ఢిల్లీ : గత కొన్ని రోజులుగా తనకు బెదిరింపు కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయని రెజ్లర్, బీజేపీ నేత బబితా ఫోగాట్ తెలిపారు. తబ్లీగీ జమాత్తో దేశంలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగాయి. ఇదే విషయానికి సంబంధించి ట్విట్టర్‌లో వివాదస్పద పోస్టులు చేశారు బబితా ఫోగాట్. దీంతో ఆమెను ట్రోల్ చేస్తూ ఓ వర్గం వ్యతిరేకిస్తుంటే, ఆమెకు మద్ధతుగా మరో వర్గం వి సపోర్ట్ బబితా అంటూ పోస్టులు పెడుతున్నారు. దీనికి సంబంధించి బబితా స్పందిస్తూ..నేనే పెట్టిన ప్రతీ పోస్టుకు కట్టుబడి ఉన్నాను. మీ బెదిరింపులకు భయపడటానికి నేనేమీ జైరా వాసిమ్ (దంగల్‌లో బబితా అక్క పాత్ర పోషించిన నటి ) కాదు. బబితా ఫోగాట్ . నేనే తప్పూ చేయలేదు. నా దేశం కోసం పోరాడుతున్నాను అంటూ ట్వీట్ చేశారు. బబితా, ఆమె సోదరి గీతా ఫోగాట్, తండ్రి మహావీర్ సింగ్ ఫోగాట్ జీవితకథ ఆధారంగా దంగల్ సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో గీతా పాత్ర పోషించిన జైరా వాసిమ్ గత సంవత్సరం బాలీవుడ్ నుంచి నిష్ర్కమిస్తున్నట్లు ప్రకటించి పెద్ద చర్చకు దారి తీసింది.
గత ఏడాది బీజేపీలో చేరి హర్యానా నుండి పోటీ చేశారు. కంగనా సోదరి రంగోలి ఇటీవలి చేసిన వివాదస్పద ట్వీట్‌కు కూడా మద్దతు ఇచ్చారు. తదనంతరం కొంతమంది సెలబ్రటీలు చేసిన ఆరోపణలపై స్పందించిన ట్విట్టర్ యాజమాన్యం రంగోలి ఖాతాను తొలగించిన సంగతి తెలిసిందే. దేశంలో కరోనా తగ్గుతుందనుకుంటున్న సమయంలో తబ్లీగీ జబాత్ ఘటన కలకలం రేపింది. ప్రస్తుతం దాదాపు 25 వేలమంది తబ్లీగి కార్యకర్తలను క్వారంటైన్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. దేశంలో 13వేల మంది కోవిడ్ బాధితులుండగా, 400పైగానే మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment