Mahavir Singh Phogat
-
బీజేపీలోకి రెజ్లర్ బబిత
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకం, పలు అంతర్జాతీయ పోటీల్లో విజ యాలు సాధించి సత్తా చాటిన రెజ్లర్ బబితా ఫొగాట్, ఆమెకు శిక్షణ నిచ్చిన ఆమె తండ్రి మహవీర్‌సింగ్ ఫొగాట్‌లు సోమవారం బీజేపీలో చేరారు. వీరిద్దరి విజయాలు స్ఫూర్తిగా ‘దంగల్’ పేరుతో ఆమిర్‌ఖాన్ హీరోగా బాలీవుడ్లో ఓ సినిమా కూడా రూపొందిన విషయం తెలిసిందే. కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజుజు, హరియాణా రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ అనిల్ జైన్ సమక్షంలో వారు బీజేపీ తీర్థం పుచ్చుకు న్నారు. యువశక్తికి బబిత నిదర్శనంగా నిలిచిం దని కిరణ్ రిజిజు ప్రశంసించారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఫొగాట్‌ల చేరిక పార్టీకి కొత్త శక్తినిస్తుందని బీజేపీ పేర్కొంది. బబిత చేరిక హరియాణా బీజేపీకి మంచిరోజు అని అనిల్ అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా ప్రధాని మోదీ చరిత్రను తిరగరాశారని బబిత ప్రశంసించారు. -
బీజేపీలోకి ప్రముఖ క్రీడాకారిణి!
న్యూఢిల్లీ: ప్రముఖ రెజ్లర్ బబితా ఫొగాట్, ఆమె తండ్రి మహావీర్ సింగ్ ఫొగాట్ సోమవారం బీజేపీలో చేరారు. కేంద్ర క్రీడల మంత్రి కిరెన్ రిజిజు సమక్షంలో ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయంలో వారు కాషాయం కండువా కప్పుకున్నారు. ఈ ఏడాది చివర్లో హరియాణా అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్రీడాకారులైన బబిత, మహావీర్ బీజేపీ గూటికి చేరారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో కశ్మీర్ నుంచి అందమైన వధువులను తెచ్చుకోవచ్చంటూ హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బబితా రెండో రోజుల కిందట సమర్థించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ ఆమె గత కొన్ని రోజులుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరుణాన్ని చూసే అదృష్టం నాకు లేకపోయింది. కానీ, ఆర్టికల్ 370, 35ఏల రద్దుతో కశ్మీర్ స్వాతంత్ర్యం పొందడాన్ని చూసే అదృష్టం దక్కినందుకు ఆనందంగా ఉంది’ అని బబిత ట్వీట్ చేశారు. అయితే, క్రీడాకారులకు హరియాణా బీజేపీ సర్కారు అందించే నగదు ప్రోత్సాహకాలు సరిగ్గా లేవంటూ ఆమె గతంలో పలుసార్లు విమర్శలు చేశారు. 2014, 2018 కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ అయిన బబిత ప్రస్తుతం ‘నాచ్ బలియే’ డ్యాన్స్ షోలో పాల్గొంటున్నారు. త్వరలో ఆమెను పెళ్లి చేసుకోనున్న సహ రెజ్లర్ వివేక్ సుహాగ్ ఈ షోలో ఆమెకు జోడీగా వ్యవహరిస్తున్నారు. మహావీర్‌సింగ్ ఫొగాట్, ఆయన కూతుళ్ల జీవితకథ ఆధారంగా ఆమిర్ ఖాన్ 2016లో ‘దంగల్’ సినిమా తీసిన సంగతి తెలిసిందే. -
రజనీకి ఆ పాత్ర పులి మీద స్వారీలాంటిది!
చెన్నై: ప్రముఖ హర్యానా రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న మూవీ 'దంగల్'. ఈ మూవీలో మహావీర్ పాత్రలో బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్ నటిస్తున్నాడు. హిందీ వెర్షన్లో తాను పోషించిన పాత్రను తమిళంలో చేయాలని సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను ఆమిర్ కోరాడు. అయితే ఈ ఆఫర్‌ను రజనీ సున్నితంగా తిరస్కరించారని తలైవా సన్నిహితులు జాతీయ మీడియాకు తెలిపారు. ఈ మూవీపై ఆమిర్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. గతంలో ఏ మూవీకి రాని హిట్స్ ఈ మూవీ ట్రైలర్ సొంతం చేసుకుంది. నిజానికి ఆమిర్ పోషిస్తున్న పాత్ర చాలా కష్టంతో కూడుకున్నదన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఆమిర్ ఈ మూవీ కోసం 25 కేజీలకు పైగా బరువు పెరిగాడు. ఇలాంటి రోల్ పోషించడమంటే రజనికీ పులి మీద స్వారీ చేయడం లాంటిదే. బరువు పెరగడం, తగ్గడం లాంటివి రజనీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని, గత కొన్ని మూవీల సందర్భంగా రజనీ అనారోగ్యం పాలైన విషయాన్ని సూపర్ స్టార్ ప్రస్తావించారు. దంగల్ మూవీలో మహావీర్ సింగ్ ఫోగట్ తన కుమార్తెలు గీతా ఫోగట్, బబితా కుమారిలను కూడా రెజ్లర్లుగా రూపొందించడాన్ని తెరపై చూడవచ్చు.