Prabhas Birthday
-
బర్త్ డే స్పెషల్.. నవరసాల్లో డార్లింగ్ ప్రభాస్
-
టాలీవుడ్ నే అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఏకైక స్టార్ ప్రభాస్
-
ప్రభాస్‌ను ఎవరైనా ప్రేమించాల్సిందే: చిరంజీవి
ప్రభాస్‌కు మాత్రమే డై హార్ట్ ఫ్యాన్స్ ఉంటారు. నేడు ఆయన పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ క్రమంలో చిత్రపరిశ్రమకు చెందిన పలువురు స్టార్స్ ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. వెండితెర రారాజుగా విలసిల్లుతున్న ప్రభాస్ మనసు కూడా ఎంతో ప్రత్యేకం. దేశ వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి విపత్కర పరిస్థితిలు వచ్చినా సరే తన వంతు సాయం చేసేందుకు ముందుకొస్తాడు. అలా తను మీడియా ప్రపంచానికి దూరంగా ఉంటూనే అభిమానుల గుండెలకు దగ్గరగా ఉంటాడు. అందుకే ఆయన్ను అభిమానించని వారంటూ ఉండరని చెప్పవచ్చు. సోషల్‌మీడియా వేదికగా ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. నేడు #Happybirthdayprabhas అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుంది.ఆ కటౌట్ చూసి అన్ని నమ్మేయాలి డూడ్..! అతను ప్రేమించే పద్దతి చూసి, తిరిగి అమితంగా ప్రేమించేస్తాం. పుట్టినరోజు శుభాకాంక్షలు డార్లింగ్ ప్రభాస్. ప్రేమ, సంతోషం, గొప్ప కీర్తి ఎల్లప్పుడు మీ వెంటే ఉంటాయని కోరుకుంటున్నాను..! ఈ అద్భుతమైన సంవత్సరం మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది.. - చిరంజీవిభారతీయ సినిమా పవర్‌హౌస్, నా సోదరుడు ప్రభాస్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రభాస్ తన అసమానమైన ప్రతిభ, అంకితభావంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హృదయాలతో పాటు వెండితెరలపై జయిస్తూనే ఉన్నాడు. మరెన్నో సంవత్సరాల పాటు తన గొప్పతనం నిలిచిపోతుంది. హ్యాపీ బర్త్ డే ప్రభాస్.. -మంచు విష్ణునిబద్ధత, కోరిక, ప్రతిభ, సంసిద్ధత, కఠోర శ్రమ, వినయం అన్నీ కలిస్తేనే గెలుపు ఖాయం . నువ్వే విజేత. జన్మదిన శుభాకాంక్షలు ప్రభాస్.. - త్రివిక్రమ్నా ప్రియమైన మిత్రుడు ప్రభాస్‌కి జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.. - రామ్ చరణ్అందరికి ప్రియమైన ప్రభాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ వినయం, నిబద్ధత,అంకితభావం ఇవన్నీ నేడు మిమ్మల్ని ఇంతటి స్థాయిలో ఉంచాయి. మీరు కేవలం నటుడిగానే కాకుండా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చే శక్తిగా మారారు. బాక్సాఫీస్ వద్ద మీరు మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా.. - ప్రశాంత్ వర్మ -
బర్త్ డే స్పెషల్.. చిన్నప్పటి ఫొటోలతో ప్రభాస్ చెల్లి
డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీలు పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు. మిగతా వాళ్ల సంగతేమో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు కూతురు ప్రసీద షేర్ చేసిన ఫొటోలు మాత్రం ఆకట్టుకుంటున్నాయి. ఎందుకంటే తాను చిన్నప్పుడు ప్రభాస్‌తో దిగిన చాలా ఫొటోల్ని ప్రసీద ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: ప్రభాస్ ఇంటి వద్ద అభిమానుల హాల్ చల్)కృష్ణంరాజు నలుగురు కూతుళ్లలో ప్రసీద ఒకరు. ఈమెతో పాటు మిగతా ముగ్గురు చెల్లెళ్లు అంటే ప్రభాస్‌కి చాలా ఇష్టం. ప్రసీద అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతుంటుంది. కానీ ఇప్పుడు అన్న పుట్టినరోజు సందర్భంగా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు దిగిన చాలా పిక్స్‌ని పంచుకుంది. ఇది చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ లైక్స్ కొట్టేస్తున్నారు.(ఇదీ చదవండి: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'ప్రభాస్'.. ఎలా సాధ్యమైంది..?) View this post on Instagram A post shared by Sai Praseedha Uppalapati (@praseedhauppalapati) -
ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'ప్రభాస్'.. ఎలా సాధ్యమైంది..?
'ఈశ్వర్'లా వెండితెరపై అడుగుపెట్టి అభిమానుల చేత 'సాహో' అనిపించుకున్నాడు. నేడు ఇండియన్ బాక్సాఫీస్‌కు 'ఛత్రపతి'లా 'ఏక్ నిరంజన్' అయ్యాడు. కేవలం రూ.100 కోట్లకే పరిమితమైన తెలుగు చిత్ర పరిశ్రమ మార్కెట్‌ను ఏకంగా రూ.2 వేల కోట్లకు చేర్చి తెలుగోడి సత్తా ఏంటో బాలీవుడ్‌కు పరిచయం చేశాడు. తను పుట్టిన గడ్డపై ప్రకృతి కన్నేర్ర చేస్తే తనవంతుగా 'పౌర్ణమి' లాంటి వెలుగును అందింస్తాడు. సిల్వర్ స్క్రీన్‌పై పౌరుషంతో కదం తొక్కే 'మిర్చి'లాంటి కుర్రాడిగానే కనిపిస్తూనే అమ్మాయిల కలల రాకుమారుడిగా 'డార్లింగ్' అని పిలిపించుకుంటాడు. ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్‌లో 'సలార్' రూలింగ్ మాత్రమే జరుగుతుంది. ఇవాళ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా మరిన్ని విషయాలు మీ కోసం..ప్రభాస్ పూర్తి పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి. అందరూ ముద్దుగా ప్రభ, డార్లింగ్ అని పిలుస్తారు. చిన్నప్పటి నుంచి నటుడవ్వాలని ప్రభాస్ ఎప్పుడూ అనుకోలేదు. అయితే, ప్రభాస్ మంచి ఎత్తుతో పాటు చాలా గ్లామర్‌గా ఉండటంతో అందరూ ఆయన్ను 'హీరో... హీరో' అని పిలిచేవారట. కానీ సినిమాలంటే చాలా భయపడేవాడట. తనకు తెలిసిన మొదటి హీరో పెదనాన్న కృష్ణంరాజు. ఆయనకు ప్రభాస్ బిగ్ ఫ్యాన్ కూడా... ఓ రోజు భక్తకన్నప్ప సినిమా షూటింగ్ జరుగుతుంటే అక్కడికి ప్రభాస్ కూడా వెళ్లాడు.. అలా సినిమా సెట్లోని వాతావరణానికి అలవాటు పడ్డాడు. రోజూ పెదనాన్న కృష్ణంరాజు నటించిన సినిమాలు చూస్తూ అలా తన కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని డిసైడ్ అయ్యాడు.వరుసగా ప్లాపులొచ్చినా మళ్లీ.. మళ్లీ తిరిగొచ్చాడుకృష్ణంరాజు వారసుడిగా 2002లో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా నటుడు విజయ్ కుమార్ కుమార్తె శ్రీదేవికి కూడా తెలుగులో తొలి సినిమా. ఈ సినిమా విజయం సాధించినా ఆ తర్వాత 2003లో విడుదలైన 'రాఘవేంద్ర' సినిమా పరాజయం పాలైంది. ఈ రెండు చిత్రాలతో నటన, హావభావాలతో ఆకట్టుకున్నాడనే ప్రశంసలు ప్రభాస్‌కు దక్కాయి. కానీ, చిత్రపరిశ్రమలో తన మార్క్ వేయలేకపోయాడు. దీంతో మూడో చిత్రంతో మంచి విజయం అందుకోవాలని చాలా ఆశలు పెట్టుకుని 2004లో త్రిష కాంబినేషన్‌తో 'వర్షం' తెరకెక్కించారు. సినిమా విడుదల తర్వాత పర్వాలేదనే టాక్ మాత్రమే వినిపించింది. దీంతో ఈ చిత్రం కూడా పోయిందని ప్రభాస్ అనుకున్నాడు. అయితే, వారం తర్వాత వర్షంలా కలెక్షన్స్ పెరిగాయి. ఆపై సూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేశాడు. అలా ప్రభాస్ కెరియర్లో తొలి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ప్రభాస్ అడవి రాముడు, చక్రం సినిమాల్లో నటించాడు. ఈ రెండు చిత్రాలు అట్టర్ ఫ్లాప్స్ కావడంతో మళ్లీ వర్షం లాంటి సినిమాతో హిట్ కొట్టాలని ప్రభాస్ తపించాడు. అలాంటి సమయంలో ‘ఛత్రపతి’ (2005) బ్లాక్‌బస్టర్ కొట్టాడు. మళ్లీ రెండేళ్ల పాటు ఒక్క హిట్ లేదు. పౌర్ణమి, యోగి, మున్నా వరుసుగా మళ్లీ పరాజయాలే.. ఇలా ఇండస్ట్రీలో పడిపోయిన ప్రతిసారి తిరిగి తానేంటో నిరూపించుకున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'బుజ్జిగాడు'తో డిఫరెంట్ మ్యానరిజాన్ని టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. 'బిల్లా'తో తనలోని స్టైలిష్ లుక్‌ను పరిచయం చేసిన ప్రభాస్ ఏక్ నిరంజన్‌తో మరో కోణాన్ని పరిచయం చేశాడు. అలా డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి చిత్రాలతో అదరగొట్టేశాడు. బాహుబలి కోసం ఒకేఒక్కడుబాహుబల సమయంలో ప్రతి హీరో ఏడాదికి రెండు సినిమాలు తీస్తున్నాడు. కానీ ప్రభాస్ మాత్రం 'బాహుబలి' కోసం జక్కన్నకి ఐదేళ్లు పూర్తి కాల్షీట్లు ఇచ్చేశాడు. అప్పుడు దేశంలో ఇదో సంచలనం. అన్ని రోజులపాటు మరో సినిమా ఒప్పుకోకుండా నిలబడిని ఏకైక హీరోగా ఆయన పేరుపొందాడు. ఆ సమయంలో అనుష్క,రానా,తమన్నా వంటి వారందరూ వేరే సినిమాలు చేశారు. ప్రభాస్ ఒక్కడే బాహుబలి మొత్తం అయ్యే వరకు ఒకే సినిమాకి పనిచేశాడు. ప్రభాస్ పడిన కష్టానికి ఫలితం దక్కింది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎనలేని గుర్తింపు వచ్చింది. ఇక్కడి నుంచే ప్రభాస్ నటిస్తున్న ప్రతి సినిమా కోసం నార్త్ ఇండియా ప్రేక్షకులూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్,సలార్,కల్కి వంటి చిత్రాలు బాలీవుడ్లో దుమ్మురేపాయి. టాలీవుడ్‌కు ఏమాత్రం తగ్గకుండా అక్కడ కలెక్షన్లు రాబట్టాయి. ఎన్నో ఎళ్ల పాటు బాలీవుడ్‌ను శాసిస్తున్న ఖాన్ హీరోలను ప్రభాస్ వెనక్కు నెట్టేశాడు. ఈ క్రమంలో బాలీవుడ్ కింగ్ కిరీటాన్ని ప్రభాస్ ఎప్పుడో అందుకున్నాడు.ప్రభాస్‌కు స్నేహితులు.. ఆ రెండు సినిమాలు 20 సార్లు చూశాడుప్రభాస్కు అభిమాన హీరో కృష్ణంరాజు అయితే, షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, రాబర్ట్ డి నిరో, జయసుధ, శ్రియ, త్రిష నటన అన్నా ఆయనకు చాలా ఇష్టం. తనకు దగ్గరైన దోస్తులు చాలామందే ఉన్నారు. వారిలో గోపిచంద్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రానా దగ్గుబాటి, మంచు మనోజ్‌లు ప్రభాస్‌కు మంచి స్నేహితులు. అయితే, కెరియర్ పరంగా తనను అత్యున్నత స్థానంలో నిలబెట్టిన డైరెక్టర్‌గా రాజమౌళి అంటే ప్రభాస్‌కి ఎనలేని అభిమానం. ఆయన తర్వాత అంత ఇష్టమైన దర్శకుడు మరొకరు ఉన్నారు. బాలీవుడ్ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ. ఆయన సినిమాలను ప్రభాస్ చాలా ఎక్కువగానే ఇష్టపడతాడు. ఆయన డైరెక్ట్ చేసిన త్రీ ఇడియట్స్, ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్ చిత్రాలను ఇరవైకి పైగా సార్లు చూసినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.ప్రభాస్‌లో ఇవన్నీ ప్రత్యేకం► ప్రముఖ మ్యూజియం మేడమ్ టుసాడ్స్‌లో మైనపు విగ్రహం కలిగిన మొదటి దక్షిణాది స్టార్‌గా ప్రభాస్ గుర్తింపు పొందారు.► కేవలం 'బాహుబలి' ప్రాజెక్టు కోసం ఐదేళ్లు కేటాయించడం► ప్రభాస్ 2014లోనే తొలిసారి హిందీ సినిమాలో మెరిశారు. అజయ్ దేవగణ్, సోనాక్షి సిన్హా కలిసి నటించిన 'యాక్షన్ జాక్సన్'లో అతిథిగా కనిపించారు.► ప్రభాస్‌కు పుస్తకాలు చదవడం అంటే ఎక్కువ ఆసక్తి. ఆయన ఇంట్లో ఓ చిన్న లైబ్రెరీ కూడా ఉందట.► స్టార్డమ్ సొంతం చేసుకుని ఎన్నో ఏళ్లయినా ప్రభాస్ ప్రకటనలకు కాస్త దూరంగా ఉన్నారు. 2015లో తొలిసారి ఓ కారు ప్రచారంలో భాగంగా వాణిజ్య ప్రకటనలో నటించారు.► ప్రభాస్ ఖాతాలో వెయ్యి కోట్లు సాధించిన సినిమాలు రెండు ఉన్నాయి బాహుబలి2, కల్కి 2898AD ► బాహుబలి 2 సినిమా భారతీయ సినిమా చరిత్రలో మొదటి వెయ్యి కోట్లు దాటిన చిత్రం. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 2000 కోట్లు వసూలు చేసింది.► మిర్చి సినిమాకు ఉత్తమనటుడిగా 2013లో నంది అవార్డు దక్కించుకున్న ప్రభాస్► ప్రభాస్ గత 20 ఏళ్లుగా ఏన్నోసేవా కార్యక్రమాలు చేశారు. తుఫాన్ లు, వరదలు వచ్చినప్పుడు, కొవిడ్ సమయంలో భారీ విరాళాలు ఇచ్చారు.► తన 1650 ఎకరాల ఖాజిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ భూమిని దత్తత తీసుకొని తన తండ్రి పేరు మీద ఎకో పార్క్ కు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.► ప్రభాస్ నటుడు కాకపోయుంటే..? హోటల్ రంగంలో స్థిరపడేవారు.► ప్రభాస్‌కు ఏపీలో శ్రీశైలం అంటే ఎంతో ఇష్టం► ఇష్టమైన పాట: 'వర్షం'లోని 'మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం' -
ప్రభాస్ ఇంటి వద్ద భారీగా ఫ్యాన్స్.. పోలీసుల ఆంక్షలు
పాన్ ఇండియా స్టార్ హీరో 'ప్రభాస్' నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దీంతో భారీ సంఖ్యలో అభిమానులు హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి చేరుకున్నారు.. తమ అభిమాన హీరోకు శుభాకాంక్షలు చెప్పాలని సుదూర ప్రాంతాల నుంచి కూడా ఫ్యాన్స్ అక్కడికి వచ్చారు. అర్ధరాత్రి నుంచే ఆయన ఇంటి వద్ద భారీ సంఖ్యలో అభిమానులు చేరడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. వారందరూ అక్కసారిగా మా సలార్ అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే, భారీ సంఖ్యలో ఫ్యాన్స్ రావడంతో ఏమైన సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉందని వారిని పోలీసులు అడ్డుకున్నారు.తమ అభిమాన హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని చాలా ప్రాంతాల నుంచి వచ్చామంటూ అడ్డుకున్న పోలీసులతో ప్రభాస్ ఫ్యాన్స్ వాగ్వాదానికి దిగారు. ఎట్టిపరిస్థితిల్లోనూ ప్రభాస్‌ను కలిశాకే ఇక్కడి నుంచి వెళ్తామంటూ వారందరూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో వారందరినీ పోలీసులు చెదరగొట్టారు. -
బాక్సాఫీస్ బాహుబలి, మిస్టర్ ఫర్ఫెక్ట్, రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
Happy Birthday Prabhas: అజాతశత్రువు.. అందరికి ‘డార్లింగ్’
టాలీవుడ్‌కి చెందిన చాలా మంది హీరోలు అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. కానీ టాలీవుడ్‌నే అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఏకైక స్టార్ ఎవరంటే..అది ప్రభాస్ అనే చెప్పొచ్చు. ఈ ఒక్క పేరు ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది. ఆల్ ఇండియా నెంబర్ వన్ హీరో మన రెబల్ స్టారే అని చెప్పేందుకు మాటలు కాదు ఆయన క్రియేట్ చేస్తున్న నెంబర్స్, రికార్డ్స్ తిరుగులేని నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రభాస్ సినిమాల బాక్సాఫీస్ నెంబర్స్ ట్రేడ్ పరంగా ఒక స్కేలింగ్ అయితే.. ప్రభాస్ సినిమా వస్తుందంటే పిల్లల నుంచి పెద్దల దాకా థియేటర్స్ కు వెళ్లడం ఒక ఫినామినా. ఎప్పుడో ఒకసారి సినిమా చూస్తాం అనే మలి వయసు పెద్దలు కూడా ప్రభాస్ సినిమాకు థియేటర్స్ కు కదలడం ఆయన ఒక యూనివర్సల్ యాక్సెప్టెన్సీ ఉన్న స్టార్ అని తెలియజేస్తుంటుంది. అందుకే బాక్సాఫీస్ దగ్గర డే 1 రికార్డ్స్, ఫస్ట్ వీక్ రికార్డ్స్, వరల్డ్ వైడ్ హయ్యెస్ట్ గ్రాస్, రికార్డ్ స్థాయి ఓవర్సీస్ కలెక్షన్స్ సాధ్యమవుతున్నాయి.ప్రభాస్ చుట్టూ ఉన్న పాజిటివ్ వైబ్స్ ప్రేక్షకుల్ని ఇంతలా ఆకర్షిస్తున్నాయని అనుకోవచ్చు. సలార్ లో ప్రభాస్ హ్యూజ్ యాక్షన్ సీన్స్ చేసినప్పుడు ఆ కటౌట్ కు కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అనుకున్నారు ఆడియెన్స్. అదీ స్క్రీన్ ప్రెజెన్స్ లో ప్రభాస్ కున్న ఛరిష్మా. బాహుబలి నుంచి పాన్ ఇండియా జైత్రయాత్ర మొదలుపెట్టిన ప్రభాస్ ఆ తర్వాత సాహో, సలార్, కల్కి 2898ఎడి సినిమాలతో దిగ్విజయంగా వరుస బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నాడు. వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ రీజనల్ స్టార్స్ కే కాదు ఎంతోమంది బాలీవుడ్ స్టార్స్ కు కూడా ఒక నెరవేరని కల, సాధ్యం కాని ఫీట్. కానీ ప్రభాస్ అలవోకగా బాహుబలి 2, కల్కి 2898 ఎడి సినిమాలతో రెండు సార్లు థౌసండ్ క్రోర్ గ్రాస్ మూవీస్ చేశాడు. బాహుబలి 2 డే 1, 200 కోట్ల రూపాయలు వసూళు చేయడం ట్రేడ్ వర్గాలను అవాక్కయ్యేలా చేసింది. ఈ సినిమా కోసం ప్రభాస్ వెయ్యి రోజుల శ్రమ కలెక్షన్స్ రూపంలో రిజల్ట్ ఇచ్చింది. కల్కి 2898 ఏడి మూవీ 1100 కోట్ల రూపాయల గ్లోబల్ గ్రాస్ కలెక్షన్స్ చేయడం ప్రభాస్ రీసెంట్ గా క్రియేట్ చేసిన ఒక సెన్సేషన్. ప్రభాస్ బిగ్ హీరోనే కాదు బిగ్ టికెట్ హీరో అని ఈ బ్లాక్ బస్టర్స్ ప్రూవ్ చేస్తున్నాయి.ప్రభాస్ సినిమా అంటే ప్రొడ్యూసర్స్, ట్రేడ్ సెక్టార్ లో ఒక గట్టి నమ్మకం ఏర్పడింది. ఆయన సినిమాల మీద ఎంతైనా ఖర్చు పెట్టొచ్చు, ఆ పెట్టుబడికి ప్రభాస్ స్టార్ డమ్, బాక్సాఫీస్ స్టామినానే పూచీ. అందుకే వందల కోట్ల రూపాయలతో బడ్జెట్ తో ప్రభాస్ భారీ పాన్ ఇండియా సినిమాలు నిర్మిస్తున్నాయి ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌసెస్. మారుతి డైరెక్షన్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ది రాజా సాబ్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ నిర్మిస్తున్న సలార్ 2, సందీప్ వంగా దర్శకత్వంలో టీ సిరీస్ నిర్మిస్తున్న స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా...ప్రభాస్ చేస్తున్న హ్యూజ్ ప్రాజెక్ట్స్. వీటిలో ది రాజా సాబ్ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న థియేటర్స్ లోకి రాబోతోంది. మిగతా మూవీస్ చిత్రీకరణలో వివిధ దశల్లో ఉన్నాయి.ప్రభాస్ స్టార్ గానే కాదు వ్యక్తిగానూ అంతే గొప్పవారు. తనను ఇంత పెద్ద స్టార్ ను చేసిన అభిమానులు, ప్రేక్షకులంటే ఆయనకు ఎంతో ప్రేమ. అందుకే సొసైటీలో ఏ విపత్తు జరిగినా ప్రభాస్ ముందుగా స్పందిస్తుంటారు. మిగతా స్టార్స్ కంటే రెట్టింపు డొనేట్ చేస్తుంటారు. ఈ ఏడాది కేరళలో వనయాడ్ విలయానికి విపత్తు సాయంగా తన వంతు 2 కోట్ల రూపాయలు ఇచ్చారు ప్రభాస్, అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం 2 కోట్ల రూపాయలు విరాళం అందించారు. అజాతశత్రువు అనే పాత మాటకు డార్లింగ్ అనే కొత్త అర్థానిచ్చిన ప్రభాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు( అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్‌డే)