
బిగ్‌బాస్ హౌసులో ఎనిమిదో వారం నామినేషన్ పూర్తయ్యాయి. మొత్తంగా ఆరుగురు నామినేట్ అయ్యారు. మెహబూబ్, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ, నయని పావని లిస్టులో ఉన్నారు. హరితేజ కూడా నామినేట్ అయింది. కాకపోతే మెగాచీఫ్ గౌతమ్.. సూపర్ పవర్ ఉపయోగించిన ఆమెని తప్పించాడు. ఈ వారానికి సంబంధించి కీలక ఘట్టం ముగియడంతో కంటెస్టెంట్స్ ఎంటర్‌టైన్‌మెంట్ మొదలుపెట్టారు.
(ఇదీ చదవండి: ఉదయనిధి స్టాలిన్ రూ. 25 కోట్లు చెల్లించాల్సిందే.. కోర్టుకెళ్లిన నిర్మాత)
పృథ్వీ మెడలోని బంగారు గొలుసు గురించి తేజ అడగ్గా.. 'గోల్డ్, గోల్డ్ వేసుకుని తిరగడం ఫస్ట్ టైమ్ చూస్తున్నా' అని విష్ణుప్రియ మధ్యలో దూరి కామెంట్ చేసింది. అందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోతాం అని సరదాగా కామెంట్ చేశారు. అయితే అవినాష్ అన్నప్పుడు బిగ్‌బాస్ నిజంగానే డోర్ తెరిచాడు. దీంతో అందరూ అతడిని పట్టుకుని మరీ బయటకు తోసేయడానికి ప్రయత్నించారు. ఇదంతా కూడా ఫన్నీగా సాగింది.
దీని తర్వాత అవినాష్ జిమ్ ట్రైనర్‌గా మారి, ఇంటి సభ్యులు వర్కౌట్స్ ఎలా చేయాలో చెప్పాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఆ తర్వాత టేస్టీ తేజతో వర్కౌట్స్ చేయించాడు. ఇదంతా కూడా ఫన్నీగా సాగేసరికి మిగిలిన హౌస్‌మేట్స్ అందరూ పగలబడి నవ్వారు. పదేపదే అవినాష్, రోహిణి, టేస్టీ తేజతో తప్పితే మిగిలిన వాళ్ల నుంచి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది రావట్లేదు. బుధవారం కూడా అవినాష్ తన కామెడీతో నవ్విస్తాడని అనిపిస్తోంది.
(ఇదీ చదవండి: బర్త్ డే స్పెషల్.. చిన్నప్పటి ఫొటోలతో ప్రభాస్ చెల్లి)
Comments
Please login to add a commentAdd a comment