
4 రోజుల్లో 10 లక్షలమంది.. ఆమ్ ఆద్మీ హవా
ఘజియాబాద్ (ఉత్తరప్రదేశ్): న్యూఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో సంచలన విజయం సాధించి అధికారం కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తుంది. గత నాలుగు రోజుల్లో పది లక్షల మందికిపైగా పార్టీలో చేరారు. ఆసక్తిగలవారు హెల్ప్లైన్ నెంబర్ ద్వారా ఉచితంగా సభ్యత్వం తీసుకోవచ్చని ఆప్ ప్రకటించడం ఆలస్యం అనూహ్య స్పందన వచ్చిందని ఆప్ సీనియర్ మెంబర్ గోపాల్ రాయ్ చెప్పారు. హెల్ప్లైన్ నెంబర్కు ఓ మిస్డ్ కాల్ ఇస్తే ఆప్ వర్గాలు స్పందించేలా ఏర్పాట్లు చేశారు.
కాగా పార్టీ సభ్యత్వం తీసుకునేందుకు ఇంతకంటే పెద్ద సంఖ్యలో స్పందించారని, కాగా సాంకేతిక సమస్యల కారణంగా పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చలేదని రాయ్ తెలిపారు. తొలుత ప్రకటించిన నెంబర్ 07798220033 ద్వారా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో, ఆప్ కొత్తగా మరో రెండు నెంబర్లను '08082807715', '08082807716' ఏర్పాటు చేసింది.