ప్రభాస్ ఇంటి వద్ద భారీగా ఫ్యాన్స్‌.. పోలీసుల ఆంక్షలు | Huge Number Of Fans Gathered Outside Prabhas House On His Birthday, Photo Goes Viral | Sakshi
Sakshi News home page

ప్రభాస్ ఇంటి వద్ద భారీగా ఫ్యాన్స్‌.. పోలీసుల ఆంక్షలు

Published Wed, Oct 23 2024 7:45 AM | Last Updated on Wed, Oct 23 2024 10:23 AM

Fans Reached Prabhas House In Huge Numbers

పాన్‌ ఇండియా స్టార్‌ హీరో 'ప్రభాస్‌' నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దీంతో భారీ సంఖ్యలో అభిమానులు హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి చేరుకున్నారు.. తమ అభిమాన హీరోకు శుభాకాంక్షలు చెప్పాలని సుదూర ప్రాంతాల నుంచి కూడా ఫ్యాన్స్‌ అక్కడికి వచ్చారు. అర్ధరాత్రి నుంచే ఆయన ఇంటి వద్ద భారీ సంఖ్యలో అభిమానులు చేరడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. వారందరూ అక్కసారిగా మా సలార్‌ అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే, భారీ సంఖ్యలో ఫ్యాన్స్‌ రావడంతో ఏమైన సమస్యలు తలెత్తే ఛాన్స్‌ ఉందని వారిని పోలీసులు అడ్డుకున్నారు.

తమ అభిమాన హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని చాలా ప్రాంతాల నుంచి వచ్చామంటూ అడ్డుకున్న పోలీసులతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ వాగ్వాదానికి దిగారు. ఎట్టిపరిస్థితిల్లోనూ ప్రభాస్‌ను కలిశాకే ఇక్కడి నుంచి వెళ్తామంటూ వారందరూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో వారందరినీ పోలీసులు చెదరగొట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement