రజనీకి ఆ పాత్ర పులి మీద స్వారీలాంటిది! | Rajinikanth may rejected Aamir Khan movie Dangal Offer | Sakshi
Sakshi News home page

రజనీకి ఆ పాత్ర పులి మీద స్వారీలాంటిది!

Published Fri, Dec 9 2016 7:21 PM | Last Updated on Mon, Sep 4 2017 10:18 PM

రజనీకి ఆ పాత్ర పులి మీద స్వారీలాంటిది!

రజనీకి ఆ పాత్ర పులి మీద స్వారీలాంటిది!

చెన్నై: ప్రముఖ హర్యానా రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న మూవీ 'దంగల్'. ఈ మూవీలో మహావీర్ పాత్రలో బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ ఆమిర్ నటిస్తున్నాడు. హిందీ వెర్షన్‌లో తాను పోషించిన పాత్రను తమిళంలో చేయాలని సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను ఆమిర్ కోరాడు. అయితే ఈ ఆఫర్‌ను రజనీ సున్నితంగా తిరస్కరించారని తలైవా సన్నిహితులు జాతీయ మీడియాకు తెలిపారు. ఈ మూవీపై ఆమిర్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. గతంలో ఏ మూవీకి రాని హిట్స్ ఈ మూవీ ట్రైలర్ సొంతం చేసుకుంది.

నిజానికి ఆమిర్ పోషిస్తున్న పాత్ర చాలా కష్టంతో కూడుకున్నదన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఆమిర్ ఈ మూవీ కోసం 25 కేజీలకు పైగా బరువు పెరిగాడు. ఇలాంటి రోల్ పోషించడమంటే రజనికీ పులి మీద స్వారీ చేయడం లాంటిదే. బరువు పెరగడం, తగ్గడం లాంటివి రజనీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని, గత కొన్ని మూవీల సందర్భంగా రజనీ అనారోగ్యం పాలైన విషయాన్ని సూపర్ స్టార్ ప్రస్తావించారు. దంగల్ మూవీలో మహావీర్ సింగ్ ఫోగట్ తన కుమార్తెలు గీతా ఫోగట్, బబితా కుమారిలను కూడా రెజ్లర్లుగా రూపొందించడాన్ని తెరపై చూడవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement