
ఆమిర్ ఖాన్ 'దంగల్' సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహావీర్ ఫొగాట్ అనే వ్యక్తి జీవితం ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర రూ.2000 కోట్లు వరకు వసూళ్లు వచ్చాయి. అయితే తమ కుటుంబానికి మాత్రం రూ.కోటి మాత్రమే ఇచ్చారనే విషయాన్ని బబిత ఫొగాట్ బయటపెట్టింది.
న్యూస్ 24 ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బబిత మాట్లాడుతూ.. తమ కుటుంబానికి రూ.కోటి ఇచ్చిన విషయాన్ని బయటపెట్టింది. ప్రాజెక్ట్‌లోకి ఆమిర్ ఖాన్ రాకముందే ఈ ఒప్పందం జరిగినట్లు చెప్పుకొచ్చింది. ఇంత మొత్తమే వచ్చినందుకు తమకు ఎలాంటి బాధ లేదని, ఎందుకంటే తన తండ్రి మహావీర్ ఫొగాట్.. ప్రజల ప్రేమ దక్కిచే చాలని చెప్పినట్లు గుర్తు చేసుకుంది.
(ఇదీ చదవండి: అవినాష్ సరదా.. నిజంగానే డోర్ తెరిచిన బిగ్‌బాస్)
హర్యానాకు చెందిన మహావీర్ ఫొగాట్.. రెజ్లింగ్‌లో అనుకున్నంత సక్సెస్ కాలేకపోయాడు. దీంతో తనకు పుట్టే కొడుకుల్ని మంచి రెజ్లర్ చేద్దామని అనుకున్నారు. కూతుళ్లు పుట్టేసరికి తొలుత బాధపడ్డాడు గానీ తర్వాత ఎన్నో అవమానాలు ఎదుర్కొని మరీ వాళ్లని రెజ్లర్స్‌గా తీర్చిదిద్దాడు. అద్భుతమైన డ్రామా వర్కౌట్ అయిన ఈ మూవీ.. మన దేశంతో పాటు చైనా, జపాన్‌లోనూ మంచి వసూళ్లు సాధించింది.
మహావీర్ ఫొగాట్ రెండో కూతురే బబిత. 2010 కామన్‌వెల్త్ గేమ్స్‌లో వెండి పతకం సాధించింది. 2014లో బంగారం అందుకుంది. 2012లో ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో కాంస్యం అందుకుంది. 2016 ఒలింపిక్స్‌లో పాల్గొంది గానీ పతకం కొట్టలేకపోయింది. 2019లో రెజ్లింగ్‌కి రిటైర్మెంట్ ఇచ్చేసి రాజకీయాల్లో చేరింది. ప్రస్తుతం బీజేపీలో ఉంది.
(ఇదీ చదవండి: ఉదయనిధి స్టాలిన్ రూ. 25 కోట్లు చెల్లించాల్సిందే.. కోర్టుకెళ్లిన నిర్మాత)
2000 करोड़ की फिल्म, फोगाट परिवार को मिला सिर्फ 1 करोड़
◆ बबीता फोगाट का चाय वाला इंटरव्यू मानक गुप्ता के साथ
◆ पूरा इंटरव्यू: https://t.co/LPKn1lwMLb@ManakGupta #ManakKaRapidFire @BabitaPhogat | #ChaiWalaInterview pic.twitter.com/Fgt843zYE1— News24 (@news24tvchannel) October 22, 2024
Comments
Please login to add a commentAdd a comment