డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీలు పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు. మిగతా వాళ్ల సంగతేమో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు కూతురు ప్రసీద షేర్ చేసిన ఫొటోలు మాత్రం ఆకట్టుకుంటున్నాయి. ఎందుకంటే తాను చిన్నప్పుడు ప్రభాస్‌తో దిగిన చాలా ఫొటోల్ని ప్రసీద ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
(ఇదీ చదవండి: ప్రభాస్ ఇంటి వద్ద అభిమానుల హాల్ చల్)
కృష్ణంరాజు నలుగురు కూతుళ్లలో ప్రసీద ఒకరు. ఈమెతో పాటు మిగతా ముగ్గురు చెల్లెళ్లు అంటే ప్రభాస్‌కి చాలా ఇష్టం. ప్రసీద అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతుంటుంది. కానీ ఇప్పుడు అన్న పుట్టినరోజు సందర్భంగా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు దిగిన చాలా పిక్స్‌ని పంచుకుంది. ఇది చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ లైక్స్ కొట్టేస్తున్నారు.
(ఇదీ చదవండి: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'ప్రభాస్'.. ఎలా సాధ్యమైంది..?)
Comments
Please login to add a commentAdd a comment