న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకం, పలు అంతర్జాతీయ పోటీల్లో విజ యాలు సాధించి సత్తా చాటిన రెజ్లర్ బబితా ఫొగాట్, ఆమెకు శిక్షణ నిచ్చిన ఆమె తండ్రి మహవీర్‌సింగ్ ఫొగాట్‌లు సోమవారం బీజేపీలో చేరారు. వీరిద్దరి విజయాలు స్ఫూర్తిగా ‘దంగల్’ పేరుతో ఆమిర్‌ఖాన్ హీరోగా బాలీవుడ్‌లో ఓ సినిమా కూడా రూపొందిన విషయం తెలిసిందే. కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజుజు, హరియాణా రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్ అనిల్ జైన్ సమక్షంలో వారు బీజేపీ తీర్థం పుచ్చుకు న్నారు. యువశక్తికి బబిత నిదర్శనంగా నిలిచిం దని కిరణ్ రిజిజు ప్రశంసించారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఫొగాట్‌ల చేరిక పార్టీకి కొత్త శక్తినిస్తుందని బీజేపీ పేర్కొంది. బబిత చేరిక హరియాణా బీజేపీకి మంచిరోజు అని అనిల్ అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా ప్రధాని మోదీ చరిత్రను తిరగరాశారని బబిత ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment