సాక్షి, న్యూఢిల్లీ: బెంగాల్‌లో బీజేపీ దళిత కార్యకర్త హత్యకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు ఢిల్లీలోని బంగా భవన్‌ను ముట్టడించారు. పూరూలియా జిల్లాలో బుధవారం ఓ దళిత యువకుడు అనుమానస్పదంగా మృతి బెందిన విషయం తెలిసిందే. ఈ హత్యను తృణమూల్ కాంగ్రెస్ నేతలే చేశారని శుక్రవారం బంగా భవన్ వద్ద బీజేపీ దళిత మోర్చా నేతలు ఆందోళన చేశారు. బీజేపీ కార్యకర్త అయినందేకు తృణమూల్ నేతలు దళిత యువకుడిని హత్య చేసి చెట్టుకు ఉరేశారని మోర్చా నేతలు ముకుల్ రాయ్, కైలాస్ విజయ్ ఆరోపించారు.
పంచాయతీ ఎన్నికల్లో జరిగిన ఘర్షణకు ప్రతీకారంగా ఈ హత్య చేశారన్నారు. కమ్యూనిస్టు ప్రభుత్వం చేసిన హింస కంటే తృణమూల్ నేతల హింసలే ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు. బీజేపీ కార్యకర్త అయినందేవల్లనే నిన్ను హత్యచేస్తున్నామని మృతుడి ఇంటి సమీపంలో ఓ లేఖ లభ్యమైందని పోలీసు అధికారులు తెలిపారు. కానీ ఆ లేఖ ఎవరు రాశారో వివరాలు ఏమీ లేవన్నారు. బీజేపీ చేస్తున్న ఆరోపణలను టీఎంసీ తీవ్రంగా ఖండించింది. ఆధారాలు లేకుండా తమపై ఆరోపణలు చేస్తున్నారని టీఎంసీ నేతలు మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment