకుని, పలువురు తొలి ఘటనగా భావించారు. అంతలోనే స్పోర్ట్స్ స్కూల్ అవకతవకలపై విద్యార్థులు ఆ పాఠశాల నుంచి కలెక్టరేట్ వరకూ రెండు పర్యాయాలు ర్యాలీ నిర్వహించి, ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంలో వాస్తవ పరిస్థితుల కోసం కలెక్టర్ ఇద్దరు అధికారులతో క మిటీని నియమించారు. ఆ కమీటీ విచారణ చేస్తుండగానే.. కమీటీ సభ్యులతోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఆఫీసర్ పక్కలో కూర్చొని విద్యార్థుల ఆరోపణలల్లో ఆధారాలు లేవని స్వయంగా కలెక్టరే పాత్రికేయుల సమావేశంలో ప్రకటించారు. విద్యార్థుల ఆందోళనకు కారుకులుగా గుర్తించి ఇద్దరు ఉపాధ్యాయులను తప్పించారు. వాస్తవానికి నివేదిక ఇవ్వడంలో మాత్రం స్పెషల్ ఆఫీసర్ రామచంద్రారెడ్డి అవినీతికి పాల్పడ్డట్లు పేర్కొంటూ సిఫార్సులను ప్రభుత్వానికి పంపారు. ఇవన్నీ గ్రహించిన తర్వాత విశ్లేషకులు సైతం వాపోయారు. రైతుల పట్ల సైతం ఆదే ధోరణి.... మైదుకూరు నియోజకవర్గంలో పలు గ్రామాల పసుపు పంట రైతులకు కొందరు పురుగు మందుల వ్యాపారులు నకిలీ మందులు విక్రయించారు. ఫలితంగా పసుపు పూర్తిగా పాడైంది. వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు పరిశీలించి, పసుపు పంటకు వాడకూడని మందులు పిచికారి చేయడంతోనే పంట నష్టపోయారని నివేదిక అందించారు. జిల్లా సర్వోన్నతాధికారిగా రైతుల పక్షాన నిలిచి కంపెనీతో చర్చలు నిర్వహించి ఆదుకోవాల్సిన బాధ్యత కలెక్టర్‌పై ఉంది. రైతులు అనేక పర్యాయాలు కలెక్టర్‌ను కలిస్తే.. తుదకు ఫోరంను ఆశ్రయించండంటూ ఉచిత సలహా ఇచ్చారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. బద్వేలు ఆస్పత్రిని సీమాంక్ ఆస్పత్రిలోకి తరలించరాదని స్థానిక ప్రజలు ఆందోళన చేపట్టారు. వారి ఆందోళన సమంజసమేనని ఎమ్మెల్యే జయరాములు, మాజీ ఎమ్మెల్యే గోవిందురెడ్డి సైతం నిరహార దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. ఇవేవి పట్టించుకోకుండా సీమాంక్ ఆస్పత్రిలోకి మార్పు చేస్తూ స్వయంగా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.ప్రజలు, ప్రజాప్రతినిధులు వ్యతిరేకించినా పెడచెవిన పెట్టడాన్ని పలువురు తీవ్రం గా తప్పుబట్టారు. అంతటితో ఆగకుండా సీమాంక్ ఆస్పత్రికి దారి ఉన్నా, వందేళ్ల క్రితం నుంచి ఉన్న చర్చిలో నుంచి 60 అడుగుల దారి ఇవ్వాలని ఆదేశించడం మరో వివాదంగా మారింది. తనదాకా వచ్చేంత వరకూ.... అధికార తెలుగుదేశం పార్టీ.. తనదాకా వచ్చేంత వరకూ కలెక్టర్ వైఖరిపై స్పందించలేదు. జిల్లాలో ముఖ్యమంత్రి అధికారిక పర్యటనకు ఆహ్వానం పంపి, తీరా ఏడుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జడ్పీ చెర్మైన్లను అడ్డుకున్నారు. ప్రజాస్వామ్యం లో నియంతృత్వానికి తావు లేదని, కలెక్టర్ అప్రజాస్వామ్యక చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసినా అధికార పక్షం పెడచెవిన పెట్టింది. జిల్లా ప్రజలు ఆవేశపరులు, పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు బయపడుతున్నారని మరోమారు కలెక్టర్ వివాదానికి ఆస్కారం అయ్యారు. అప్పట్లో కూడ అధికార పార్టీ నేతలు ఖండించ లేదని పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఒంటిమిట్ట ఉత్సవాలల్లో యంత్రాంగం ఫ్రోటోకాల్ ఉల్లఘించారని ఏకంగా విప్ పదవికి రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి రాజీనామా చేశారు. దాంతో కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేతలు పత్రికలకెక్కారు. తాజాగా ఓ పత్రిక ఏకపక్షంగా వార్తలు రాస్తోందని మీడియా ఆత్మీయ సమావేశంలో మరోమారు కలెక్టర్ వివాదస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మరోపత్రిక (సాక్షి కాదు) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్.. మిగతా పత్రికలను కించపరిచేలా వ్యాఖ్యానించడం ఆశ్చర్యపరిచింది. జిల్లా కలెక్టర్ తీరు ఇంత వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్ ముట్టడికి అఖిలపక్షం పిలుపునిచ్చింది. ఒక జిల్లా కలెక్టర్‌ను వెనక్కు పిలిపించుకోండని ఉద్యమించిన చరిత్ర మునుపెన్నడూ లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్‌కు పిలుపు
చింతూరు(ఖమ్మం) : ఖమ్మం జిల్లా చింతూరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలనే డిమాండ్‌తో అఖిలపక్షం బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాలలో శనివారం బంద్ పాటించాలని కోరుతూ శుక్రవారం చింతూరులో అఖిలపక్షం నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో ఎటపాకను రెవెన్యూ డివిజన్ చేయడంవలన భవిష్యత్తులో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి చింతూరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని, లేదంటే మున్ముందు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మూడు మండలాలకు చెందిన ప్రజలు, వ్యాపారులు బంద్‌కు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చింతూరు ఎంపీపీ చిచ్చడి మురళి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రామలింగారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ హబీబ్, అహ్మద్అలీ, సీపీఐ మండల కన్వీనర్ ఎస్ కే రంజాన్, సీపీఎం నాయకులు సీతారామయ్య, కోట్ల కృష్ణలు పాల్గొన్నారు. కాగా ఎటపాకను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటిస్తూ గత నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్(రాజపత్రం)ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
'ఆల్ పార్టీ మీట్ ఎప్పుడో నిర్వహించాల్సింది'
-
ట్రిబ్యునల్ తీర్పుపై అఖిలపక్ష సమావేశం