కలిసికట్టుగా ఒత్తిడి తెద్దాం
Published Mon, Aug 8 2016 12:47 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
ఆలూరు రూరల్ : ప్రత్యేకహోదా సాధన కోసం అన్ని పార్టీల నాయకులు కలిసికట్టుగా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పాచక్రపాణిరెడ్డి అన్నారు. మండల పరిధిలోని మణెకుర్తిలో మహాత్మాగాంధీ విగ్రహావిష్కరణకు హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజన చట్టంలో పొందుపరిచిన వాటి అమలు కోసం తమపార్టీ ఎంపీలు కషి చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకహోదాను ఇవ్వాలన్న విషయంపై అన్ని పార్టీల నేతలు కలిసిగట్టుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఒత్తిడి తేవాలన్నారు. ఒకరిపైఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రత్యేకహోదా ఉద్యమాన్ని నీరుగారిస్తే రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. కష్ణా పుష్కరాలకు ఇదివరకే కొంతమంది ముఖ్య అధికారులు, నేతలకు ప్రభుత్వం తరఫున ఆహ్వాన లేఖలు అందజేశామన్నారు. మరి కొందరికి కూడా త్వరలో ఆహ్వాన లేఖలు పంపుతామన్నారు. విలేకరు సమావేశంలో ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి వీరభద్రగౌడ్, మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ, మాజీ ఇన్‌చార్జి వైకుంఠం మల్లికార్జునచౌదరి పాల్గొన్నారు.
Advertisement