అనంతపురం అగ్రికల్చర్: రానున్న నాలుగు రోజుల్లో నాలుగు నుంచి 6 మి.మీ మేర అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, నోడల్ అధికారి డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అలాగే ఉష్ణోగ్రతలు కాస్తంత పెరిగి పగలు 36 నుంచి 37 డిగ్రీలు, రాత్రిళ్లు 24 నుంచి 25 డిగ్రీలు నమోదు కావచ్చన్నారు.