అనంతపురం అగ్రికల్చర్ : రాగల నాలుగు రోజుల్లో ఓ మోస్తరు వర్షం కురిసే సూచనలు ఉన్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రారెడ్డి, నోడల్ అధికారి డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుంచి అందిన సమాచారం మేరకు ఈనెల 14, 15, 16 తేదీల్లో 10 నుంచి 20 మి.మీ మేర వర్షసూచన ఉందన్నారు.