
టోక్యో : జపాన్‌కు చెందిన 28 ఏళ్ల షోబుషి (సుమో రెజ్లర్) కరోనా వైరస్ తో ప్రాణాలు విడిచాడు. కరోనా వైరస్ వల్ల సుమో రెజ్లర్ చనిపోవడం ఇదే తొలి ఘటన. జపాన్ సుమో సంఘం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. రెజ్లర్ షోబుషి అసలు పేరు కియోటకా సుటేకా. అయితే నెల రోజుల క్రితం అతను హాస్పిటల్‌లో చేరాడు. టోక్యో హాస్పిటల్‌లో అతను మృతిచెందినట్లు జపాన్ మీడియా పేర్కొన్నది. 2007లో షోబుషి ప్రొఫెషనల్ సుమో పోటీల్లో పాల్గొన్నాడు. కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్స్‌లో అతను 11వ స్థానంలో నిలిచాడు. ఏప్రిల్‌లో అయిదుగురు సుమో రెజ్లరకు వైరస్ సంక్రమించినట్లు సంఘం పేర్కొన్నది. మహమ్మారి వల్ల మే 24వ తేదీ నుంచి టోక్యోలో జరిగాల్సిన సుమో రెజ్లింగ్ పోటీలను కూడా వాయిదా వేశారు. జపాన్‌లో ఇప్పటి వరకు 16,759 మందికి వైరస్ సంక్రమించింది. 691 మంది మరణించారు.
(‘భారత్ వద్దనుకుంటే టెస్ట్ క్రికెట్ అంతం’)
('నా ఇంటిపై రాళ్లతో దాడి చేశారు')