నిరసనలు ఉధృతం చేస్తాం
నిరసనలు ఉధృతం చేస్తాం
Published Mon, Aug 22 2016 7:38 PM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM
ప్రభుత్వానికి అఖిలపక్షం హెచ్చరిక
కోహెడ: కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ – కోహెడ మండలాలను కొనసాగించాలని సోమవారం మండలంలోని కూరెల్లలో అఖిల పక్షం నాయకులు కళ్ల, చెవులు, నోరు మూసుకొని ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా అఖిల పక్షం నాయకులు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలను పక్కన పెట్టి సిద్దిపేటలో రెండు మండలాలను కలిపేందుకు ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల అభిప్రాయలు గౌరవించి కరీంనగర్‌లోనే కోహెడ, హుస్నాబాద్ మండలాలను ఉంచాలని డిమాండ్ చేశారు. 21 గ్రామాలలో 16 గ్రామాలు కరీంనగర్ జిల్లాలో ఉంటామని తీర్మానాలు చేశారని గుర్తు చేశారు. 16 గ్రామాలలో రోజుకు ఒక్క పద్దతిలో ప్రభుత్వానికి నిరసన తెలుపుతామన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ సభ్యుడు బండారి బాలరాజు, మాజీ సర్పంచ్ తాళ్లపల్లి ఎల్లయ్యగౌడ్, వలుస సుభాష్, అఖిల పక్షం నాయకులు ఖమ్మం వెంకటేశం, గవ్వ వంశీధర్‌రెడ్డి, చెపూరి తిరుపతి, గాజుల వెంకటేశ్వర్లు, బందెల బాలకిషన్, పిల్లి నర్సయ్య, రాజశేఖర్‌చారి, జాగిరి కుమార్, బండి రవి, కిషన్, వెంకన్న పాల్గొన్నారు.
Advertisement
Advertisement