అధ్యాత్మికతలో రాజకీయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన
మధురానగర్ :
అధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో రాజకీయ జోక్యం తగదని సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. కోగంటి అక్రమ అరెస్టును ఖండించారు. గాంధీనగర్ ధర్నా చౌక్‌లో ఆదివారం అఖిల పక్షం ఆ«««దl్వర్యాన అధ్యాత్మిక, సేవాకార్యక్రమాలలో రాజకీయ జోక్యాన్ని నిరసిస్తూ నిరసన కార్యక్రమం ప్రారంభమైంది. సత్యనారాయణపురంలోని బ్రాహ్మణ కల్యాణ మండపం విషయంలో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని అబాసుపాలయ్యారని గుర్తు చేశారు. డూండీ సేవా సమితి గౌరవాధ్యక్షుడిగా కోగంటి సత్యం చేసిన సేవలు నగర వాసులందరికీ చిరపరిచితమేనన్నారు. కార్యక్రమంలో ఆమ్‌ఆద్మీపార్టీ నాయకులు ఫణికుమార్, మాజీ డిప్యూటీ మేయర్ గిరిపురపు గ్రిటన్, ఆమ్ ఆద్మీ పార్టీ మఖ్య సలహాదారు హర్‌మహీందర్‌సింగ్ సహాని, బీజేపీ యువమోర్చా నగర అధ్యక్షుడు చిన్నపురెడ్డి రవీంద్రారెడ్డి, కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిది మీసాల రాజేశ్వరరావు, రాష్ట్ర గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు తమ్మపర్తి నాగేశ్వరరావు, ఎమ్మార్పీఎస్ కృష్ణాజిల్లా అధ్యక్షుడు కోటా డానియేల్, ఎమ్మార్పీఎస్ నగర అధ్యక్షుడు లింగాల న రసింహులు, సీపీఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు కె రామారావు, ఏపీసీఎల్‌సీ రాష్ట్ర ఉఫాద్యక్షుడు ఎస్‌ఎస్‌సీ బోస్ పాల్గొన్నారు.