అమెరికాలో ఉన్న తమ కుమారుడు,కుమార్తె దగ్గరకు వెళ్లాలని ఓ తల్లిదండ్రి ఆశ.. లండన్‌లో ఉంటున్న మనువడు,మనుమరాలిని చూడాలని తాత నాయనమ్మ ఆరాటం.. రష్యాకు వెళ్లి ఉన్నత విద్య అభ్యసించాలని మరో యువకుడి అభిలాష. ఇలా ఎవరైనా విదేశాలకు వెళ్లేవారికి పాస్‌పోర్ట్ తప్పనిసరి. ఇది ఉంటే ఆశయం, ఆకాంక్ష నెరవేరుతుంది. వారి కలను నెరవేర్చేందుకు ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. దరఖాస్తు చేసుకున్న నాలుగురోజుల్లోనే అభ్యర్థులకు పాస్‌పోర్ట్ అందిస్తూ మన్ననలు పొందుతున్నారు.
నల్లగొండ క్రైం : గతంలోపాస్ పోర్టు పొందాలంటే కనీసం 3 నెలల సమయం పట్టేది. విదేశాల్లో ఉన్నవారి వద్దకు వెళ్లాలనే కల కొన్ని సందర్భాల్లో కలగానే ఉండేది. చోట.మోట నాయకుడిని పట్టుకుని తృణమో...ఫలమో అప్పగించి పాస్‌పోర్టు పొందేవారు. ఆర్థికంగా ఇబ్బంది పడటంతో పాటు నెలల తరబడి పాస్‌పోర్టు కోసం అనేక కార్యాలయాలు తిరిగేవారు. డబ్బు ఉన్న మహరాజుకే పాస్‌పోర్టు అందేది. సామాన్యుడికి అందడం కష్టం అనే అభిప్రాయం ప్రజల్లో ఉండేది.
వెరీఫాస్ట్‌గా..
నేడు సామాన్యుడికి పాస్‌పోర్టు అందే విధంగా వెరిపాస్ట్ ఇన్‌సాఫ్ట్‌వేర్ ద్వారా దరఖాస్తు చేసుకున్న నాలుగురోజుల్లోనే పాస్‌పోర్టు చేతికి అందుతోంది. వెరీఫాస్ట్‌గా ఐపాడ్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు విచారణ పోలీసులు చేపడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా పాస్‌పోర్టు కార్యాలయం ఏర్పాటు చేశారు. దరఖాస్తు దారుడి వివరాలు, నేరచరిత్ర, నేర అభియోగాలు, కేసులు, పెండింగ్ కేసులు, వ్యక్తి ప్రవర్తన తదితర అంశాలు అ న్ని ఇంటెలిజెన్‌స, ప్రత్యేక పోలీసులు, ఆయా ప్రాంత పోలీసులు విచారణ చేస్తారు. వారి నివేదిక ఆధారంగా పాస్‌పోర్టు కేంద్ర కార్యాలయం నుంచి పాస్‌పోర్టు చేతికి అందుతోంది. ఈ విషయమై విదేశాల్లో ఉన్న వారికి చెబితే డాడి పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసి రెండు నెలలు తిరిగావు...ఇప్పుడు నాలుగు రోజుల్లో ఎలా సాధ్యమరుు్యంది ? ఏమైన పైరవీ చేశావా లంచం ఎంత ఇచ్చావు ? అని తండ్రితో కుమారుడు అన్న మాటలవి.
విచారణ ఇలా ..
దరఖాస్తు దారుడు ఇచ్చిన అడ్రస్ ఆధారంగా ప్రత్యేక పాస్‌పోర్టు అధికారి ఇంటికి వెళ్లి విచారణ చేస్తాడు. ఇంటి ముందు నిలబెట్టి ఐపాడుతో ఫొటోతీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తాడు. అదే సమయంలో అన్ని విభాగాలు విచారణ చేస్తారుు. అంతా ఆన్‌లైన్‌లో కేంద్ర పాస్‌పోర్టు కార్యాలయానికి చేరవేస్తారు. దరఖాస్తు దారుడిని విచారణ అధికారి సెల్‌నంబర్, పేరు, ఏ సమయానికి వస్తారో అన్న సమాచారం అభ్యర్థి ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా చేరుతుంది. జనవరి నుంచి నేటి వరకు 10026 దరఖాస్తులను విచారించి పాస్‌పోర్టు అందజేయడంతో జిల్లా రాష్ట్రంలో ముందంజలో ఉంది.
ఫీడ్ బ్యాక్ సేకరణ..
పాస్‌పోర్టు ఇచ్చే సమయంలో అభ్యర్థి దగ్గర సంబంధిత అధికారులు డబ్బులు అడిగారా? పాస్‌పోర్టు ఇవ్వడానికి డబ్బుల కోసం తిప్పించుకున్నారా? విచారణకు వస్తున్నట్లు ఎస్‌ఎంఎస్ వచ్చిన దాని ప్రకారం విచారణ అధికారి వచ్చారా ? లేదా ? అన్న విషయం పై ఎస్పీ స్వయంగా అభ్యర్థుల నుంచి ఫీడ్‌బ్యాక్ తెలుసుకుని ప్రక్షాళన చేస్తున్నారు.
ఆశ్చర్యంగా ఉంది
గతంలో నా కుమార్తె పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేస్తే 45 రోజులు పట్టింది. తెలిసిన వారితో సంప్రదించి పాస్‌పోర్టు పొందడంలో ఇబ్బంది ఉండేది. నేను దరఖాస్తు పెట్టుకున్న నాలుగు రోజుల్లో పాస్‌పోర్టు చేతికందడం ఆశ్చర్యంగా ఉంది.
- కృష్ణవేణి, అబ్బాసియాకాలనీ
ఏ ఒక్కటి లేకపోయినా..
స్లాట్‌బుక్ అయిన తరువాత నిర్ణీత తేదీరోజు దరఖాస్తులు పొందుపర్చిన ఆధారంగా అన్ని ఓరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకుపోవాలి. ఏ ఒక్కటి లేకపోయినా ఆలస్యమవుతుంది. విచారణ సమయంలో సరైన ధ్రువపత్రాలు ఇవ్వనందుకు పాస్‌పోర్టు అందడం వారం పట్టింది.
- ఆలెగ్జాండర్ , నల్లగొండ
ఇంత ఫాస్ట్‌గా వస్తుందనుకోలేదు
నాలుగు రోజుల్లో పాస్‌పోర్టు వస్తుందని నాకు తెలియదు. పాస్‌పోర్టు చేతికి అందగానే ఆశ్చ ర్యం అనిపించింది. గతంలో మా బంధువులు పాస్‌పోర్టు పొందడానికి 3 నెలల సమయం పట్టింది.
- సీఐ సురేష్‌బాబు, సీసీఎస్
అంతా ఆన్‌లైన్ ద్వారా..
పాస్‌పోర్టు ఆఫీస్ నుంచి జిల్లా కార్యాలయానికి ఆన్‌లైన్‌లో సమాచారమం దుతుంది. దరఖాస్తుదారుడి వివరా లు అతని ప్రాంత పోలీసుస్టేషన్లకు ,ఎస్ బి అధికారికి ఆన్‌లైన్‌లో ఐప్యాడ్ అందిం చి విచారణ చేపట్టి కేంద్ర కార్యాలయాని కి అందజేస్తాం.
-ధనుంజయ ఎస్‌బి సీఐ