Joint fight
-
కలిసికట్టుగా ఒత్తిడి తెద్దాం
ఆలూరు రూరల్ : ప్రత్యేకహోదా సాధన కోసం అన్ని పార్టీల నాయకులు కలిసికట్టుగా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పాచక్రపాణిరెడ్డి అన్నారు. మండల పరిధిలోని మణెకుర్తిలో మహాత్మాగాంధీ విగ్రహావిష్కరణకు హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజన చట్టంలో పొందుపరిచిన వాటి అమలు కోసం తమపార్టీ ఎంపీలు కషి చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకహోదాను ఇవ్వాలన్న విషయంపై అన్ని పార్టీల నేతలు కలిసిగట్టుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఒత్తిడి తేవాలన్నారు. ఒకరిపైఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రత్యేకహోదా ఉద్యమాన్ని నీరుగారిస్తే రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. కష్ణా పుష్కరాలకు ఇదివరకే కొంతమంది ముఖ్య అధికారులు, నేతలకు ప్రభుత్వం తరఫున ఆహ్వాన లేఖలు అందజేశామన్నారు. మరి కొందరికి కూడా త్వరలో ఆహ్వాన లేఖలు పంపుతామన్నారు. విలేకరు సమావేశంలో ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జి వీరభద్రగౌడ్, మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ, మాజీ ఇన్చార్జి వైకుంఠం మల్లికార్జునచౌదరి పాల్గొన్నారు. -
లష్కరే, ఐఎస్ఐఎస్లపై సమష్టి పోరు
సుష్మా స్వరాజ్ పిలుపు కైరో: తమ పొరుగున ఉన్న పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా, తాలిబాన్లపైనా, గల్ఫ్ ప్రాంతంలో ముప్పుగా పరిణమించిన ఐఎస్ఐఎస్ లాంటి ఉగ్రవాద సంస్థలపై ఉమ్మడి పోరాటం చేద్దామని భారత్ పిలుపునిచ్చింది. నానాటికీ పెరిగిపోతున్న ఉగ్రవాదంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈజిప్టులో పర్యటిస్తున్న విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మంగళవారమిక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ఈజిప్టు వ్యూహాత్మక నిపుణులు, విధాన రూపకర్తలనుద్దేశించి మాట్లాడారు. అపనమ్మకం, హింసల నుంచి శాంతి, అభివృద్ధి దిశగా విశ్వాసాన్ని పెంపొందించుకోవాలంటే.. చర్చల ద్వారా విస్తృతమైన దృక్పథాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరముందని చెప్పారు. గల్ఫ్ ప్రాంతానికి ఐఎస్ఐఎస్ నుంచి ఎలాంటి ముప్పు పొంచి ఉందో.. భారత్కు కూడా పొరుగుదేశం నుంచి లష్కరే తోయిబా, తాలిబాన్ల నుంచి ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు.