అఖిలపక్షంతో సమావేశానికి సిద్ధం
అఖిలపక్షంతో సమావేశానికి సిద్ధం
Published Sun, Sep 18 2016 10:28 PM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM
యాదగిరిగుట్ట: మోటకొండూర్ మండల ఏర్పాటును వివిధ గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్న తరుణంలో అఖిలపక్షంతో భేటికి సిద్ధమని టీఆర్‌ఎస్ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం చొల్లేరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోటకొండూర్‌ను మండల కేంద్రంగా ఏర్పాటయ్యేందుకు కేటాయించిన గ్రామాలు సంసిద్ధత వ్యక్తం చేయని విషయంపై ప్రతిపక్షాలు ఊరికో మాట ప్రచారం చేస్తున్నాయని వాపోయారు. ప్రజాభిష్టం మేరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్ణయించిన మండల కేంద్రానికి ఆమోదం కోసం తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. మోటకొండూర్‌కు సమీప, దూర గ్రామాలను గుర్తించి ప్రభుత్వానికి అఖిలపక్షం ద్వారా విప్ సునీత ఆధ్వర్యంలో అభిప్రాయాసేకరణను అందిద్దామని ఆయన కోరారు.
యాదాద్రి జిల్లాపై...
యాదాద్రి జిల్లా ఏర్పాటును టీడీపీ జాతీయ పోలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు పోరాట ఫలితమేనని ఆయన ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. జనగామ ప్రాంత వాసులు కూడా జిల్లా కోసం ఉద్యమాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేని విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. చిన్నకందుకూర్ ప్రజలపై పోలీసులు లాఠీ చేయడం భాదకరమని మహేందర్‌రెడ్డి అన్నారు.
Advertisement
Advertisement